పవర్ స్టార్ సినిమాలో బాలయ్య హీరోయిన్... జాక్ పాట్ కొట్టిసిన బ్యూటీ ఎవరో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలో బాలయ్య హీరోయిన్ ఫిక్స్ అయింది. ఆమె ఎవరో కాదు.. మలయాళ బ్యూటీ హానీ రోజ్. ఇప్పుడు పవన్ కల్యాణ్ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయింది. ఇప్పటికే ఈ హాట్ భామ.. బాలయ్య వీరసింహరెడ్డి సినిమాలో తన అందాలతో కుర్రకారు మతిని పొగొట్టిన ఈ భామ... ఇప్పుడు పవన్ కల్యాణ్ తో రొమాన్స్ చేయనుంది. అసలు ఆ సినిమా ఏంటి.. ఏ సినిమాలో హీరోయిన్ గా చేస్తుందనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉంటునే... సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది ఇప్పటికే బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక సుజిత్ సింగ్ దర్శకత్వంలో ఓజీ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా టీజర్ ఇప్పటికే రిలీజ్ అయి ఆకట్టుకుంటుంది. హంగ్రీ చీతా అంటూ సాంగ్ కూడా రిలీజ్ అయింది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

ఇక పవన్ కల్యాణ్ లైనప్ లో ఉన్న మరో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాను దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలోనే హీరోయిన్ గా బాలయ్య హీరోయిన్ మలయాళ భామ హనీ రోజ్ ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్.
ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమలో ఇప్పటికే పవన్ సరసన శ్రీలీల నటిస్తుందని తెలిసిందే. మరి ఇప్పుడు మరో కీలక పాత్రకోసం హనీ రోజ్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట. ఇప్పటికే బాలయ్య సినిమాలో హానీ రోజ్ నటించిన విషయం తెలిసిందే. వీరసింహ రెడ్డి సినిమాలో బాలయ్యకు మరదలు పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

ఇక పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఇప్పటికే అలనాటి హీరోయిన్ గౌతమి నటిస్తుంది. పవన్ కి తల్లిగా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సినిమాలో గౌతమి నటిస్తున్నట్లు మూవీ టీం నుంచి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సుమారు రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇప్పుడు ఈ సినిమాలో హానీ రోజ్ ఫిక్స్ అవ్వడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఆమె పాత్ర సినిమాను మలుపు తిప్పే పాత్రని తెలుస్తోంది. కచ్చితంగా ఈ సినిమాతో హనీ రోజ్ మరో మెట్టు పైకి ఎక్కుతుందని అంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











