For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరీనా కపూర్ బ్యూటీ టిప్స్.. లాక్‌డౌన్‌లో ఫ్యాన్స్‌కు ఊరటనిస్తున్న బెబో

    |

    లాక్ డౌన్ పుణ్యమాని... సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారిన బాలీవుడ్ బ్యూటీ బెబో... అప్పుడప్పుడూ... కొడుకు తైమూర్ అలీఖాన్ ముచ్చట్లు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటోంది. నిజం చెప్పాలంటే... ఈ కష్టకాలంలో అమ్మడి పోస్టులు జనాలకు కాస్తంత రిలీఫ్ ఇస్తున్నాయనే చెప్పాలి. అయితే... తాజాగా అమ్మడు తన సౌందర్య రహస్యాన్ని కూడా సామాజిక మాధ్యమాల ద్వారా చూచాయిగా చెప్పేసింది.

    మాతృదినోత్సవం పురస్కరించుకుని... కొడుకు తైమూర్ తో కెమెరాకు రకరకాల హావభావాలతో ఫోజులిచ్చిన బెబో... మరోసారి టిన్సెల్ టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్యకాలంలో... అమ్మడి నుంచి అప్ డేట్స్ కోసం జనాలు ఎదురు చూపులు కూడా ఎక్కువయ్యాయి. కరీనా పోస్ట్ పెట్టింది అంటే ఏదోక ప్రత్యేకత ఉండే ఉంటుందన్న నమ్మకం నెటిజన్స్ లో ఏర్పడింది.

    రీసెంట్ పోస్ట్ లో కరీనా... ముఖానికి ఏదో ప్యాక్ వేసుకుని, తన జుట్టును వదులుగా ముడివేసుకుని దర్శనమిచ్చింది. ఇలాంటి లుక్ లో అమ్మడు ఎప్పుడూ కనిపించలేదనే చెప్పాలి. అంతేకాదు... ముఖానికి ప్యాక్ వేసుకున్నా.... పౌటింగ్ మాత్రం ఆపలేదు... ఎంతైనా కరీనాకు పౌట్ లిప్సే కదా అందం....

    Bebo Kareena Kapoors beauty tips to fans

    ఇకపోతే... ఈ మధ్య బెబో పెడుతున్న పోస్టుల్లో ఓ విషయం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. సిల్వర్ స్క్రీన్ పై ఫుల్లు మేకప్ తో కనిపించే బెబో... తన పోస్టుల్లో మాత్రం మేకప్ ఫ్రీ లుక్ తో దర్శనమిస్తోంది. అయినా సరే... జనాల్లో ఆమెకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గడంలేదు. అంతేకాదు.. మరింత పెరుగుతోందని కూడా చెప్పొచ్చు.

    మరోవైపు... అమీర్ ఖాన్ తో కలసి లాల్ సింగ్ చద్దా సినిమాలో నటిస్తున్న కరీనా, కరణ్ జోహార్ ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న తక్త్ లోనూ కీలక పాత్ర పోషించబోతోంది. లాక్ డౌన్ ముగిసిన వెంటనే... ఈ సినిమాలు సెట్స్ మీదకు వెళ్లనున్నాయి.

    English summary
    Bollywood actress Kareena Kapoor Khan Shared her beauty tips with fans via Social media platform. Thanked beautician for giving her the best homemade face pack.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X