Sonal Chauhan: బికినీలో కంటే ఘాటైన లుక్కుతో సోనాల్.. ఆ అందం హైలెట్ అయ్యేలా స్టిల్!
సోనాల్ చౌహాన్ మొదట మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి అనంతరం సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. చిత్ర పరిశ్రమలో తొందరగానే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి తన గ్లామర్ తో కూడా షాక్ ఇస్తూ ఉంటుంది. ఇక అమ్మడు ఎలాంటి ఫొటో పోస్ట్ చేసినా కూడా షాక్ అవ్వాల్సిందే. రీసెంట్ గా మరోసారి తన ఘాటైన లెగ్స్ అందాలతో స్టన్ అయ్యేలా చేసింది. ఆ స్టిల్ వివరాల్లోకి వెళితే..
మోడల్‌గా గుర్తింపు : సోనాల్ 1985 మే 16న ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో జన్మించింది. అక్కడే అమ్మడు పాఠశాల విద్యను పూర్తి చేసి అనంతరం ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఢిల్లీకి వెళ్లింది. సోనాల్ మోడల్‌గా మిస్ వరల్డ్ టూరిజం 2005 పోటీలో పాల్గొంది. అక్కడ ఆమె మిస్ వరల్డ్ టూరిజం టైటిల్‌ను గెలుచుకుంది. అదే ఆమె కెరీర్‌లో ఒక మలుపు, అనంతరం చిత్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది.

మొదట్లోనే గ్లామరస్ బ్యూటీగా..: 2008లో, కునాల్ దేశ్‌ముఖ్ దర్శకత్వం వహించిన "జన్నత్" చిత్రంతో సోనాల్ హిందీ చిత్ర పరిశ్రమలో తన కెరీర్ ను స్టార్ట్ చేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఇక సోనాల్ తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మొదట్లోనే గ్లామరస్ పాత్రలతో అమ్మడు కుర్రాళ్ళను బాగానే ఎట్రాక్ట్ చేసింది.
టాలీవుడ్ లో ఇలా..: ఈ బ్యూటీ తెలుగులో కూడా సినిమాలు సిగేసింది. "రెయిన్‌బో, లెజెండ్, పండగ చేస్కో వంటి అనేక తెలుగు చిత్రాలలో నటించింది. ఇక నందమూరి బాలకృష్ణ తో చేసిమా లెజెండ్, రులార్ సినిమాలు కూడా కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. అనంతరం అమ్మడు సౌత్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది.
మ్యూజిక్ వీడియోలలో కూడా.. : సోనాల్ ఇంజి ఇడుప్పజగి, సుందరపాండియన్ అనే కొన్ని తమిళ చిత్రాలలో కూడా నటింసిగింది. ఇక "తూ హి మేరా" , "ఆజ్ ఫిర్ తుంపే ప్యార్ ఆయా హై" వంటి ప్రముఖ మ్యూజిక్ వీడియోలలో నటించడం ద్వారా ఆ రూట్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంది. సోనాల్ తన నటనా నైపుణ్యంతో పాటు అందం, ఫిట్‌నెస్‌తో కూడా పేరుగాంచింది.

పలు సినిమాలతో అవార్డులు : ఇక సోనాల్ పలు సినిమాలతో ప్రత్యేకంగా ప్రశంసలు అందుకుంది. అలాగే అవార్డులు కూడా వచ్చాయి. 2010లో, ఆమె తెలుగు చిత్రం "రెయిన్‌బో" ద్వారా తన నటనకు ఉత్తమ నూతన నటిగా సౌత్ స్కోప్ స్టైల్ అవార్డును గెలుచుకుంది. లెజెండ్ లో ఆమె నటనకు ఉత్తమ సహాయ నటిగా SIIMA అవార్డుకు కూడా ఎంపికైంది.
బికినీ కంటే ఘాటుగా.. : ఇక సోనాల్ చౌహన్ సోషల్ మీడియాలో ఇటీవల పోస్ట్ చేసినా ఒక ఫోటో కూడా వైరల్ గా మారింది. అమ్మడు లెగ్స్ అందాలను మొత్తం హైలెట్ చేసే విధంగా కనిపించిన విధానం నెటిజన్లను మరీంత ఆశ్చర్యపరిచింది. అమ్మడు గతంలో చాలా సార్లు బికినీలో కనిపించినప్పటికీ కూడా ఈ లుక్ లో మాత్రం అదిరిపోయేలా ఉందని ఫాలోవర్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఈ బ్యూటీ ఇంకా గ్లామర్ డోస్ ఏ రేంజ్ లో పెంచుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











