స్టార్ హీరో సినిమాలో భూమిక నెగిటివ్ రోల్ ?
బిగ్ బాస్ షో ద్వారా ఆడియెన్స్ కు లాక్ డౌన్ లో కూడా దగ్గరగా ఉన్న కింగ్ నాగార్జున బిగ్ స్క్రీన్ కు మాత్రం చాలా గ్యాప్ ఇచ్చారు. 2019లో మన్మథుడు 2 తరువాత మళ్ళీ బిగ్ స్క్రీన్ పై కనిపించలేదు. ఇక వైల్డ్ డాగ్ సినిమాను కూడా మొదట ఓటీటీలోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ జనాల హడావుడి చూసిన అనంతరం మళ్ళీ ప్లాన్ చేంజ్ చేశారు.
తప్పకుండా విభిన్నమైన సినిమాలకు ఆదరణ దక్కుతుందని థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. అసలు మ్యాటర్ లోకి వస్తే నాగార్జున బంగార్రాజు ప్రాజెక్టును త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నట్లు ఇటీవల ప్రెస్ మీట్ లో వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాను వీలైనంత త్వరగా స్టార్ట్ చేసి సంక్రాంతి సీజన్ కు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ప్లాన్ చేసుకుంటున్నాడు.

అయితే సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ గాసిప్ వైరల్ గా మారింది. సినిమాలో నాగార్జునకు విలన్ గా సీనియర్ హీరోయిన్ కనిపించబోతున్నట్లు సమాచారం. ఆమె మరెవరో కాదు.. భూమిక చావ్లా అని ఒక టాక్ అయితే వైరల్ అవుతోంది. ఇక భూమిక, నాగార్జునతో 20 ఏళ్ళ క్రితం స్నేహమంటే ఇదేరా సినిమాలో కనిపించిన విషయం తెలిసిందే. ఇక మళ్ళీ ఇన్నాళ్లకు బంగార్రాజు సినిమాలో నెగిటివ్ పాత్రలో దర్శనమివ్వనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











