Bhagyashree Borse: ‘కాంత’ గా భాగ్యశ్రీ బోర్సే.. మరీ ఈ సారి రొమాన్స్ ఎవరితో ?
Bhagyashree Borse: యంగ్ అండ్ హాట్ బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు మాస్ మహారాజా రవితేజ 'మిస్టర్ బచ్చన్'మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ సినిమాలో తన అందం, అభినయంతో తెలుగు ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసిందీ ఈ బ్యూటీ. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా అయింది.
మిస్టర్ బచ్చన్ మూవీ అనుకున్న విధంగా సక్సెస్ కాకున్నా.. ఈ అమ్మడికి నటనకు గానూ మంచి మార్కులే పడ్డాయి. ఇలా తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. ఇదిలా ఉంటే.. తన అందంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది భాగ్యశ్రీ బోర్సే తాజాగా మరో లక్కీ చాన్స్ కొట్టేసింది. ఇంతకీ ఆ క్రేజీ అప్డేట్ ఏంటో మీరు కూడా ఓ లూక్కేయండి.

ఈ హాట్ బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నది. స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోయిగా వస్తున్న 'కాంత' అనే మూవీలో హీరోయిన్ గా నటించి లక్కీ చాన్స్ కొట్టేసింది ఈ అమ్మడు. రానా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. నీలా ఫేమ్ సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో ఈ భారీ బడ్డెట్ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీని వేఫరెర్ ఫిలిమ్స్, స్పిరిట్ మీడియా కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాల్లో భాగ్యశ్రీ బోర్సే, రానా, దుల్కర్ పాల్గొన్నారు. ప్రస్తుతం ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే మూవీకి సంబంధించిన షూటింగ్ తొందరలోనే స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం.
#Kaantha Pooja Ceremony Happening Now! 🤍✨
— AB George (@AbGeorge_) September 8, 2024
Bankrolled by @DQsWayfarerFilm @SpiritMediaIN !! 🔥#DulquerSalmaan - #RanaDaggubati - #BhagyashriBorse! 📸@dulQuer@RanaDaggubati pic.twitter.com/stv8ckgZLw
ఇక మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గురించి కూడా తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలతో నటించి మెప్పించారు. కేవలం మలయాళంలోనే కాకుండా టాలీవుడ్‌లోనూ తన హీరోయిజం, స్వాగ్, లుక్స్ కి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది.
ఇక గతంలో ఆయన ఎన్నో అంచనాలతో 'కింగ్ ఆఫ్ కోత' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డారు. ఆ తర్వాత ఇటీవలే 'కల్కి 2898 ఏడీ' మూవీలో ఓ కీలక పాత్రలో కనిపించి, తన మెస్మారైజింగ్ యాక్టింగ్ తో అదరగొట్టేశారు. మరీ ఈ మూవీతో అలా అట్రాక్ట్ చేస్తాడో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











