10 ఏళ్ల చిన్న హీరోకు తల్లిగా స్టార్ హీరోయిన్.. ట్రోల్స్‌కు దిమ్మతిరిగిపోయే కౌంటర్!

సినిమా ఇండస్ట్రీలో హీరోలకు వయసు పెరిగినా అదే స్టార్డమ్‌తో హీరో పాత్రలు చేస్తూనే ఉంటారు. కానీ హీరోయిన్లకు మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఒక దశ తర్వాత వారికి వచ్చే పాత్రలు మారిపోతాయి. అలాంటి సమయంలో ఒక స్టార్ హీరోయిన్... తనకంటే కేవలం 10 ఏళ్లు చిన్నవాడైన హీరోకు తల్లిగా నటించింది. అయితే.. ఆ నిర్ణయంపై సోషల్ మీడియాలో ట్రోల్స్‌ను ఎదుర్కొంది. అయితే ఆమె మాత్రం ఒక్క మాటతోనే అందరికీ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఎందుకు అలాంటి పాత్రను ఒప్పుకుంది? అసలు ఈ కథ వెనుక నిజం ఏమిటి? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన'రాజా శివాజీ'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. రితేష్ దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. ఈ సినిమా రూ.100 కోట్ల పైగా అందుకుని భారీ విజయాన్ని అందుకుంది. చరిత్రాత్మక నేపథ్యంతో రూపొందించిన ఈ సినిమాలో శివాజీ మహారాజ్ పాత్రతో పాటు ఆయన జీవితాన్ని తీర్చిదిద్దిన తల్లి రాజమాత జిజాబాయి పాత్రకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.

Bhagyashree Plays Mother to Younger Hero in Raja Shivaji Trolls Get Strong Reply

ఈ కీలక పాత్రలో బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ (Bhagya sree) నటించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఈ పాత్రపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. భాగ్యశ్రీ కంటే కేవలం 10 ఏళ్లు చిన్నవాడైన రితేష్ దేశ్‌ముఖ్‌కు తల్లిగా నటించడం. సాధారణంగా హీరోలకు వయసు పెరిగినా ప్రధాన పాత్రలు దక్కుతూనే ఉంటాయి కానీ, హీరోయిన్‌లకు మాత్రం వయస్సు పెరిగేకొద్దీ పాత్రలు మారిపోతుంది. ఈ నేపథ్యంలో భాగ్యశ్రీ తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

ఈ విషయంపై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న భాగ్యశ్రీ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. "చిన్నప్పటి నుంచి మనం వింటూ పెరిగిన మహనీయుల కథల్లో ఒక పాత్ర పోషించే అవకాశం వస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోలేం. అలాగే జిజాబాయి పాత్రకు వయస్సుతో సంబంధం లేదని చెప్పింది. భాగ్యశ్రీ చెప్పిన మరో ఆసక్తికర విషయమేమిటంటే.. ఈ సినిమాలో ఆమె లుక్ గురించి. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ స్వయంగా తనను సంప్రదించి, కెమెరా టెక్నిక్స్ ద్వారా ఆమెను కొంచెం వయసు పైబడినట్లుగా చూపించాల్సి వచ్చిందని చెప్పారట.

ఇంకా ఒక ఆసక్తికర విషయమేమిటంటే.. భాగ్యశ్రీకి ఈ కథతో వ్యక్తిగత అనుబంధం కూడా ఉందట. మహారాష్ట్రలోని సాంగ్లీ రాజకుటుంబంలో పుట్టిన ఆమె చిన్నప్పటి నుంచే శివాజీ మహారాజ్ కథలు వింటూ పెరిగిందట. ఇతర పాశ్చాత్య కథల కంటే ముందే ఈ వీరగాథలు స్పూర్తిధాయకమనీ, చిన్నతనంలో మట్టితో శివాజీ కోటలను తయారు చేస్తూ ఆడుకునేవాళ్లమని ఆమె గుర్తుచేసుకుంది. దీంతో ఈ సినిమాలో నటించడం తనకు ఒక భావోద్వేగ అనుభూతి అని పేర్కొంది.

ఇక సినిమా విషయానికి వస్తే.. ఇందులో జెనీలియా దేశ్‌ముఖ్ మహారాణి సైబాయి భోంసలే పాత్రలో నటించింది. శివాజీ జీవితంలో ఆమె పాత్ర ఎంత ముఖ్యమో సినిమా ద్వారా చూపించారు. అలాగే సంజయ్ దత్ అఫ్జల్ ఖాన్ పాత్రలో కనిపించగా, అభిషేక్ బచ్చన్, విద్యా బాలన్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు. ఈ భారీ తారాగణం సినిమాకు మరింత గ్రాండియర్‌ను తీసుకొచ్చింది.

మొత్తంగా చూస్తే.. 'రాజా శివాజీ' సినిమా కేవలం ఒక చరిత్రాత్మక సినిమా మాత్రమే కాదు, మహానుభావుల జీవితాన్ని కొత్త తరానికి పరిచయం చేసే ప్రయత్నంగా నిలిచింది. ఇందులో భాగ్య చేసిన జిజాబాయి పాత్ర, వయస్సు పరిమితులను దాటి నటనకు శ్రీ ఇచ్చిన ఉదాహరణగా నిలిచింది. సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్‌ను కూడా సమర్థంగా ఎదుర్కొంటుంది. తన నిర్ణయం వెనుక ఉన్న భావాన్ని స్పష్టంగా చెప్పడం ఆమె మరోసారి తన ప్రొఫెలిషనాన్ని చాటుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X