Kajal Aggarwal: కాజల్ ఓవర్ డోస్ షో.. తల్లైన సంగతి మరిచిందా ఏంటి?
సినీ రంగంలోకి ఎంతో మంది హీరోయిన్లుగా వస్తుంటారు.. పోతుంటారు. కానీ, కొందరు మాత్రమే తీవ్ర స్థాయిలో ప్రభావాన్ని చూపించి ఏళ్ల తరబడి ఏలుతుంటారు. అలాంటి వారిలో చందమామ కాజల్ అగర్వాల్ ఒకరు. సాదాసీదాగానే సినిమాల్లోకి వచ్చిన ఈ అమ్మడు.. ఎవరూ ఊహించని రీతిలో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తోంది. ఇప్పుడు కూడా అదే స్పీడుతో సినిమాలు చేస్తోంది. ఇక, సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే కాజల్ అగర్వాల్.. తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరే లుక్కేయండి!
పాన్ ఇండియా హీరోయిన్‌గా:'లక్ష్మీ కల్యాణం' అనే సినిమాతోనే కాజల్ అగర్వాల్ కెరీర్ మొదలెట్టింది. అందులో అదిరిపోయే నటనతో ఆకట్టుకున్న ఈ భామ.. ఆ తర్వాత తెలుగులో వరుసగా ఆఫర్లను అందుకుంది. ఆ తర్వాత దక్షిణాదిలో కూడా ఎన్నో సినిమాల్లో నటించింది. అలాగే బాలీవుడ్‌లో సైతం అడుగు పెట్టి కాజల్ కొన్ని చిత్రాలను చేసింది. తద్వారా పాన్ ఇండియా రేంజ్ హీరోయిన్‌గా మారింది.

తల్లవడంతో గ్యాప్ ఇచ్చేసి:కెరీర్ మొదలైన తర్వాత ఏకధాటిగా సినిమాలు చేసిన కాజల్ అగర్వాల్.. గౌతమ్ కిచ్లూ అనే వ్యాపారవేత్తతో రహస్యంగా ప్రేమ వ్యవహారం నడిపింది. ఇది రివీల్ అయిన కొద్ది రోజులకే అతడిని పెళ్లాడింది. ఆ తర్వాత కూడా కెరీర్ కంటిన్యూ చేసిన కాజల్.. గత ఏడాది ఓ మగ బిడ్డకు తల్లైంది. దీంతో కొంత కాలం పాటు సినిమాలకు గ్యాప్ తీసుకుని మాతృత్వాన్ని అనుభవించింది.
రీఎంట్రీలో వరుస ఫ్లాపులే:తల్లిగా మారిన తర్వాత చాలా రోజుల పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన కాజల్ అగర్వాల్.. ఇటీవలే 'కోస్టీ' అనే తమిళ చిత్రంతో సెకెండ్ ఇన్నింగ్స్ మొదలెట్టింది. కానీ, ఇది ఆమెకు సరైన రీఎంట్రీని మాత్రం ఇవ్వలేదు. దీని తర్వాత కాజల్ 'కరుంగాపియమ్' అనే తమిళ చిత్రంలో నటించింది. ఇది కూడా కాజల్‌కు మంచి సక్సెస్‌ను అందించడంలో విఫలం అయింది.

బాలయ్యతో.. సత్యభామగా:ఇప్పటికి కూడా కాజల్ అగర్వాల్ ఏమాత్రం ప్రభావాన్ని కోల్పోకుండా వరుసగా ఆఫర్లను అందుకుంటూనే ఉంది. ఇలా ఇప్పటికే ఈ అమ్మడు కమల్ హాసన్‌తో కలిసి 'ఇండియన్ 2', బాలీవుడ్‌లో 'ఉమ', బాలయ్య సరసన 'భగవంత్ కేసరి' అనే సినిమాల్లో నటించింది. అంతేకాదు, 'సత్యభామ' అనే లేడీ ఓరియెంటెడ్ మూవీతోనూ కాజల్ అగర్వాల్ రాబోతుంది.
సోషల్ మీడియాలో బిజీగా:దాదాపు పదిహేనేళ్లుగా వరుస పెట్టి సినిమాలు చేసినా.. ఈ మధ్య తల్లిగా అవడంతో చాలా గ్యాప్ తీసుకున్నా.. కాజల్ అగర్వాల్ మాత్రం సోషల్ మీడియాలో బిజీగానే గడుపుతోంది. పైగా ఇందులో ఈ మధ్య మరింత యాక్టివ్ అయిన ఈ అమ్మడు.. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటూనే ఉంటోంది. తద్వారా ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.

అందాల విందు ఇస్తోంది:సోషల్ మీడియాలో కాజల్ అగర్వాల్ అప్పుడప్పుడూ అందాల విందు ఇస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను కూడా బాగానే వదులుతూ ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో డోస్ పెంచేసి మరీ గ్లామర్‌ను చూపిస్తూ తీసుకున్న ఘాటు ఫొటోలను ఎక్కువగా వదులుతోంది. పెళ్లైనా, తల్లైన తర్వాత కూడా హాట్ షోను ఏమాత్రం తగ్గించకుండా తరచూ వార్తల్లో హైలైట్ అవుతోంది.

కాజల్ నాటీ పిక్స్ వైరల్:తాజాగా కాజల్ అగర్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ భామ డీప్ నెక్ డ్రెస్ ధరించింది. ఇందులో ఓ రేంజ్‌లో క్లీవేజ్ షో చేస్తూ ఫోజులిచ్చింది. అదే సమయంలో కుర్రాళ్లను రెచ్చగొట్టేలా కవ్విస్తోంది. ఫలితంగా కాజల్ అగర్వాల్ అందాలు హైలైట్ అవుతోన్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది.


Click it and Unblock the Notifications











