కాజల్ హనీమూన్ గుట్టు తెలిసిపోయింది.. 5కోట్లు కాదు కదా.. 5 పైసలు కూడా ఖర్చవ్వలేదు

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవల తన ప్రియుడు గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పదేళ్ల ప్రేమాయణం తరువాత ఇద్దరు సంప్రదాయ పద్దతిలో కుటుంబ సభ్యులను ఒప్పించి అక్టోబర్ 30న ఏడడుగులు నడిచారు. అయితే పెళ్లి తరువాత కాజల్ జోడి హనీమూన్ కు వెళ్లిన విషయం తెలిసిందే. మాల్దీవ్స్ లలో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపింది వీరిద్దరనని తెలుస్తోంది. ఇక వారు వెళ్ళడానికి గల కారణం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదని తెలుస్తోంది.

ఆఫర్ వెనకున్న అసలు కారణం

ఆఫర్ వెనకున్న అసలు కారణం

ఆసియా ఖండంలో బెస్ట్ హాలిడే స్పాట్ గా గుర్తింపు అందుకున్న మాల్దీవ్స్ కు కరోనా కారణంగా ఇటీవల ఆదాయం తగ్గిన విషయం తెలిసిందే. అయితే ప్రమోషన్స్ లో భాగంగా స్టార్ సెలబ్రెటీలను రప్పించి మళ్ళీ మునుపటి వైభవాన్ని రప్పించాలని అక్కడి ప్రభుత్వం ప్లాన్ వేసింది. అందులో భాగంగానే చాలా మంది సెలబ్రిటీలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్యలకు అనుగుణంగా ఆఫర్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మాల్దీవ్స్ అందాలను వారి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పోస్ట్ చేసి నెటిజన్లను ఆకర్షించడమే ఈ ఆఫర్ వెనకున్న అసలు కారణం.

5కోట్లు ఖర్చు చేశారా?

5కోట్లు ఖర్చు చేశారా?

అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ హనీమూన్ పై వార్తలు ఏ రేంజ్ లో వచ్చాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సముద్ర మట్టానికి 16 అడుగుల దిగువన ఉన్న ఒక స్పెషల్ రూమ్ లో ఇద్దరు రొమాంటిక్ గా ఎంజాయ్ చేశారు. అసలైతే ఈ విహార యాత్రకు ఆమె దాదాపు 5కోట్లకు పైగా ఖర్చు చేసిందని టాక్ వచ్చింది. అండర్ వాటర్ హోటల్ మురాకాలో అందమైన వేలాది చేపల నడుమ కొన్నిరోజులు హ్యాపీగా ఎంజాయ్ చేశారు. మురాకాలో ఒక రాత్రికి అయ్యే ఖర్చు యాభై వేల డాలర్లు, అంటే మన కరెన్సీలో సుమారు ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు.

ఫాలోవర్స్ ను బట్టి ఆఫర్స్

ఫాలోవర్స్ ను బట్టి ఆఫర్స్

అయితే కాజల్ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసింది లేదని తెలుస్తోంది. ఎందుకంటే మాల్దీవ్స్ ప్రభుత్వం ఇటీవల ప్రమోషన్స్ లో భాగంగా ఒక కొత్త పాలిసీ పెట్టిందట. ఇన్‌స్టాగ్రామ్‌లో 2మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నవారికి మాల్దీవ్ హోటల్స్ లలో ఫైవ్‌స్టార్‌ భోజనాన్ని ఉచితంగా అందిస్తారట. ఇక 5మిలియన్ల కంటే ఎక్కువమది ఉన్న సెలబ్రిటీకి ఓ హోటల్‌తో పాటు రూమ్‌, భోజనం, వచ్చిన మరో వ్యక్తికి రిటన్‌ టిక్కెట్ కూడా ఉచితంగా ఇస్తారట.

Recommended Video

Kajal Aggarwal Honeymoon budget
ఫోన్ చేసి మరీ ఫ్రీ టూర్ ఆఫర్ ఇచ్చారట..

ఫోన్ చేసి మరీ ఫ్రీ టూర్ ఆఫర్ ఇచ్చారట..

ఇక కాజల్ అగర్వాల్ కు ఇన్స్టాగ్రామ్ లో ఇప్పటికే 16మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే కాజల్‌ హనీమూన్‌ కోసం రూపాయి కూడా ఖర్చు చేయలేదని తెలుస్తోంది. ఆమె పెళ్లి చేసుకోవడం వలన మాల్దీవ్స్ మురాకా హోటల్ యాజమాన్యం స్వయంగా కాజల్ కు ఫోన్ చేసి మరీ ఫ్రీ టూర్ ఆఫర్ ఇచ్చిందట. హనీమూన్ ఇక్కడే చేసుకొని ఇన్స్టాగ్రామ్ లో ఫొటోస్ షేర్ చేస్తే చాలని చెప్పారట. అందుకే అండర్ వాటర్ రూమ్ కూడా వారికి అందజేసి ప్రమోట్ చేయించిన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X