ఆ హీరోపై బాలయ్య హీరోయిన్ సంచలన కామెంట్స్​.. పాపం సెట్​లో తనను అంత నీచంగా చూశారా!

హాట్ బ్యూటీ రాధిక ఆప్టే గురించి తెలిసిందే. అందాల ఆరబోతకు కేరాఫ్ అడ్రెస్​. సూపర్ బోల్డ్ పోజులిస్తూ కుర్రకారు హృదయాలకు చెమటలు పట్టించి కొల్లగొట్టేస్తుంది. తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, బెంగాలీ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. టాలీవుడ్​లో రక్త చరిత్ర సినిమాతో ఏంట్రీ ఇచ్చి ఆ తర్వాత బాలయ్యతో లెజెండ్, లయన్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ భామ అందాలకు ఎంతో మంది తెలుగు సినీ ప్రియులు ఫిదా అయ్యారు. అయితే ఈ నాజూకు అందాల భామ తెలుగు ఫిల్మ్​ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

బాలీవుడ్ బోల్డ్ అండ్ డాషింగ్​ బ్యూటీ రాధికా ఆప్టే తన సినిమాల కన్నా అందాల ప్రదర్శనతోనే ఎక్కువ ఫేమస్​ అయింది. ఎందుకంటే కథ డిమాండ్ చేస్తే న్యూడ్​గా నటించేందుకు రెడీ అంటుందీ భామ. అస్సలు ఎక్కడా తగ్గదు. అయితే ఆమెకు పెద్దగా భారీ సినిమా ఆఫర్స్ లేనప్పటికీ క్రేజ్ మాత్రం అలానే ఉంది. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లలో ఎక్కువగా నటిస్తోంది.

Balayya Heroine Radhika Apte again Sensational Comments on Telugu Film Industry News Goes Viral

మొదటగా ఈమె తెలుగులో రామ్​గోపాల్ వర్మ రక్త చరిత్రతో సిల్వర్​ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. అనంతరం తమిళంలో ధోనీ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు భాషల్లో నటించి ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఈ క్రమంలోనే తెలుగు చిత్రపరిశ్రమలో నందమూరి బాలకృష్ణ సరసన లెజెండ్, లయన్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

తమిళంలో రజనీకాంత్​తో కబలి చిత్రం కూడా చేసింది. అనంతరం బాలీవుడ్‌లోనూ వరుసగా ఆఫర్లను అందుకుని స్టార్ స్టేటస్​ను అందుకుంది. ఫోబియా, విక్రమ్​ వేద, మోనికా, ఓ మై డార్లింగ్ చిత్రాలను చేసింది. బెంగాలీలో అంతహీన్ అనే చిత్రం కూడా చేసింది. ఇక పెళ్లి తర్వాత మాత్రం సినిమాలను సెలెక్టివ్‌గా చేసుకుంటూ కెరీర్​లో ముందుకెళ్తోంది. ఈ మధ్యే తాను డైరెక్టర్‌గా కూడా మారేందుకు రెడీ అవుతున్నట్లు తెలిపింది. త్వరలోనే ఓ సినిమా తెరకెక్కించనున్నట్లు పేర్కొంది.

Balayya Heroine Radhika Apte again Sensational Comments on Telugu Film Industry News Goes Viral

ఇక ఇదే సమయంలో రాధికా పలు వివాదాలకు కూడా కేరాఫ్‌గా నిలిచింది. ముఖ్యంగా బోల్డ్ యాక్టింగ్‌తోనే బాగా విమర్శలు ఎదుర్కొంది. అయితే తాజాగా ఈ భామకు సంబంధంచిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్​ అవుతోంది. ఇందులో ఆమె తెలుగు ఫిల్మ్​ ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్ చేసింది. ఇందులో ఆమె మాట్లాడుతూ..తెలుగు ఇండస్ట్రీలో తాను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు తెలిపింది. పురుష ఆధిపత్య ఇండస్ట్రీ అని చెప్పింది. సెట్​లో ఓ థర్డ్​ పర్సన్​లా ట్రీట్ చేసేవారని, అస్సలు సరిగ్గా పట్టించుకునే వారు కాదని చెప్పింది. ఇలాంటి సంఘటనల వల్ల తాను చాలా ఇబ్బంది పడినట్లు చెప్పుకొచ్చింది.

అయితే ఈ భామ తెలుగులో నటించింది బాలయ్యతోనే. ఇతర హీరోలతో నటించలేదు. మరి ఎందుకు ఈ మాట, ఎవరిని ఉద్దేశించి అన్నదో క్లారిటీ లేదు. మరో విషయమేమిటంటే ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ఈ రాధికా ఆప్టే వీడియో లేటెస్ట్ ది కాదు! పాతదే అని అర్థమవుతోంది. కానీ దీన్నే మళ్లీ కొంతమంది నెటిజన్లు బాగా ట్రెండ్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X