Ananya Pandey: అతి చిన్న నిక్కరులో లైగర్ పాప హై గ్లామర్ డోస్.. సుఖంగా ఉంది అంటూ..

ఇటీవల సినిమాలతో సక్సెస్ వచ్చినా రాకపోయినా కూడా కొంతమంది హీరోయిన్స్ అయితే సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ అయితే అందుకుంటున్నారు. ఇక అలాంటి బ్యూటీలలో అనన్య పాండే కూడా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ బ్యూటీ ఎలాంటి ఫోటో పోస్ట్ చేసిన కూడా సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్ అవుతూ ఉంటాయి. ఇక రీసెంట్గా అమ్మడు మరోసారి చిన్న నిక్కరులో కనిపించి కుర్రాళ్ల గుండెల్లో వేగాన్ని పెంచింది. అందుకు సంబంధించిన ఫోటోల వివరాల్లోకి వెళితే..

మొదట్లోనే లక్కీ ఛాన్స్ : గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న అనన్య పాండే బ్యాక్ గ్రౌండ్ తోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆమె తండ్రి ఛంకి పాండే బాలీవుడ్లో మంచి నటుడిగా గుర్తింపునందుకున్న విషయం తెలిసిందే. ఇక ఆయన గారాల కూతురుగా అమ్మడు మొదట్లోనే మంచి సినిమా అవకాశాలు అందుకుంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాలో ఛాన్స్ కొట్టేసి అమ్మడు మంచి సక్సెస్ అయితే తన ఖాతాలో వేసుకుంది.

ananya pandey stunning look

అతని సహాయంతో : ఇక వచ్చిన కొత్తలోనే అనన్య పాండేకు చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ తొందరపడకుండా అమ్మడు కేవలం తనకు సెట్ అయ్యే మంచి కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంది. ఆమె కెరియర్ కు బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ కూడా సహాయపడినట్లు బాలీవుడ్ మీడియాలో కూడా నిత్యం కథనాలు వెలువడుతూనే ఉంటాయి. అతని సలహాతోనే ఇప్పటివరకు అనన్య పాండే ప్రతి కథను సెలెక్ట్ చేసుకున్నట్లు టాక్ అయితే వస్తుంది.

దారుణంగా డిజాస్టర్ : ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న లైగర్ సినిమా మాత్రం ఆమెకు కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఆ సినిమా పాన్ ఇండియా కు తగ్గట్టు బాగానే పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేసింది. కానీ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అయ్యింది. అనన్య పాండే నటనపై కూడా కొన్ని ట్రోలింగ్స్ వచ్చాయి. దీంతో అమ్మడు చాలా డిజప్పాయింట్ అయిందని బాలీవుడ్ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి.

ananya pandey stunning look

చిన్న నిక్కరులో : ఇక ఆ సినిమా ఫెయిల్యూర్ తర్వాత అనన్య పాండే ఏమాత్రం ఖాళీగా ఉండకుండా మరికొన్ని సినిమాలతో బిజీ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఇక గ్యాప్ దొరికిన ప్రతిసారి ఆమె హాలిడేస్ కు వెళ్లి ఎంజాయ్ చేస్తోంది. రీసెంట్ గా అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫోటో చూస్తే అబ్బాయిలు షాక్ అవ్వాల్సిందే. చిన్న నిక్కరులో అనన్య పాండే తన వయ్యారాలను అందంగా హైలెట్ చేసింది. ఒక నది దగ్గర అమ్మడు ఎదో పుస్తకం చదువుతున్నట్లు కనిపిస్తోంది. చాలా సుఖంగా ఉందని కూడా ఆ ఫొటోకు ఒక క్యాప్షన్ ఇచ్చింది.

బ్యూటీఫుల్ అంటూ : ఇక అనన్య తన బ్యాక్ చూపించిన విధానం కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అంటూ నెటిజన్లు పాజిటివ్ గానే కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం లైన్ లో మూడు సినిమాలు ఉన్నాయి. ఎలాగైనా ఆ సినిమాలతో సక్సెస్ అందుకొని బాలీవుడ్లో బిజీ హీరోయిన్ గా మారాలి అని ప్రయత్నాలు చేస్తోంది. అలాగే సౌత్ నుంచి కూడా మంచి ఆఫర్లు వస్తే ఓకే చేయాలని అనుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X