యువ హీరోయిన్ అన్నపూర్ణ ఆత్మహత్య.. మర్డరా? సూసైడా? సంచలనంగా మారిన నటి డెత్
భోజ్‌పురి భాషలో పాపులర్ నటి అమృతా పాండే అలియాస్ అన్నపూర్ణ మృతి సంచలనం రేపింది. బీహార్‌లోని భగల్‌పూర్‌లోని తన సొంత ఫ్లాట్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం అనేక సందేహాలకు తావిస్తున్నది. ఆమె మరణం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నిపింది. అన్నపూర్ణ చనిపోయిందనే వార్త తన స్నేహితులు, సన్నిహితులను, కుటుంబ సభ్యులను తీవ్ర నిరాశకు గురిచేసింది. తన మరణానికి ముందు రాసిన వాట్సాప్ మేసేజ్ అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఆమె మృతికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
మీడియా కథనాల ప్రకారం.. అమృతా పాండే ఫ్లాట్ తలుపులు ఎంతకు తీయకపోవడంతో అనుమానం వచ్చి బద్దలు కొట్టారు. తలుపులు తెరుచుకోగానే.. ఆమె సీలింగ్‌కు ఉన్న ఫ్యాన్‌కు చీర మెడకు కట్టి వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను ఫ్యాన్ నుంచి వేరు చేసి.. హాస్పిటల్‌కు పంపించారు. అప్పటికే ఆమె మరణించారనే విషయాన్ని వైద్యులు ధృవీకరించారు.

అమృతా పాండే విషయానికి వస్తే.. బిలాస్‌పూర్‌కు చెందిన చంద్రమణి జంగడ్‌తో 2022 సంవత్సరంలో వివాహం జరిగింది. వారిద్దరూ పెళ్లి తర్వాత ముంబైలో దాంపత్య జీవితాన్ని గడుపుతున్నారు. వారిద్దరూ తన సోదరి వివాహం కోసం భగల్‌పూర్‌కు వచ్చారు. వేడుకలు పూర్తయిన తర్వాత భర్త ముంబైకి వెళ్లిపోయాడు అని కుటుంబ సభ్యులు తెలిపారు.

అయితే పెళ్లి వేడుకలు ఇంకా పూర్తి కానందున్న అమృతా పాండే కొన్ని రోజులు భగల్‌పూర్‌లోనే ఉండాలని అనుకొన్నారు. కానీ ఊహించని విధంగా ఆమె సూసైడ్ చేసుకొవడం అత్యంత బాధకారం. ఆమె కొన్ని రోజులుగా డిప్రెషన్‌లో ఉన్నారు అని బంధువులు మీడియాకు తెలిపారు.
అమృతాపాండే మరణంపై భగల్‌పూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మరణాన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆమె మరణానికి కారణం డిప్రెషన్ అని ప్రాథమిక విచారణలో తెలిసింది. ఈ కేసును పలు రకాల కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ ఆనంద్ కుమార్ మీడియాకు తెలిపారు.
అమృతా పాండే కెరీర్ విషయానికి వస్తే.. భోజ్‌పూరి భాషలో ఆమెకు మంచి పాపులారిటి ఉంది. సూపర్ స్టార్ కేసరి లాల్ యాదవ్ కలిసి దీవానాపాన్ అనే చిత్రంలో నటించారు. ఇంకా పలు హిట్ చిత్రాల్లో నటించి ప్రశంసలు అందుకొన్నారు. ఆమె మరణంతో భోజ్ పూరి పరిశ్రమ మంచి నటిని కోల్పోయిందని సినీ వర్గాలు పేర్కొన్నాయి.


Click it and Unblock the Notifications











