Nidhhi Agerwal: తెల్లటి డ్రెస్సులో అందాల నిధి.. ఇలా అందాలు ఆరబోయడంలో ఎవరైనా నీ తరువాతే నిధి!
కొంతమంది వారి సినిమాలతో కంటే కూడా గ్లామర్ తో ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో నిధి అగర్వాల్ టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. అమ్మడు ఎలాంటి స్టిల్ ఇచ్చినా సరే అందులో గ్లామర్ డోస్ హై రేంజ్ లో ఉంటుంది. ఆమె ఇప్పటివరకు చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ గ్లామర్ తో మాత్రం ఎక్కువ స్థాయిలో ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. ఇక నిధి అగర్వాల్ కు సంబంధించిన లేటెస్ట్ ఫొటోలు చూస్తే మతిపోవాల్సిందే. ఆ వివరాల్లోకి వెళితే..
వరుసగా విభిన్నమైన సినిమాలు: నిధి అగర్వాల్.. 2017లో మున్నా మైకేల్ అనే హిందీ చిత్రం బాలీవుడ్ లో అడుగు పెట్టిందీ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఏడాది సవ్యసాచి సినిమాతో తెలుగు సినీ రంగంలోనూ కాలు మోపింది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, ఇక్క, ఇస్మార్ట్ శంకర్, మాస్క్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తన అందం, అభినయంతో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమె.. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా రాబోతున్న హరిహర వీరమల్ల చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

సోషల్ మీడియాలో మంచి క్రేజ్: అయితే ఇటు తెలుగు అటు హిందీ సినిమాల్లో ఎప్పుడూ బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అందమైన ఫొటోలను షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంటుంది. అంతే కాకుండా తనకు సంబంధించిన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ సామాజిక మాధ్యమాల వేధికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది.

తెల్లటి డ్రెస్సులో మల్లెపూవులా: తెల్లటి డ్రెస్సులో మల్లెపూవులా మెరిసిపోయింది. ఎద అందాలతో పాటు క్లీవేజ్ షో చేస్తున్న ఈ క్యూట్ బ్యూటీని చూసిన ఎవ్వరైనా ఫిదా అయిపోవాల్సిందే. ఎద నుంచి కిందకు మాత్రమే ఉన్న ఈ డ్రెస్సులో నిధి అందాలు వర్ణించడం చాలా కష్టమే. హెయిర్ లీవ్ చేసుకొని పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకొని, సింపుల్ బ్రేస్ లెట్ విత్ ఫ్లాట్ చెప్పల్ తో బెడ్ పై కూర్చొని అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది.

ఫ్యాన్స్ కామెంట్స్ మామూలుగా లేవు: ఈ ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. లైకులు షేర్లతో తెగ రచ్చ చేస్తున్నారు. మల్లెపూవు కన్నా అందంగా ఉన్నావని కొందరు, నీ అందం చూస్తుంటే తట్టుకోలేక పోతున్నామని మరికొందరు చెప్పుకొస్తున్నారు. నీ అందాలను చూస్తుంటేనే పిచ్చెక్కి పోతుందని కొందరు, చాలా హాట్ గా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు.

తమిళ్ తెలుగులో బిజీబిజీగా: నిధి అగర్వాల్ పుట్టింది హైదరాబాద్ లోనే అయినా ఆమెకు తెలుగు, హిందీతో పాటు తమిళ్, కన్నడ భాషలు కూడా వచ్చు. ప్రస్తుతానికి ఈమె టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో మాత్రమే సినిమాలు చేస్తుంది. కానీ ముందు ముందు తమిళ్, కన్నడ భాషల్లోనూ నటించే అవకాశం ఉందని అంతా అనుకుంటున్నారు. చూడాలి మరి ఈ అందాల ముద్దుగుమ్మ ఎలాంటి చిత్రాల్లో నటించి, ఎంతటి స్థాయికి ఎదుగుతుందో.


Click it and Unblock the Notifications











