బద్రి హీరోయిన్ కి షాక్.. వారెంట్ జారీ చేసిన కోర్టు.. అసలు ఏమైందంటే?

అమీషా పటేల్ అంటే ఇప్పటి తరం వారికి వెంటనే తట్టక పోవచ్చు కానీ ఈ భామ తెలుగులో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సరసన సినిమాలు చేసింది ఈ బాలీవుడ్ బ్యూటీ. ప్రస్తుతం సినిమాలు లేక ఖాళీగా ఉంటున్న అమీషా మీద కోర్టు వారెంట్ జారీ చేయడం సంచలనంగా మారింది. ఆ వివరాల్లోకి

 సోషల్ మీడియాలో యాక్టివ్ గా

సోషల్ మీడియాలో యాక్టివ్ గా

చేతులో సినిమాలు లేకున్నా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది అమీషా . అయితే భూపాల్ కోర్టు బాలీవుడ్ నటి అమీషా పటేల్ కు వ్యతిరేకంగా ఒక బెయిలబుల్ వారెంట్ చేసింది. అమీషా పటేల్‌పై చెక్ బౌన్స్ కేసు నడుస్తోంది, తదుపరి విచారణ సమయంలో కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. సోమవారం అమీషా మీద ఈ వారెంట్ జారీ అయింది.

 డబ్బులు తీసుకుందని

డబ్బులు తీసుకుందని

జాతీయ న్యూస్ ఛానల్స్ ' కథనం ప్రకారం, అమీషా డిసెంబర్ 4న విచారణ కోసం భోపాల్ కోర్టుకు హాజరు కావలసి ఉంది. ఈ కోర్టులో అమీషా రూ.32.25 లక్షల చెక్ బౌన్స్ కేసును ఎదుర్కొంటున్నారు. యుటిఎఫ్ టెలిఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అమీషాపై ఈ కేసును దాఖలు చేసింది. సినిమా తీయడానికి అమీషా తన దగ్గర డబ్బులు తీసుకుందని యుటిఎఫ్ టెలిఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆరోపిస్తోంది.

బౌన్స్ అయ్యాయి

బౌన్స్ అయ్యాయి

యూటీఎఫ్ టెలిఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరపు న్యాయవాది రవి పంత్ తెలిపిన వివరాల ప్రకారం ఫస్ట్ క్లాస్ జిల్లా జడ్జి రవి కుమార్ బోరాసి ఈ వారెంట్ జారీ చేశారు. అమీషా పటేల్ ప్రొడక్షన్స్ యుటిఎఫ్ టెలిఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి 32 లక్షల 25 వేల రూపాయలు అప్పుగా తీసుకుంది. అందుకు ప్రతిగా కంపెనీకి రెండు చెక్కులు ఇచ్చారు. ఈ చెక్కులు బ్యాంకులో వేయగా, అవి బౌన్స్ అయ్యాయి. అనంతరం జిల్లా కోర్టులో కేసు వేశారు.

అమీషా పటేల్‌పై వారెంట్ జారీ

అమీషా పటేల్‌పై వారెంట్ జారీ

దీనిని విన్న న్యాయమూర్తి అమీషా పటేల్‌పై వారెంట్ జారీ చేశారు. ఇండోర్‌లోనూ చెక్ బౌన్స్ కేసులో అమీషా పటేల్‌పై కేసు నమోదైంది. నిషా అనే అమ్మాయి నుంచి అమీషా పది లక్షల రూపాయలు తీసుకుని దానికి బదులుగా చెక్కు ఇచ్చారు కానీ ఆ చెక్కు కూడా బౌన్స్ అయింది. ఇప్పుడు భోపాల్ కోర్టు అమీషాను డిసెంబర్ 4న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించడంతో అమీషా స్వయంగా వస్తారా లేక ఆమె తరపు న్యాయవాది వస్తారా అనే ఊహాగానాలు సాగుతున్నాయి.

Recommended Video

HC Asks Amazon To Take Down Nani's V Movie film | Sakshi Malik | Filmibeat Telugu
అరెస్ట్ వారెంట్ జారీ

అరెస్ట్ వారెంట్ జారీ

దానికి బదులుగా ఆమె ఇచ్చిన రెండు చెక్కులు బౌన్స్ అయ్యాయట. ఈ క్రమంలో డిసెంబర్ 4న అమీషా కోర్టుకు హాజరు కాకపోతే, ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ చేసే అవకాశం ఉంది. ఆమె చేస్తున్న సినిమాల విషయానికి వస్తే అమీషా పటేల్ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడు ఆమె మరోసారి తన సూపర్‌హిట్ చిత్రం 'గదర్' సీక్వెల్‌లో సన్నీ డియోల్ మరియు ఉత్కర్ష్ శర్మతో కలిసి నటిస్తోంది. చూడాలి మరి ఏం జరగనుంది నేడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X