బ్లాక్ డ్రెస్‌లో నలిపేస్తోన్న మిస్టర్ బచ్చన్ బ్యూటీ .. అందం దాచేందుకు తంటాలు
చిత్ర పరిశ్రమలో నటీనటులు క్రేజ్ సంపాదించడం అంత తేలిక కాదు. ఏళ్లకు ఏళ్లుగా ఇండస్ట్రీలో పాతుకుపోయినా ఇప్పటికీ స్టార్ డమ్ దక్కని వాళ్లు ఎందరో. అయితే ఇంకొందరు మాత్రం ఓవర్‌నైట్ స్టార్లుగా మారిపోతారు. ఇలాంటి కేటగిరీలోకి వస్తారు మరాఠీ ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే. గతేడాది తన లేత అందాలతో తెలుగు వారిని పలకరించిన భాగ్యశ్రీ.. తర్వాత మళ్లీ కనిపించలేదు.
తెలుగులో ఎంట్రీ ఇవ్వడానికి ముందు హిందీలో యారియాన్ -2లో భాగ్యశ్రీ నటించారు. అలాగే మోడల్‌గా పలు ఫేమస్ కంపెనీలకు ప్రచారకర్తగానూ వ్యవహరించారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాలో భాగ్యశ్రీకి హీరోయిన్‌గా అవకాశం దక్కింది. మంచి హైట్, వైట్ స్కిన్ టోన్ , హాట్ లుక్స్ ఉండటం భాగ్యశ్రీకి కలిసొచ్చే అంశం. మిస్టర్ బచ్చన్‌లో ఆమె అందాలను అద్భుతంగా చూపించి సినిమాపై అంచనాలు పెంచేశారు దర్శకుడు హరీష్ శంకర్. టీజర్, ట్రైలర్, పోస్టర్లలో భాగ్యశ్రీ నడుము, నాభి అందాలతో భాగ్యశ్రీ కుర్రాళ్లకు నిద్రలేని రాత్రులను మిగిల్చింది.

ఇక ఓ పాటలో భాగ్యశ్రీ - రవితేజల మధ్య కాంపోజ్ చేసిన డ్యాన్స్ పెద్ద కాంట్రవర్సీ అయ్యింది.. ఇక హీరో హీరోయిన్ల వయసుపైనా ట్రోలింగ్ జరిగింది. అయితే హరీష్ శంకర్ అందరి నోర్లు మూయించారు. గతేడాది స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్ట్ 15న రిలీజైన మిస్టర్ బచ్చన్‌కు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయితే మిస్టర్ బచ్చన్ సెట్స్ మీద ఉన్నప్పుడే భాగ్యశ్రీకి ఆఫర్లు క్యూకట్టాయి. తెలుగు సినిమా సహా తమిళ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఆఫర్స్ ఈమెకి వస్తున్నాయి అని ఆ మధ్య టాక్ వచ్చింది. హిందీలో బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ నటించిన చందు ఛాంపియన్ లో నటించి అక్కడ హిట్ అందుకుంది భాగ్యశ్రీ.
ప్రస్తుతం దుల్కర్ సల్మాన్, రాణా దగ్గుబాటి నటిస్తున్న కాంతలో.. విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్‌లోనూ.. రామ్ పోతినేని హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న మరో సినిమాలోనూ భాగ్యశ్రీ హీరోయిన్‌గా ఎంపికైనట్లుగా వార్తలు వస్తున్నాయి. అందంతో పాటు డ్యాన్స్ కూడా ఈమెకు అదనపు బలం. మిస్టర్ బచ్చన్‌లో భాగ్యశ్రీ అద్భుతంగా డ్యాన్స్ చేసి విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇండస్ట్రీలోకి వచ్చిన షార్ట్ గ్యాప్‌లోనే క్రేజీ ప్రాజెక్ట్స్‌లో స్థానం పొందిన భాగ్యశ్రీ త్వరలోనే టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతుందని విశ్లేషకులు అంటున్నారు.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే భాగ్యశ్రీ బోర్సే ఎప్పటికప్పుడు సినిమాలు, తన షోలు, ఫోటోలు, ఇతర వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ట్రెండీ వేర్‌లో హాట్ హాట్ ఫోటో షూట్‌లు చేసి దానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తుంటారు. తాజాగా బ్లాక్ డ్రెస్ ధరించి సన్ సెట్‌లో భాగ్యశ్రీ చేసిన ఫోటో షూట్ ఇన్‌స్టాలో వైరల్ అవుతోంది. మరి ఇంకేందుకు ఆలస్యం భాగ్యశ్రీ బోర్సే అందాలపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











