టాలీవుడ్‌ను ఊపేస్తున్న యంగ్ హాట్ హీరోయిన్స్.. కొత్త అందాలతో మత్తెక్కించేస్తున్న కుర్ర భామలు

తెలుగు చిత్రసీమలో కథానాయకుల గురించి తరచూ చర్చ జరుగుతూనే ఉంటుంది. రోజుకో కొత్త హీరోయిన్ అడుగుపెడుతున్న ఈ ఇండ‌స్ట్రీలో సక్సెస్ పుల్ హీరోయిన్ గా నిలదొక్కుకోవడమంటే కష్టమే. తమ అందం, అభినయంతో మెప్పించినా.. వారు నచ్చిన సినిమాలు భారీ విజయాలు సాధించినా.. కొంతమందికి మాత్రం ఆ స్టార్డమ్ రావడం లేదు. అయినా ఇట్టి పరిస్థితుల్లో వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ తమ సత్తా చాటుకుంటున్నారు కొంత మంది భామలు. తాజాగా కొంత మంది భామలు వెండి తెరపై తళుక్కున మెరుస్తున్నారు. అలా తళుక్కున మెరుస్తున్న ఆ అందాల తారాలు ఎందరో ఓ లూక్కేద్దాం..

భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)

భాగ్యశ్రీ బోర్సే.. టాలీవుడ్ లో ఆమె ఓ సెన్సేషన్‌. ఈ మాజీ మోడల్.. రవితేజ- హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న'మిస్టర్ బచ్చన్'తో తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టింది. ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ నేపథ్యంలో ఈ మూవీ టీం ఈ బ్యూటీని తెగ హైలైట్ చేస్తోంది. సినిమాకు సంబంధించిన ప్రతి ఈవెంట్, ప్రమోషన్లో భాగ్యశ్రీ బాగానే వాడేసుకుంది. ఈ హాట్ బ్యూటీ కూడా దొరికిందే.. బెస్ట్ ఛాన్స్ గా భావిస్తూ దూసుకెళ్తుంది. తన క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్ తో ఫ్యాన్స్ ను తెగ అట్రాక్ట్ చేస్తోంది. ఎంతలా అంటే.. సినిమా రిలీజ్‌కు ముందే ఈ భామ స్టార్ స్టేటస్ కొట్టేసింది. ఇంకో ఇంప్రెస్సింగ్ న్యూసేంటంటే.. భాగ్యశ్రీ బోర్సే.. తాను నటించిన తొలి సినిమా 'మిస్టర్ బచ్చన్'లోనే పాత్రకు తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుందట. ఇలా తొలి సినిమాకే స్వంత వాయిస్ ఇచ్చేవాళ్లు చాలా అరుదు. ఇలా భాగ్యశ్రీ తన కమిట్మెంట్‌ తో మరో రెండు సినిమాల్లో ఛాన్సులు కూడా పట్టేసినట్లు తెలుస్తోంది.

Bhagyashri Borse Kavya Thapar Ashika Ranganath Meenakshi glittering tollywood with Glamour
మీనాక్షి చౌదరి (Meenakshi)

టాలీవుడ్ మరో లేటెస్ట్ సెన్సేషన్ మీనాక్షి చౌదరి. ఈ అమ్మడు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొంతకాలంలోనే కుర్రాళ్ల హాట్ ఫేవరేట్ గా మారిపోయింది. ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో హీరోయిన్ గా చిత్రసీమలో అడుగుపెట్టిన ఈ అందాల తారా .. తన అందం, అభినయంతో ప్రేక్షకుల మదిని దొచుకుంది. ఆ తర్వాత మన మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన ఖిలాడీ సినిమాలో హీరోయిన్ గా నటించే లక్కీ ఛాన్స్ ను కొట్టేసింది. ఈ సినిమాలో తన అదిరిపోయే స్టెప్పులతో మాస్ ఫ్యాన్ ను తన బుట్టలో వేసుకుంది. ఆ తరువాత మహేష్ బాబు హీరోగా నటించిన 'గుంటురు కారం' సినిమాలోనూ నటించే బఫర్ ఆఫర్ కొట్టేసి.. వరుసగా ఆఫర్స్ తో ఫుల్ బిజీగా మారిపోయింది. పుల్ జోష్ లో ఉన్నా ఈ అమ్మడు వరుణ్ తేజ్ మట్కా సినిమాలో నటిస్తుంది. అలాగే విశ్వక్ సేన్ హీరోగా చేస్తోన్న మెకానిక్ రామ్ అనే సినిమాలోనూ ఆఫర్ కొట్టేసింది. అంతే కాకుండా.. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న లక్కీ భాస్కర్ అనే సినిమాలో కూడా నటిస్తుందట. మొత్తానికి ఈ ముద్దుగుమ్మ తన అందం, అభినయంతో మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటుంది.

Bhagyashri Borse Kavya Thapar Ashika Ranganath Meenakshi glittering tollywood with Glamour

ఆషికా రంగనాథ్ (Ashika Ranganath)

ఆషికా రంగనాథ్ .. టాలీవుడ్ లో ఒకటి రెండు సినిమాలు చేసి యంగ్ ఫ్యాన్ ను తనవైపు తిప్పుకున్న హాట్ బ్యూటీ. తొలుత 'అమిగోస్‌' చిత్రంతో టాలీవుడ్ తో అడుగుపెట్టిన బ్యూటీ.. ఆ తర్వాత కింగ్ నాగార్జున హీరోగా నటించిన 'నా సామిరంగ'లో నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఈ లక్కీ బ్యూటీ కేవలం మూడో సినిమానే మెగాస్టార్‌ చిరంజీవితో సరసన నటించే అవకాశం దక్కించుకుంది. మెగాసార్ట్ చిరంజీవి హీరో నటిస్తున్న 'విశ్వంభర'నటించే బంపర్‌ ఆఫర్‌ అందుకుంది. ఈ లక్కీ కన్నడ బ్యూటీ నిత్యం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరుచు తన హాట్ ఫిక్స్ షేర్ చేస్తూ.. కుర్రాళ్ల చూపులకు వల వేస్తుంది. ఇలా బ్యూటీ రీసెంట్ గా వన్ ఆఫ్ టాఫ్ హీరోయిన్ మారిపోయింది.

Bhagyashri Borse Kavya Thapar Ashika Ranganath Meenakshi glittering tollywood with Glamour

కావ్య థాపర్ (Kavya Thapar)

హీరో రామ్ పోతినేని- పూరిజగన్నాథ్ కాంబో లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సింగిల్స్ డబుల్ ఇస్మార్ట్ మూవీ తెరక్కెకుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో పూరీ మాస్ డైలాగులు,రామ్ ఫైట్స్ మాత్రమే కాదు. కావ్య థాపర్ హాట్ స్టెప్పులు కూడా హైలెట్ మారాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన మార్ ముంత- చోడ్ చింత సాంగ్, ఏ క్యా లఫ్డా సాంగ్స్ తో కావ్య థాపర్ స్టెప్పులు కేక పుట్టిస్తున్నాయి.

Bhagyashri Borse Kavya Thapar Ashika Ranganath Meenakshi glittering tollywood with Glamour

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X