Don't Miss!
- Finance Radakishan Damani: దమానీ భారీ బెట్.. ఆ కంపెనీలో 2.33 లక్షల షేర్లు కొనుగోలు.. స్టాక్ దూకుడు
- News జగన్ పై దాడి కేసులో పురోగతి-పోలీసుల అదుపులో 10 మంది-అప్ డేట్ ఇదే..!
- Technology iPhone SE 4 భారీ డిస్ప్లే, మెరుగైన బ్యాటరీలతో ఐఫోన్ SE 4 స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Sports రాయల్ ఛాలెంజర్స్ నుంచి స్టార్ ప్లేయర్ అవుట్
- Lifestyle శ్రీరామనవమికి పానకం, వడపప్పు.. ఈ కొత్త స్టైల్ ట్రై చేయండి..
- Automobiles ఇన్నోవా హైక్రాస్ కొత్త వేరియంట్ వచ్చేసింది - ధర, వివరాలు ఇక్కడ చూడండి
- Travel శ్రీరామనవమి రోజున అయోధ్య రామాలయంలో అద్భుత ఘట్టం...
భూమిక నుంచి ఇది ఊహించి ఉండరు.. బూతు మాటలు.. హాట్ సీన్స్‌తో రచ్చ రచ్చ.!
అక్కినేని హీరో సుమంత్ నటించిన 'యువకుడు' అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది భూమిక చావ్లా. ఆ వెంటనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'ఖుషీ'లో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు ఎన్నో అవార్డులను తెచ్చి పెట్టింది. ఇక, అక్కడి నుంచి ఈ పంజాబీ ముద్దుగుమ్మ వెనుదిరిగి చూడలేదు. దాదాపు టాలీవుడ్‌లోని అందరు హీరోల సరసన నటించింది. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్గా వెలుగొందింది. అయితే, వివాహం తర్వాత ఆమె కెరీర్ ఒక్కసారిగా నెమ్మదించింది. తాజాగా భూమిక చేసిన ఓ పని అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. ఇంతకీ ఏం జరిగింది.? పూర్తి వివరాల్లోకి వెళితే...
ఆ జాగ్రత్తలే నిలబెడుతున్నాయి
వివాహం తర్వాత కొన్ని సినిమాల్లో మాత్రమే భూమిక హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ఇక, ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది ఈ సీనియర్ హీరోయిన్. ఈ క్రమంలోనే నాని, నాగ చైతన్య సినిమాల్లో నటించి మెప్పించింది. అలాగే, ‘యూటర్న్'లో సైతం మంచి పాత్రను చేసింది. దీనికి కారణం ఆమె కథల ఎంపికలో తీసుకునే జాగ్రత్తలేనట.
|
బాలయ్య సినిమా ప్లస్ అయింది
శుక్రవారం విడుదలైన నందమూరి బాలకృష్ణ ‘రూలర్' మూవీలో సైతం భూమిక ముఖ్యమైన పాత్రను పోషించింది. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. ఇందులో భూమిక నటనకు మాత్రం మంచి మార్కులే పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆమెకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. దీంతో భూమిక రెట్టించిన ఉత్సాహంతో పని చేయబోతున్నారని టాక్.
హాట్ ఫొటోలతో హల్చల్
భూమిక చావ్లా దాదాపు అన్ని సినిమాల్లో హోమ్లీ పాత్రల్లోనే కనిపించింది. అందుకే ఆమెకు కూడా గ్లామరస్ పాత్రల కంటే ఇవే ఎక్కువగా వచ్చాయి. కానీ, ఇటీవల ఈ సీనియర్ నటి సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ షాకిస్తోంది. ఈ ఫొటోలు చూసిన వారంతా అవాక్కైపోతున్నారు. దీంతో ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బూతు మాటలు.. హాట్ సీన్స్‌తో రచ్చ
సినిమాల్లో మంచి మంచి పాత్రలు వస్తున్నప్పటికీ భూమిక ఇటీవల ఓ వెబ్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రచారం జరిగింది. ఇందులో ఆమె పాత్ర ఎంతో బోల్డుగా ఉంటుందని తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది. అడల్ట్ కంటెంట్‌తో వస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో భూమిక బూతు మాటలు అనడంతో పాటు కొన్ని హాట్ సీన్లలో కూడా నటించిందని అంటున్నారు.
మీన కూడా బోల్డుగానే చేసింది
ఇటీవలే సీనియర్ హీరోయిన్ మీనా కూడా ఓ వెబ్ సిరీస్‌లో నటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ట్రైలర్ తెలుగు, తమిళ ప్రేక్షకులను అవాక్కయ్యేలా చేసింది. దీనికి కారణం ఇందులో మీనా బూతులు మాట్లాడడంతో పాటు కొంత హాట్‌గా కనిపించడమే. జీ5 యాప్‌తో ఈ వెబ్ సిరీస్ ప్రసారం అవుతోంది.