విజయ్ గెలుపు వేళ.. త్రిషపై బండ్ల గణేష్ సెన్సేషనల్ కామెంట్
తమిళనాడు రాజకీయాల్లో సినీ నటి త్రిష కృష్ణన్ ప్రత్యేక ఆకర్షణగా మారారు. అనేక వివాదాస్పద అంశాల్లో ఆమె పేరు స్పష్టంగా వినిపించింది. అయితే విజయ్‌తో వివాహేతర సంబంధం అనే అంశం తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. అయితే త్రిషా మాత్రం తన మౌనాన్ని అన్ని ప్రశ్నలకు సమాధానంగా మార్చుకొన్నారు. తనపై వచ్చిన విమర్శలకు ఎలాంటి జవాబు ఇవ్వకుండా చిరునవ్వుతోనే వాటిని అధిగమించారు.
అయితే విజయ్ రాజకీయ ప్రస్థానంలో త్రిష పాత్ర విస్మరించలేనిదనే విషయాన్ని పొలిటికల్ అనలిస్టులు పేర్కొంటున్నారు. అయితే విజయ్ గెలుపు బాటలో ప్రయాణిస్తున్న సమయంలో ఆమె తిరుమలలో శ్రీవారిని దర్శించుకొన్నారు. ఆమె తన జన్మదినాన్ని ఘనంగా జరుపుకొన్నారు. అయితే ఈ సమయంలో నిర్మాత బండ్ల గణేష్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ వివరాల్లోకి వెళితే..

గత కొన్నేళ్లుగా విజయ్‌తో త్రిషా సహ జీవనం చేస్తున్నారనే వార్తలు తమిళ రాజకీయాల్లో ప్రభావం చూపాయి. ప్రత్యక్షంగా విజయ్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోయినా.. పరోక్షంగా తన ప్రభావాన్ని చూపించారు అని తమిళ రాజకీయ విశ్లేషకులు అభిపడుతున్నారు. ప్రస్తుతం విజయ్ గెలుపు వేళ అందరి కళ్లూ త్రిషపై ఉన్నాయని చెప్పాలి. ఈ క్రమంలో యాదృచ్ఛికంగా ఆమె పుట్టిన రోజు, తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఒకే రోజు కావడం ఓ రకమైన ప్రాధాన్యత సంతరించుకొన్నది.
త్రిషా తన 43వ పుట్టిన రోజు సందర్భంగా తిరుమలలోని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకొన్నారు. ఆమెకు టీటీటీ అధికారులు, ప్రతినిధులు స్వాగతం పలికారు. ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆమెకు స్వామివారి ప్రసాదాలు అందజేశారు. ఆమె మీడియాతో మాట్లాడకుండా చిరునవ్వులు చిందిస్తూ వెళ్లిపోయారు. ఆమె తిరుమల పర్యటన ప్రస్తుతం జాతీయ మీడియాలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది.
త్రిషా తిరుమలలో శ్రీవారిని దర్శించుకొన్న సమయంలో తెలుగు నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. త్రిషా కృష్ణన్ కంగ్రాట్యులేషన్. మీరు కన్న కలలన్నీ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో సాకారం కావాలి అంటూ ట్వీట్ చేశారు. ఆయన కంగ్రాట్స్ చెప్పడంపై రకరకాలు కామెంట్స్ కనబడుతున్నాయి.
త్రిషా, బండ్ల గణేష్ మధ్య సినీ సంబంధాల విషయానికి వస్తే.. పవన్ కల్యాణ్‌తో బండ్ల గణేష్ నిర్మించిన తీన్మార్ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వారిద్దరి మధ్య పరిచయం కొనసాగుతున్నది. ఆ చనువుతోనే ఆమె కోసం ట్వీట్ చేసి ఉంటారని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


Click it and Unblock the Notifications
