For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అమ్మాయి, అబ్బాయి అని తేడా లేకుండా శృంగారం.. సమంత ఆ పాత్ర సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఆ హీరోనే..

  |

  టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం హీరోలు హీరోయిన్స్ అందరూ కూడా స్టార్ హోదాను పక్కనపెట్టి కొన్ని పాత్రలను కథలను సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు కమర్షియల్ అంశాలను ఆలోచించే అభిమానులకు నచ్చే విధంగా ఉండాలని మంచి పాత్రలను మాత్రమే సెలెక్ట్ చేసుకునే వారు. ఇప్పుడు మంచి చెడు అనేది కాకుండా పాత్రలో ఇంట్రెస్టింగ్ విషయాలను బట్టి దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. నెగిటివ్ అయినా పాజిటివ్ పాత్ర అయినా సరే ఈ సినిమాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని ఆలోచిస్తున్నారు. ఇక సమంత కూడా ఇటీవల కాలంలో అలాంటి పాత్రలను ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటుంది.

  మారుతున్న సమంత ఆలోచనలు

  మారుతున్న సమంత ఆలోచనలు

  సమంత పాత్ర నిడివి తక్కువగా ఉన్నా సరే క్యారెక్టర్ మాత్రం చాలా బలంగా ఉండాలని కోరుకుంటున్నట్లు అర్థమవుతోంది. సమంత విడాకుల అనంతరం తన సినిమా కెరీర్ విషయంలో మరింత ఫోకస్ పెట్టింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ వీలైనంత వరకు ప్రయోగాత్మకమైన కథలను సెలెక్ట్ చేసుకుంటోంది. ఊహించని విధంగా ఐటెమ్ సాంగ్ చేయడానికి కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటే ఏ స్థాయిలో ఆలోచిస్తూనే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

  అందరికీ నచ్చే విధంగా ఉండాలి

  అందరికీ నచ్చే విధంగా ఉండాలి

  రంగస్థలం సినిమా తర్వాత సమంత ఆలోచన విధానం చాలా మారిపోయింది అనే చెప్పాలి. ఓ బేబీ కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాగా మంచి విజయాన్ని అందించింది. అప్పటి నుంచి ఆమె విభిన్నమైన కథల పై ఎక్కువగా ఫోకస్ చేస్తుంది.. సినిమా సక్సెస్ అయినా సరే ఫెయిల్ అయినా సరే క్యారెక్టర్ మాత్రం అందరికీ నచ్చే విధంగా ఉండాలి అని వీలైనన్ని ఎక్కువగా లేడి ఓరియెంటెడ్ కథలపై ఫోకస్ పెట్టింది.

  బై సెక్సువల్ పాత్రలో

  బై సెక్సువల్ పాత్రలో

  ఇటీవల సమంత ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుత కాలంలో అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా లేకుండా బైసెక్సువల్ గా కొనసాగుతున్న వాతావరణం ఉంది. ఆ సినిమాలో అదే చూపించబోతున్నారు. ఇక సమంత బై సెక్సువల్ క్యారెక్టర్ తో కనిపించబోతుండడం ఆశ్చర్యపరిచే విషయమని చెప్పవచ్చు.

  అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్

  అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్

  గతంలో ఎప్పుడూ లేని విధంగా సమంత సెలెక్ట్ చేసుకున్న పాత్రలు కూడా కూడా మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. ఇక సమంత తన మొదటి అంతర్జాతీయ చిత్రం 'అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్'కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉందట. అలాగే ఆ నిర్ణయం వెనుక ఒక స్టార్ హీరో ఉన్నట్లు తెలుస్తోంది.

  రానా దగ్గుబాటి సలహాతో

  రానా దగ్గుబాటి సలహాతో

  ఆ పాత్ర కోసం మేకర్స్ సమంతను ఎంపిక చేయడం వెనుక రానా దగ్గుబాటి ఉన్నట్లు తెలుస్తోంది. రానా సరికొత్త స్క్రిప్ట్‌ల కోసం తగినంత సమయాన్ని వెచ్చిస్తున్నాడు. ఇక వాటిలో కొన్నింటిని తన నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ కోసం ఖరారు చేస్తున్నాడు. త్వరలో కంటెంట్ ఆధారిత ప్రాజెక్ట్‌లను నిర్మించడానికి కూడా ఆసక్తిగా ఉన్నాడు. ఇక సమంత తన మొదటి అంతర్జాతీయ చిత్రం 'అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్'పై సంతకం చేయడానికి కారణం రానా అని తెలుస్తోంది.

  Priyanka Chopra - Nick Jonas విడాకులు.. సెన్సేషనల్ రూమర్...!! || Filmibeat Telugu
  త్వరలోనే షూటింగ్ స్టార్ట్

  త్వరలోనే షూటింగ్ స్టార్ట్

  బై సెక్సువల్ పాత్ర కోసం మేకర్స్ ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలని అని అనుకుంటున్న తరుణంలో నిర్మాత సునీత తాటిని సమంత దగ్గరకు రమ్మని రానా సూచించాడు. సమంతను సంప్రదించిన తర్వాత, నటి అప్పుడే ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుందట. ఇక అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్‌లో సమంత ద్విలింగ మహిళగా మరియు డిటెక్టివ్‌గా నటించింది. గురు ఫిలింస్‌ పతాకంపై సునీత తాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఫిలిప్ జాన్ దర్శకుడు.

  English summary
  Behind the reason on Samantha’s International Film
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X