Raashi Khanna: ఈసారి అంతకుమించి అనేలా రాశి ఖన్నా సొగసుల ఘాటు.. మైండ్ బ్లోయింగ్ స్టిల్స్
గ్లామరస్ బ్యూటీలు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఇక వారిలో రెగ్యులర్ గా గ్లామర్ డోస్ పెంచే వారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే కాస్త గీత దాటకుండ ఉండే బ్యూటీలు సైతం ఈ మధ్య హై లెవెల్లో గ్లామర్ డోస్ పెంచుతున్నారు. వారి ఫొటోలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఇక రాశి ఖన్నా కూడా అదే రేంజ్ లో షాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. అమ్మడు ఎలాంటి స్టిల్ ఇచ్చినా కూడా అందులో అందాల అరబోత ఉండాల్సిందే అనేలా స్టిల్స్ ఇస్తోంది. ఇక రీసెంట్ గా పోస్ట్ చేసిన కొన్ని ఫొటోల వివరాల్లోకి వెళితే...
వెబ్ సీరీస్ లతో కూడా బిజీబిజీగా:టాలీవుడ్ అందాల భామ రాశీఖన్నా ప్రస్తుతం ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే ఉంది. హిందీలో కమర్షియల్ హీరోయిన్ గా సక్సెస్ కావాలని ప్రయత్నం చేస్తోంది. ఆ దిశగానే వెబ్ సిరీస్ లతో అడుగులు వేసింది. ఇప్పటికే రుద్రా, ఫర్జీ వెబ్ సిరీస్ లలో రాశీఖన్నా నటించింది. ఈ రెండు వెబ్ సిరీస్ లు ఆమెకి నటిగా మంచి గుర్తింపు తీసుకొచ్చారు. దీంతో హిందీలో సినిమా ఆఫర్ కూడా వస్తోంది. ఆ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.

బిగ్ బడ్జెట్ బాలీవుడ్ మూవీస్:యోదా టైటిల్ తో తెరకెక్కుతోన్న ఆ సినిమాలో సిద్దార్ద్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నాడు. సెప్టెంబర్ 15న ఈ మూవీ రిలీజ్ కానుంది. కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్నారు. దీంతో పాటు హిందీలో అరణ్మనై 4, మేథావి సినిమాలు చేస్తోంది. తెలుగులో ఆమె చివరిగా గత ఏడాది థాంక్యూ మూవీతో ప్రేక్షకులని పలకరించింది.

సోషల్ మీడియాలో గ్లామర్ డోస్:అయితే ఆమె ఫోకస్ అంతా హిందీపై ఉండటంతో తెలుగు సినిమాలకి అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదనే మాట వినిపిస్తోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం రాశీఖన్నా రెగ్యులర్ అప్డేట్స్ తో ఫ్యాన్స్ ని పలకరిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్ లతో ఫాలోవర్స్ కి కావాల్సినంత వినోదం అందిస్తోంది. ఈమె ఫోటోలకి లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి.
మరోసారి రాశిఖన్నా స్టన్నింగ్ స్టిల్స్:తాజాగా మరోసారి ఇన్ స్టాగ్రామ్ లో రాశీఖాన్నా హాట్ ఫోటోలతో సెగలు రేపుతోంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. బ్లాక్ కలర్ లాంగ్ ఫ్రాక్ లో ఘాటుగా ఎద అందాలని అందంగా చూపిస్తోంది. అలాగే థైస్ సోకులతో టెంప్ట్ చేస్తోంది. ఈఫోటో పెట్టిన ఫోజులు అయితే కుర్రాళ్ళ హృదయాలనీ మరింత వేడి పుట్టిస్తున్నాయనే కామెంట్స్ వస్తున్నాయి. రెడ్ కలర్ బ్యాగ్రౌండ్ తో బంగారు వర్ణంలో రాశీఖన్నా దేహపు అందాలు మెరిసిపోతున్నాయి. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇన్ స్టాగ్రామ్ లో అయితే ఏకంగా 4.58 లక్షల మంది లైక్ చేయడం విశేషం. ఎన్నడూ లేనంత హాట్ గా రాశీఖన్నా ఈ బ్లాక్ డ్రెస్ ఫ్రాక్ లో కనిపిస్తూ ఉండటం విశేషం.


Click it and Unblock the Notifications











