నటిగా ఇరవై యేళ్లు.. మీరు చూపించిన ప్రేమే కారణం.. భూమిక ఎమోషనల్ పోస్ట్
యువకుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది భూమిక. ఆ సినిమా ఓ మోస్తరుగా ఆడినా.. భూమికకు మాత్రం మంచి అవకాశాలనే తీసుకొచ్చింది. కరుణాకరణ్ దర్శకత్వంలో హీరోయిన్స్ ఎంత అందంగా కనిపిస్తారో అందరికీ తెలిసిందే. కొత్త లుక్‌లో హీరోయిన్లను మరింత అందంగా చూపించడంలో కరుణాకరణ్ స్పెషలిస్ట్. యువకుడు చిత్రంలో భూమిక పాత్రకు ప్రాధాన్యం ఉండటంతో, అందంగానూ కనిపించింది. నిన్నటికి (మే 18) యువకుడు సినిమా విడుదలై ఇరవై యేళ్లు అవుతోంది. ఈ సందర్బంగా భూమిక ఎమోషనల్ పోస్ట్ చేసింది.

స్టార్స్ సరసన అవకాశం..
యువకుడు చిత్రం తరువాత భూమికకు అవకాశాలు వెల్లువెత్తాయి. నాగార్జున, వెంకటేష్, చిరంజీవి వంటి సీనియర్ హీరోల సరసన నటించే స్థాయికి చేరుకుంది. మహేష్, పవన్, ఎన్టీఆర్ వంటి యంగ్ హీరోలతోనూ జోడి కట్టింది. ఖుషీ సినిమా ఆమె కెరీర్‌లో నిలిచిపోయింది.

దాదాపు అన్ని భాషల్లో..
భూమిక తెలుగులో తెచ్చుకున్న క్రేజ్‌తో మొత్తం దక్షిణాదిలో క్రేజ్ తెచ్చుకుంది. తమిళం, కన్నడ, మళయాలం భాషల్లోనే కాకుండా హిందీ, భోజ్‌పురి, పంజాబీ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించింది. వివాహం అనంతరం కాస్త స్పీడ్ తగ్గించింది.

ప్రియుడితో పెళ్లి..
భూమిక తన చిన్ననాటి నేస్తం, ప్రియుడు భరత్ ఠాకూర్‌ను వివాహం చేసుకుంది. యోగా టీచర్ అయిన భరత్.. 2007లో వివాహాం చేసుకుంది. దాదాపు నాలుగేళ్లు డేటింగ్ అనంతరం వీరిద్దరు పెళ్లితో ఒక్కటయ్యారు.

సెకండ్ ఇన్నింగ్స్..
ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన భూమిక.. ఆపై సైడ్ క్యారెక్టర్స్‌తో సరిపెట్టుకుంది. తాజాగా ఎమ్‌సీఏ, యూ టర్న్, రూలర్ సినిమాలతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. నటిగా ఇరవై యేళ్లు పూర్తయిన సందర్బంగా ఓ పోస్ట్ చేసింది.
Recommended Video

అందరికీ థ్యాంక్స్..
భూమిక చేసిన పోస్ట్ సారాంశం.. ‘ఈరోజుకు తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇరవై ఏళ్లు అవుతున్నాయి. నన్ను ఆదరించిన, ప్రేమాభిమానలు అందించిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. ఈ అవకాశం ఇచ్చిన దేవుడుకి ధన్యవాదాలు. నా శ్రేయోభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరి ప్రేమ వల్లే నేనీ స్థాయిలో ఉన్నాను' అని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











