Don't Miss!
- News
మోదీ సర్కార్‌పై బీఆర్ఎస్ ప్రత్యక్ష యుద్ధం..!!
- Sports
INDvsNZ: టీమిండియాకు సంప్రదాయ వెల్ కమ్.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ
- Finance
it news: TCS రికార్డుల మోత.. 22 కంపెనీలను వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Avika Gor: ఫస్ట్ టైమ్ బికినిలో షాక్ ఇచ్చిన ఒకప్పటి చిన్నారి పెళ్లి కూతురు.. స్టన్నింగ్!
చూడగానే చిరునవ్వుతో ఎంతగానో ఆకట్టుకునే క్యూట్ హీరోయిన్ అవికా గోర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్నతనం నుంచి నటనతో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన అవికా ఆ తర్వాత కొన్ని సినిమాలతో కూడా తెలుగువారికి బాగా దగ్గరయ్యింది. హిందీలో ఎక్కువ సీరియల్స్ చేసినప్పటికీ కూడా తెలుగులోనే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకుంది అని చెప్పవచ్చు. ఇక మొదటిసారి ఎవరు ఊహించిన విధంగా అవికా బికినీలో దర్శనమిచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆ సీరియల్ ద్వారా..
అవికా గోర్ మొదట పదేళ్ళ వయసులోకి రాక ముందే కొన్ని సీరియల్స్ లో నటించింది. ముఖ్యంగా బాలికా వదు సీరియల్ ఆమెకు మంచి గుర్తింపును అందించింది. ఆ సీరియల్ 2008లో ప్రసారమైన విషయం తెలిసిందే. ఇక తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేయగా మంచి క్రేజ్ అయితే అందుకుంది. ఇక ఆ తర్వాత యుక్త వయసులోకి రాగానే ఆమె ఉయ్యాల జంపాల సినిమాతో మొదటిసారి హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది.

టాలీవుడ్ విజయాలు
చాలా కాలం పాటు హిందీలోనే కొనసాగిన అవికా తెలుగులో కొన్ని మంచి కంటెంట్ ఉన్న సినిమాల్లో కూడా నటించింది. ఒక విధంగా ఆమెకు హిందీలో కంటే తెలుగులోనే మంచి గుర్తింపు లభించింది. ఉయ్యాల జంపాల సినిమా తర్వాత వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. ఇక రాజ్ తరుణ్ తోనే ఆమె చేసిన రెండవ సినిమా చూపిస్తామామా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది.

బుల్లితెరకు గ్యాప్ ఇవ్వకుండా
ఇక తెలుగులో వరుసగా సక్సెస్ లు రావడంతో అవికా గోర్ కు బాలీవుడ్ లో కూడా మంచి సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ అక్కడ ఆమెకు ఊహించినంతగా గుర్తింపు అయితే రాలేదు. కేవలం కొన్ని మీడియం బడ్జెట్ సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా అలాగే సపోర్టింగ్ రోల్స్ మాత్రమే చేసింది. ఇక సినిమాల్లో చేస్తున్నప్పటికీ కూడా అవికా బుల్లితెరకు మాత్రం గ్యాప్ ఇవ్వలేదు. రియాల్టీ షోలలో లేదా సీరియల్స్ లో నటిస్తూనే ఉంది.

బికినీలో షాక్
అలాగే సోషల్ మీడియాలో కూడా అవికా అప్పుడప్పుడు గ్లామరస్ అందాలతో కూడా షాక్ ఇస్తోంది. అప్పుడప్పుడు కొన్ని పొట్టి దుస్తులను కనిపించిన అవికా మెల్లగా గ్లామర్ డోస్ పెంచుతూ వస్తోంది. ఇక రీసెంట్ గానే ఒక్కసారిగా బికినిలో కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. ముఖ్యంగా తెలుగు వారు అయితే అందులో ఉన్నది నిజంగా ఒకప్పటి చిన్నారి పెళ్ళికూతురేనా అని కామెంట్ చేస్తున్నారు.

ఫొటోస్ వైరల్
రీసెంట్ గా మాల్దీవ్స్ కు వెళ్లిన అవికా గోర్ అక్కడ తన స్నేహితులతో కలిసి హాలిడేస్ ను ఎంజాయ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక అలాగే బికినీ లుక్ కు సంబంధించిన ఒక వీడియో కూడా పోస్ట్ చేసింది. ఇక నిమిషాల్లోనే ఆ వీడియో వైరల్ గా మారిపోయింది. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవల నాగచైతన్య థాంక్యూ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించింది. బాలీవుడ్ లో ప్రస్తుతం ఒక 1920 అనే ఒక హారర్ సినిమాలో నటిస్తోంది.