Bandhavi Sridhar : సెగలు రేపుతున్న మసూద బ్యూటీ .. దెయ్యం పిల్ల అందానికి బలి కావాల్సిందే
సీనియర్ నటి సంగీత ప్రధాన పాత్ర పోషించగా తెలుగులో వచ్చిన హార్రర్ మూవీ మసూద చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అందులో దెయ్యం పట్టిన అమ్మాయిగా నటించిన బాంధవి శ్రీధర్ బాగా గుర్తుండిపోయారు. క్యూట్ లుక్స్‌తో, మెస్మరైజింగ్ స్మైల్‌తో ఆ అమ్మాయికి మంచి మార్కులే పడ్డాయి. అచ్చ తెలుగు అమ్మాయి అయిన బాంధవి ఇప్పుడు మరింత అందంగా తయారయ్యారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన బాంధవి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడానికి ముందు బాలనటిగా అలరించారు. మిస్టర్ పర్ఫెక్ట్, రభస, మొగుడు, రామయ్య వస్తావయ్య , మజ్ను తదితర సినిమాలలో నటించింది. 2019లో జరిగిన మిస్ ఇండియా పోటీలలో రన్నరప్‌గా నిలిచారు. అదే ఏడాది జరిగిన మిస్ ఆంధ్రప్రదేశ్ 2019 పోటీల్లో విజేతగా నిలిచి సంచలనం సృష్టించారు. మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు బాంధవి శ్రీధర్ . అయితే మసూద ఆమెకు బ్రేక్ ఇచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు బాంధవికి కూడా మంచి పేరు తీసుకొచ్చింది.

మసూద హిట్ అయినా బాంధవి ఎక్కడా కనిపించకపోవడంతో ఈ పిల్ల సినిమాలు చేయదా అని అంతా అనుకున్నారు. కానీ ఈమె తన ప్రయత్నాలు తాను గట్టిగానే చేస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీ డియోల్ హీరోగా తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న జాట్‌లో బాంధవి ఛాన్స్ కొట్టేసింది. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి.
జాట్‌లో రెజీనా కసాండ్రా, సయామి ఖేర్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అయేషా ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2025లో జాట్ విడుదల కానుండగా.. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. కొద్దిరోజుల క్రితం సన్నీ డియోల్ బర్త్ డే సందర్భంగా జాట్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. గొడ్డలి పట్టుకుని కోపంతో ఊగిపోతూ వస్తున్న సన్నీ లుక్ వైలెంట్‌గా ఉంది.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే బాంధవి శ్రీధర్ ఎప్పటికప్పుడు తన కొత్త సినిమా సంగతులు, ఇతర విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అన్నింటికి మించి హాట్ ఫోటో షూట్‌లతో కుర్రకారులో సెగలు రేపుతుంటారు. తాజాగా బ్లాక్ కలర్ డీప్ నెక్ ఔట్‌ఫిట్‌లో నడుము, ఎద అందాలు చూపిస్తున్న ఫోటోలను బాంధవి షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ షేర్ అవుతున్నాయి. మరి ఇంకేందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











