Divyansha Kaushik: బ్లాక్ డ్రెస్సులో మజిలీ పాప మతిపోయే అందం.. లెగ్స్ అందంతో ఘాటైన పోజులు
నాగ చైతన్య మజిలీ మూవీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆయన కెరీర్ లో బెస్ట్ మూవీగా చెప్పొచ్చు. ఈ మూవీలో సమంత కాకుండా మరో హీరోయిన్ కూడా నటించింది. ఫస్టాఫ్ మొత్తం ఈ బ్యూటీనే ఉంటుంది. తనే దివ్యాంశ కౌశిక్. మొదటి సినిమాతోనే అందరి దృష్టి ఆకర్షించింది.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పటికీ, ఈ అమ్మడుకి వెంటనే అనుకున్నంత గొప్పగా అవకాశాలు రాలేదు. కానీ నెమ్మదిగా అవకాశాలు చేజిక్కించుకుంటోంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన గ్లామర్ తో మాత్రం మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసి: 1997 ఫిబ్రవరి 10న న్యూ ఢిల్లీలో దివ్యాంశ కౌశిక్ జన్మించారు. దివ్యాంశ తల్లి అంజు కౌశిక్ బాలీవుడ్‌లో మేకప్ ఆర్టిస్ట్. ఆమె ఎక్కువగా సీనియర్ నటి రాణి ముఖర్జీతో పని చేశారు. ముస్సోరీ ఇంటర్నేషనల్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత దివ్యాంశ కౌశిక్.. మోడల్‌గా కెరీర్ ఆరంభించారు. మోడల్‌గా ఎదిగేందుకు ఢిల్లీ నుంచి ముంబై మారారు. ఇప్పుడు సినిమాల్లో మెరుస్తున్నారు.

ఆ తర్వాత రెండు, మూడు చిత్రాల్లో: తెలుగులో మజిలీతో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ ఆ తర్వాత రెండు, మూడు చిత్రాల్లో నటించింది. ఇక 2022లో 'రామారావు ఆన్ డ్యూటీ'లో రవితేజ సరసన కథానాయికగా నటించారు. ఈ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. సందీప్ కిషన్ మైఖేల్ మూవీలోనూ మెరిసింది. తెలుగులోనే కాదు బాలీవుడ్ లోనూ రంగ ప్రవేశం చేసింది. 2021లో వచ్చిన 'ది వైఫ్' సినిమాతో దివ్యాంశ కౌశిక్ హిందీ చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది. కానీ అది కూడా పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు.

టక్కర్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది: దీంతో, దివ్యాంశ మళ్లీ దక్షిణాది చిత్రాలపై తన ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే హీరో సిద్ధార్థ్ సరసన టక్కర్ మూవీలో ఛాన్సొ కొట్టేసింది. ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీ పై సిద్ధార్థ్ తో పాటు దివ్యాంశ కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ మూవీ హిట్ నిజంగా వీరిద్దరి కెరీర్ కి చాలా అవసరం అనే చెప్పాలి. ఈ మూవీలో ఆమె నటన చాలా బాగుంటుందని, ఆమెకు మరింత గుర్తింపు వస్తుందని ఇటీవల సిద్ధార్థ్ చెప్పడం విశేషం. ఈ మూవీ ప్రమోషన్స్ లోనూ ఆమె చురుకుగా పాల్గొంటున్నారు.

స్టైలిష్ డ్రెస్సులో ఘాటైన పోజు: ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఓ ఫోటో ని తన సోషల్ మీడియా ఎకౌంట్ లో షేర్ చేసింది. ఆ ఫోటో విపరీతంగా ఆకట్టుకుంటోంది. బ్లాక్ టైట్ లో డ్రెస్ దివ్యాంశ చాలా అందంగా కనపడుతోంది. ట్రాన్సపరెంట్ కలర్ హీల్స్ ధరించింది. ఇక ఆమె లెగ్స్ అందాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే. హెయిర్ ఫ్రీగా వదిలేసి, స్టైలిష్ గా ఫోటోకి ఫోజు ఇచ్చింది. ఇప్పుడు ఈ ఫోటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఫోటో చూస్తూంటే హాట్ నెస్ డోస్ పెంచినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











