సమంతకు స్టార్ ప్రొడ్యూసర్ భారీ ఆఫర్... రెమ్యునరేషన్‌గా ఖరీదైన ప్రాపర్టీ... ఎన్ని కోట్లో తెలుసా?
సమంత రూత్ ప్రభు.. పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు 16 ఏళ్లుగా ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్‌లలో ఒకరిగా దూసుకెళ్తున్నారు సామ్. సినిమాలు చేసినా చేయకున్నా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గకపోగా.. అంతకంతకూ పెరుగుతోంది. కొన్ని వ్యక్తిగత కారణాలతో సమంత ఇటీవల సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే తిరిగి ఇటీవల యాక్టీవ్ అయ్యారు. నిర్మాతగా, నటిగా దూసుకెళ్తున్నారు. ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఆమె కూడా ఒకరు. అయితే కెరీర్ తొలినాళ్లలో ఓ స్టార్ ప్రొడ్యూసర్ ఆమెకు రెమ్యునరేషన్ కింద ఓ ఖరీదైన ప్రాపర్టీని ఇచ్చారట. ఈ వివరాల్లోకి వెళితే..
తమిళ చిత్రం విన్నైతాండి వారువాయ మూవీతో వెండితెరపై అడుగుపెట్టిన సమంత .. ఏ మాయ చేశావేతో తెలుగువారిని పలకరించింది. ఈ సినిమాలో జెస్సీగా గుర్తుండిపోయే పాత్ర చేసింది. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఈ దశలో దూకుడు, బృందావనం, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, మనం సినిమాలతో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుని గోల్డెన్ హ్యాండ్ అనిపించుకున్నారు. అలా తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న దశలో ఓ డెబ్యూ హీరోతో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఇండస్ట్రీకీ షాకిచ్చారు. అది ఎవరో కాదు బెల్లంకొండ సాయిశ్రీనివాస్.

అప్పటికే అగ్రనటిగా, కోటి రూపాయలకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటూ.. స్టార్ హీరోలకు సైతం డేట్స్ సర్దుబాటు చేయలేక కొన్ని సినిమాలను వదిలేసుకుంటున్న దశలో ఉన్నారు. అలాంటిది ఓ కొత్త హీరో సరసన సమంత లాంటి అగ్రనటి నటించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అలాగే ఈ సినిమాలో సమంతకు భారీ రెమ్యునరేషన్ దక్కిందని కూడా పుకార్లు వినిపించాయి. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, ప్రదీప్ రావత్, బ్రహ్మానందం తదితరులు నటించగా.. మిల్కీబ్యూటీ తమన్నా భాటియా ఓ స్పెషల్ సాంగ్ చేశారు. అలా సమంత, తమన్నా లాంటి స్టార్ హీరోయిన్లు ఓ కుర్ర హీరో సినిమాలో ఎలా నటించారంటూ సినీ జనాలు ఆశ్చర్యపోయారు. తాజాగా ఈ సినిమా నిర్మాత బెల్లంకొండ సురేష్ ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ముందు నుంచే సాయి శ్రీనివాస్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేయాలని వినయ్ గారు నేను అనుకుంటూ వచ్చాం. పదేళ్ల తర్వాత కూడా అల్లుడు శీను సినిమా గుర్తుంది అంటే ఆ లాంచ్ అలాంటిది. సౌత్‌లో కానీ, నార్త్‌లో కానీ ముగ్గురు పేర్లు ఇప్పటికీ చెబుతారు. అది గర్వంగానే నేనే ఫీల్ అవుతాను. ధర్మేంద్ర గారు వాళ్ల అబ్బాయితో బేతాళ్ అనే సినిమాతో గ్రాండ్‌గా ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత రాకేష్ రోషన్.. కహోనా ప్యార్ హైతో హృతిక్ రోషన్‌ని అలాగే లాంచ్ చేశారు. అనంతరం అల్లుడు శీను బెల్లంకొండ సురేష్ పేరు చెబుతారు. బాంబే వెళ్లినప్పటికీ ఈ విషయాన్ని చాలామంది చెబుతారు.. ఇంతకంటే ఆనందం ఏమీ ఉండదు. ఇంట్రడక్షన్ హీరోకి ఇంత రెవెన్యూ అనేది ఎవరికీ రాలేదు అని బెల్లంకొండ తెలిపారు.
ఆ టైంలో పెద్ద పెద్ద హీరోయిన్లను ఎలా ఒప్పించారు అనే యాంకర్ ప్రశ్నించగా.. ఆ సమయంలో సమంతవి ఒకటో రెండో సినిమాలు రిలీజ్ అయ్యాయి. నేను వెళ్లి మాట్లాడి కన్ఫర్మ్ చేసిన తర్వాత ఈ గ్యాప్‌లో సమంత స్టార్ హీరోయిన్ అయిపోయింది. ముందు ఇద్దరు హీరోయిన్ల కథ అనుకున్నాం.. అందుకని తమన్నాని కూడా పెడదామని అనుకున్నాం. అనుకోకుండా అది ఇద్దరు హీరోయిన్ల కథ అయ్యింది. దాంతో నేను వెళ్లి తమన్నాని సాంగ్ చేయమని రిక్వెస్ట్ చేస్తే ఆమె ఒప్పుకున్నారు. నిజంగా తమన్నా గ్రేట్.. ఆమె కెరీర్‌లో ఫస్ట్ ఐటెం సాంగ్. ఆ అమ్మాయి ఎలా ఒప్పుకుందో నాకు కూడా తెలియదు. గుడ్‌విల్ కావొచ్చు. ఇప్పుడు ఆమె ఒక్క పాట కోసం 4 కోట్ల రూపాయలు తీసుకుంటోంది. అల్లుడు శీను సినిమాలో పాట చేసినందుకు 90 లక్షల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చానని బెల్లంకొండ సురేష్ పేర్కొన్నారు.
ఆ రోజుల్లో సమంత యాక్ట్ చేయడానికి రెమ్యునరేషన్‌కు బదులు ఒక ఫాంహౌస్ ఇచ్చారని ఇండస్ట్రీలో టాక్ అని యాంకర్ ప్రశ్నించగా.. ఆ రోజుల్లో ఆ అమ్మాయి కొనుక్కుంటానని అంటే నేను వేరేవాళ్లకు అమ్మే బదులు ఆ అమ్మాయికే అమ్మాను. మంచి ఫాంహౌస్.. అప్పుడు 1.50 కోట్ల రూపాయలు ఉండొచ్చు. ఇప్పుడది 1250 గజాలు.. గజం అక్కడ 2 లక్షల రూపాయల వరకు ఉంటుంది.. అంటే 15 కోట్లు రూపాయలు ఉండొచ్చు. నాకు ఆల్రెడీ 2 ఫాంహౌస్‌లు ఉన్నాయి. ఇది ఎక్స్‌ట్రాగా ఉంది.. ఎవరికైనా ఇద్దామనే కొన్నాను. రెమ్యునరేషన్ కింద ఫాంహౌస్ ఇచ్చానని బెల్లంకొండ సురేష్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











