keerthy suresh: మరోసారి హీటెక్కించేలా గ్లామర్ డోస్ పెంచిన కీర్తి.. ఆ స్కిన్ షోతో అల్ట్రా మోడ్రన్ అవతార్
నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ కీర్తి సురేష్. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన ఈ అమ్మడు తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా టాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించింది. చూడగానే తన నవ్వుతో ఆకట్టుకునే ఈ బ్యూటీ అప్పుడప్పుడు గ్లామర్ డోస్ పెంచుతూ షాక్ ఇస్తోంది. ఇక ఆమె పోస్ట్ చేసే ఫొటోలు కూడా మతిపోగొట్టే విధంగా ఉన్నాయి. రీసెంట్ గా మరోసారి. స్కిన్ షోతో స్టన్ అయ్యేలా చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..
మొదట్లోనే బిజీబిజీగా..:మొదటి సినిమా అనంతరం నేను లోకల్ తో వెంటనే మరో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకుంది. తరువాత మూడో సినిమానే ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జోడీగా అజ్ఞాతవాసి సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. నాలుగు మూవీని ఏకంగా బయోపిక్ కథతో చేయడం విశేషం. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి మూవీలో టైటిల్ రోల్ ని కీర్తి సురేష్ పోషించారు. ఇక ఈ సినిమా ఆమెని నటిగా నెక్స్ట్ లెవల్ గుర్తింపు తెచ్చుకుంది.

నేషనల్ అవార్డు సొంతం:ఏకంగా బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు సైతం కీర్తి సురేష్ మహానటి మూవీతో సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా కీర్తి సురేష్ కి అభినవ సావిత్రి అనే ఫేమ్ ఇచ్చేసింది. ఈ కారణంగా ఆ స్థాయిలోనే తన నెక్స్ట్ సినిమాల నుంచి ఆడియన్స్ పెర్ఫార్మెన్స్ ఆశిస్తూ వచ్చారు.
2018లో వచ్చిన మహానటి సినిమా తర్వాత మరల తెలుగులో నటించడానికి రెండేళ్ల గ్యాప్ తీసుకుంది.

కమర్షియల్ హీరోయిన్ గా..:మిస్ ఇండియా అనే ఫీమేల్ సెంట్రిక్ మూవీతో ప్రయత్నం చేసింది. అది ఫ్లాప్ అయ్యింది. నితిన్ కి జోడీగా రంగ్ దే మూవీలో ఆడిపాడింది. ఆ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. గుడ్ లక్ సఖితో మరో మరో ఫ్లాప్ ఖాతాలో వేసుకుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా నటించిన సర్కారు వారిపాట మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. మహానటి తర్వాత కమర్షియల్ గా కీర్తి సురేష్ ని తెలుగు ఆడియన్స్ యాక్సప్ట్ చేయడానికి ఐదేళ్లు పట్టింది.

ప్రస్తుతం కూడా బిజీ హీరోయిన్:తాజాగా దసరా మూవీతో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది. అయితే తమిళంలో మాత్రం అగ్ర హీరోయిన్ గా ఈమె దూసుకుపోతోంది. ప్రస్తుతం తెలుగులో భోళా శంకర్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి చెల్లెల్లుగా కీర్తి సురేష్ నటిస్తూ ఉండగా తమిళంలో హీరోయిన్ గా మూడు సినిమాలు చేస్తోంది. అందులో ఒకటి జయం రవి హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ సెరిన్ కాగా మిగిలిన రెండు ఫీమేల్ సెంట్రిక్ కథలతో కావడం విశేషం.

గ్లామర్ డోస్ పెంచుతున్న కీర్తి:ఇదిలా ఉంటే కెరియర్ ఆరంభంలో బొద్దుగా ఉండే కీర్తి సురేష్ ప్రస్తుతం స్లిమ్ అయిపోయి జీరో సైజ్ లోకి వచ్చేసింది. అలాగే కెరియర్ లో గ్లామర్ పరంగా హద్దులు పెట్టుకున్న ఈ అమ్మడు ఇప్పుడు వాటిని పక్కన పెట్టి డోస్ పెంచింది అని చెప్పాలి. అల్ట్రా మోడ్రన్ గా మారి రోజు రోజుకి హాట్ హాట్ ఫోటో షూట్ లతో సోషల్ మీడియాలో కీర్తి సురేష్ హీట్ పుట్టిస్తుంది. రెగ్యులర్ గా అందాల ప్రదర్శనతో కుర్రాళ్ళకి చెమటలు పట్టిస్తోంది.
లెస్ లాంగ్ ఫ్రాక్ లో కవ్వించే చూపులతో..:ఇప్పటి వరకు ఒక చట్రంలో ఇరుక్కుపోయిన కీర్తి సురేష్ తన ఫేమ్ ని మార్చుకుంటూ వెళ్తోంది అనే మాట వినిపిస్తోంది. కమర్షియల్ హీరోయిన్ గా సక్సెస్ కావాలంటే కచ్చితంగా గ్లామర్ పరంగా నార్త్ ఇండియన్ బ్యూటీస్ కి పోటీ ఇచ్చే రేంజ్ లో ఉండాలని ఈ అమ్మడు ఫిక్స్ అయ్యి ఆ దిశగానే తన అడుగులు వేస్తోంది. తాజాగా మరోసారి కీర్తి సురేష్ ఇంస్టాగ్రామ్ లో వేడి పుట్టించే విధంగా అందాల ప్రదర్శన చేసింది. స్లీవ్ లెస్ లాంగ్ ఫ్రాక్ లో కవ్వించే చూపులతో కుర్రాళ్ళకి సెగలు పుట్టిస్తుంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











