Don't Miss!
- News
కేంద్ర బడ్జెట్‌పై బీజేపీ బిగ్ స్కెచ్- ఏపీ సహా: 12 రోజుల పాటు..!!
- Finance
Jio laptop: మార్కెట్లోకి Jio ల్యాప్ ట్యాప్.. ఫీచర్లు, ధర చూస్తే వావ్ అనాల్సిందే !!
- Sports
INDvsNZ : మూడో టీ20లో ఈ రికార్డులు బద్దలవడం ఖాయం.. సూర్య సాధిస్తాడా?
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Meera Jasmine: మరోసారి స్టన్ అయ్యేలా చేసిందిగా.. ఘాటైన అందాలతో మైండ్ బ్లోయింగ్!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు బ్యూటీఫుల్ హీరోయిన్ గా ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకున్న మీరాజాస్మిన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె అప్పట్లో ఎలాంటి సినిమాలు చేసినా కూడా చాలా ట్రెడిషనల్ గా ఉండేది. ఏ మాత్రం లిమిట్స్ దాటకుండా అవసరమైనంత మేరకు లవ్ సీన్స్ లో ఆమె అందంగా కనిపించేది. కానీ ఇటీవల కాలంలో మీరాజాస్మిన్ ఎవరూ ఊహించని విధంగా దర్శనమిస్తోంది. ఇక మరోసారి ఆమె అందాల ఆరబోతతో షాక్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

మొదట్లోనే..
కేరళలో పుట్టి పెరిగిన మీరాజాస్మిన్ చిన్నతనంలోనే నటనపై ఎంతో ఆసక్తిని పెంచుకుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా మలయాళం సినిమాల్లో నటించిన వారే. ఇక మీరా జాస్మిన్ తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయక ముందు నుంచే సౌత్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకోవాలని అడుగులు వేసింది. ఇక ఆమెకు మొదట్లోనే చాలా మంచి అవకాశాలు వచ్చాయి.

భద్ర సినిమాతో..
మొదట తమిళం మలయాళం సినిమాల్లో చాలా బిజీగా ఉన్న సమయంలో ఆమెకు తెలుగులో ఆఫర్లు వచ్చాయి. కానీ మీరాజాస్మిన్ అప్పట్లో అంతగా తెలుగుపై ఫోకస్ పెట్టలేదు. ఇక చివరికి 2004లో అమ్మాయి బాగుంది అనే ఒక తెలుగు సినిమాతో మంచి క్రేజ్ అందుకొని ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ సినిమా తో పర్వాలేదనిపించింది. భద్ర సినిమా తో మాత్రం బాక్సాఫీస్ హిట్ సొంతం చేసుకుంది.

అప్పట్లో బిజీగా..
2000వ సంవత్సరం నుంచి 2010 వరకు కూడా మీరా జాస్మిన్ గ్యాప్ లేకుండా ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసుకుంటూ వచ్చింది. ఆమెకు పారితోషికం కూడా ప్రతి ఏడాది పెరుగుతూనే వచ్చింది. ఇక భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీలో మంచి నటిగా గుర్తింపును అందుకున్న మీరాజాస్మిన్ 2014 తర్వాత మేయిన్ లీడ్ లో అయితే మళ్లీ కనిపించలేదు.

అందాల ఆరబోత..
నాలుగు పదుల వయసు లోకి వచ్చిన తర్వాత మీరాజాస్మిన్ గతంలో ఎప్పుడూ లేని విధంగా అందాల ఆరబోతతో అందరికీ షాక్ ఇచ్చింది. ఆమె గత కొంత కాలంగా సోషల్ మీడియాలో గ్యాప్ లేకుండా ఫోటోలను పోస్ట్ చేస్తోంది. ఈ ఫోటోలో ఆమె గ్లామర్ డోస్ ఐతే మామూలుగా లేదు.

మరోసారి బ్యూటీఫుల్ స్టిల్
రీసెంట్ గా కూడా మీరాజాస్మిన్ మరోసారి సరికొత్త గ్లామర్ డోస్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. క్లీవేజ్ అందాలను లెగ్స్ అందాలను ఒకేసారి హైలెట్ చేస్తూ అమ్ముడు చూపు తిప్పుకోనివ్వ కుండా చేసింది అని నెటిజన్లు చాలా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. 40 ఏళ్ళ వయస్సులో కూడా మీరాజాస్మిన్ అయితే పాతికేళ్ల అమ్మాయి తరహాలో చాలా బ్యూటిఫుల్ గా ఉంది అని కూడా అంటున్నారు.

ఆ సినిమాలో పవర్ఫుల్ రోల్
అయితే మీరాజాస్మిన్ ఈ తరహాలో గ్లామర్ డోస్ పెంచుతూ ఉండడంతో ఆమెకు కొన్ని అవకాశాలు కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బోయపాటి శ్రీను తెరకెక్కించబోయే పాన్ ఇండియా సినిమాలో ఆమె పవర్ఫుల్ పాత్ర లో కనిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
భద్ర సినిమాతో తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న మీరాజాస్మిన్ మళ్ళీ ఆయన దర్శకత్వంలోనే సినిమా చేయనుందని సమాచారం. మరి బోయపాటి, రామ్ పోతినేని తో చేయబోయే సినిమాలో ద్వారా మీరా జాస్మిన్ ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.