For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పొట్టి డ్రెస్‌తో షాకిచ్చిన భూమిక: వామ్మో అలా పడుకుని అందాల విందు

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది అమ్మాయిలు హీరోయిన్లుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే ప్రేక్షకులను ఫిదా చేసేసి స్టార్లుగా ఎదిగిపోయారు. అలాంటి వారిలో క్యూట్ హీరోయిన్ భూమిక చావ్లా ఒకరు. టాలీవుడ్‌లోకి సాదాసీదాగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. కెరీర్ ఆరంభంలోనే పలు హిట్లను ఖాతాలో వేసుకుంది. అందులో కొన్ని ఇండస్ట్రీ హిట్లు కూడా ఉన్నాయి. దీంతో ఈ భామ క్రేజ్, డిమాండ్ భారీగా పెరిగిపోయింది.

  అలా చాలా కాలం పాటు హవాను చూపించింది. ఇక, వివాహం తర్వాత స్పీడు తగ్గించిన భూమిక.. సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ హాట్ పిక్‌ను షేర్ చేసింది. ఇకెందుకు ఆలస్యం? ఆ ఫొటోను మీరూ చూడండి!

   అలా పరిచయం.. పాపులారిటీ

  అలా పరిచయం.. పాపులారిటీ


  మోడల్‌గా తనదైన ముద్రను వేసుకుని దూసుకుపోతోన్న సమయంలోనే భూమిక చావ్లా.. సుమంత్ నటించిన 'యువకుడు' అనే మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే పవన్ కల్యాణ్ నటించిన 'ఖుషీ'లో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవడంతో పాటు ఆమెకు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. దీంతో ఆమెకు ఆఫర్లు, ఫాలోయింగ్ పెరిగింది.

  స్విమ్మింగ్ పూల్‌లో రెచ్చిపోయిన ప్రియాంక: అబ్బో తడిచిన అందాలను చూపిస్తూ!

  భారీ హిట్లు.. అందరి మూవీల్లో

  భారీ హిట్లు.. అందరి మూవీల్లో


  సుదీర్ఘ కాలం పాటు తెలుగులో సినిమాలు చేసిన భూమిక చావ్లా ఎన్నో విజయాలను కూడా దక్కించుకుంది. అందులో మహేశ్ బాబుతో నటించిన 'ఒక్కడు', జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి చేసిన 'సింహాద్రీ' చిత్రాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. అవి మాత్రమే కాదు.. సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా టాలీవుడ్‌లోని దాదాపు అందరు హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది.

  టీచర్‌తో లవ్.. తల్లైన భూమిక

  టీచర్‌తో లవ్.. తల్లైన భూమిక


  భూమిక చావ్లా టాలీవుడ్‌లో మాత్రమే కాదు.. మరికొన్ని భాషల్లోనూ సినిమాలు చేసింది. ఇలా వరుస ఆఫర్లతో బిజీగా గడుపుతున్నప్పుడే ఆమె భరత్ ఠాకూర్ అనే యోగా టీచర్‌తో ప్రేమలో పడింది. క్లాసులకు వెళ్తోన్న టైమ్‌లోనే వీళ్లిద్దరూ ప్రేమ పాఠాలు చదువుకున్నారు. ఈ క్రమంలోనే పెద్దలను ఒప్పించి 2007లో భరత్‌ను వివాహం చేసుకుంది. ఈ క్రమంలోనే ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

  మళ్లీ రెచ్చిపోయిన యాంకర్ స్రవంతి: వామ్మో ఇలా చూపిస్తుందేంటి!

  రీఎంట్రీలో వరుస సినిమాలు

  రీఎంట్రీలో వరుస సినిమాలు


  పెళ్లి తర్వాత భూమిక చావ్లా సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో మాత్రం మెరిసింది. ఇలాంటి పరిస్థితుల్లో నాని నటించిన 'ఎంసీఏ' సినిమాతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వరుసగా 'యూటర్న్', 'రూరల్', 'సవ్యసాచి', 'సీటీమార్', 'పాగల్', 'ఇదే మా కథ' వంటి చిత్రాలు చేసింది. అలాగే, మరికొన్నింట్లో నటిస్తోంది.

  సోషల్ మీడియాలో ఫుల్ బిజీ

  సోషల్ మీడియాలో ఫుల్ బిజీ

  చాలా కాలం పాటు వరుసగా సినిమాలు చేసినా.. ఇప్పుడు పెద్దగా వెండితెరపై కనిపించకున్నా సోషల్ మీడియాలో మాత్రం హీరోయిన్ భూమిక చావ్లా యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఈ క్రమంలోనే తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను వదులుతూ హైలైట్ అవుతోంది.

  శృతి మించిన అనన్య అందాల ఆరబోత: వామ్మో ఆమె వేసుకున్న డ్రెస్ చూస్తే!

   అప్పుడప్పుడూ హాట్ ట్రీట్‌తో

  అప్పుడప్పుడూ హాట్ ట్రీట్‌తో


  సుదీర్ఘమైన ప్రయాణంలో భూమిక చావ్లా నటించిన అన్ని సినిమాల్లోనూ డీ గ్లామర్ పాత్రలను మాత్రమే చేస్తూ వచ్చింది. దీంతో గ్లామర్ ట్రీట్‌కు దూరంగానే ఉంది. కానీ, ఇప్పుడు ఈ ముదురు భామ సోషల్ మీడియాలో మాత్రం అందాలు ఆరబోస్తోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలను తరచూ షేర్ చేస్తోంది. దీంతో అందరికీ షాకివ్వడంతో పాటు ట్రెండింగ్ అవుతోంది.

  బుల్లి నిక్కరుతో గ్లామర్ ట్రీట్

  బుల్లి నిక్కరుతో గ్లామర్ ట్రీట్


  తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో భూమిక చావ్లా ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు చిన్న షార్ట్‌ను మాత్రమే ధరించి ఉంది. అంతేకాదు, రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై పడుకుని హాట్ ట్రీట్ ఇస్తోంది. ఫలితంగా ఈ పిక్‌లో ఈ సీనియర్ హీరోయిన్ అందాలు కనువిందు చేసేస్తుంది. దీంతో ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి వైరల్ అయిపోతోంది.

  English summary
  Tollywood actress and a former model Bhumika Chawla Shared a Hot Photo in her Instagram Recently. This Photo Gone Viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X