Anjali: 40లోకి రాకముందే హీరోయిన్ అంజలి పెళ్లి.. వరుడు అతనే..?
అంజలి.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఆమె 15 సంవత్సరాలకు పైగా సౌత్ ఇండస్ట్రీ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటిగా కొనసాగుతోంది. అంజలి తన నటనా నైపుణ్యంతో తెలుగు తమిళ ప్రేక్షకులలో మంచి గుర్తింపు అందుకుంది. ఇన్నేళ్ల తర్వాత కూడా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా కొనసాగుతున్న ఆమెకు లీడ్ రోల్స్‌లో ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఇక చాలా కాలం తరువాత అంజలి పెళ్లికి సంబంధించిన వార్తలు మళ్ళీ వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

అలంటి పాత్రల్లో..
నటిగా అంజలి తన కెరీర్‌ను కొనసాగించడానికి చాలా కష్టపడుతోంది. తమిళం తెలుగు సినిమాలు అని తేడా లేకుండా ప్రాజెక్ట్‌లను సెలెక్ట్ చేసుకుంటోంది. ఆమె డిజిటల్ స్పేస్‌ను కూడా అన్వేషిస్తోంది. OTT సినిమాలు వెబ్ సిరీస్‌ల కోసం కూడా పని చేస్తోంది. అంజలి విభిన్న పాత్రలతో చిత్రాలతో ప్రయోగాలు చేస్తూ బోల్డ్ పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. తాజాగా తనలోని బోల్డ్ యాంగిల్‌ని బయటపెట్టిన ఆమె.. కథ డిమాండ్‌ను బట్టి బోల్డ్ సీన్స్ చేయడానికి సిద్ధమని ప్రకటించింది.

తెలుగమ్మాయిగా..
నటి అంజలి జూన్ 16, 1986న ఆంధ్రప్రదేశ్‌లోని రాజోల్‌లో జన్మించింది. అంజలి 2006లో తెలుగు చిత్రం, ఫోటోతో నటిగా కెరీర్ ను ప్రారంభించింది. ఇక 2008 తమిళ చిత్రం కత్తరు తమిజ్‌లో ఆమెకు బ్రేక్ దక్కింది. విమర్శకుల ప్రశంసలు గుర్తింపు లభించాయి. ఇక ఆ తరువాత ఆమె తెలుగు తమిళ్ లో కమర్షియల్ అలాగే కాంటెంట్ ఉన్న లవ్ స్టోరీలు కూడా చేసింది.

తెలుగులో కూడా హిట్ సినిమాలు
అంజలి యొక్క ప్రముఖ చిత్రాలలో తమిళ చిత్రాలు అంగడి తేరు, ఎంగేయుమ్ ఎప్పోదుమ్ , మరియు ఇరైవి వంటి హిట్స్ ఉన్నాయి. ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), మసాలా (2013), గీతాంజలి (2014) వంటి తెలుగు చిత్రాలలో కూడా కనిపించింది. హారర్-కామెడీ చిత్రం గీతాంజలిలో ఆమె నటనకు తెలుగులో ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించింది.

పెళ్లి వార్తలు
ఇక అప్పుడప్పుడు అంజలికి సంబంధించిన పర్సనల్ విషయాలు కూడా మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ అంజలి పెళ్లి గురించి గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలోనే ఆమె హీరోతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి.
ఈ పుకార్లపై నటి క్లారిటీ అయితే ఇచ్చింది లేదు.

వరుడు ఎవరంటే..
అయితే తాజాగా అంజలి తన తల్లిదండ్రులు చూసిన అబ్బాయితో పెళ్లి చేసుకోబోతుందని మరో వార్త వైరల్ అవుతోంది. ఆమె పెళ్లి కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులకు ఈ వార్త ఆనందాన్ని కలిగించిందట. ఈ జూన్‌లో అంజలికి 37 ఏళ్లు నిండనుండగా.. నలభై ఏళ్లలోపు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని కుటుంబ సభ్యులు సూచించడంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.

పెళ్లి ఎప్పుడు?
ప్రస్తుతం అంజలి రామ్ చరణ్ 15వ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఆ బిగ్ బడ్జెట్ ప్లాన్ ఇండియా సినిమాలో అంజలి ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతోంది. ఇక ఈ సినిమా తర్వాత ఆమె పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక త్వరలోనే నిశ్చితార్థం వేడుక కూడా నిర్వహించే అవకాశం ఉన్నట్లు కూడా కథనాలు వెలువడుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో తెలియాలి అంటే అంజలి అధికారికంగా ప్రకటన ఇవ్వాల్సిందే.


Click it and Unblock the Notifications











