స్మిమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ భూమిక అందాల ఆరోబోత.. తడిసిన బట్టల్లో అలా కనిపించేసరికి..

తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఇప్పటివరకు ఎంతమంది నార్త్ హీరోయిన్స్ వచ్చారు. అయితే అందులో కొంతమందిని మాత్రం ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోలేరు. ఆ విధంగా ప్రేక్షకుల మనసులో చాలా బలంగా పాతుకుపోయిన హీరోయిన్లలో భూమిక చావ్లా ఒకరు. ఖుషి, ఒక్కడు వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న ఆమె నాలుగు పదుల వయసు లోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా అదే తరహా అందంతో ఆకట్టుకుంటుంది. ఇక ఇటీవల స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తూ ఈ సీనియర్ నటి అందాల ఆరబోతతో ఇంటర్ నెట్ లో వైరల్ గా మారింది.

మొదట్లోనే బాక్సాఫీస్ హిట్స్

మొదట్లోనే బాక్సాఫీస్ హిట్స్

న్యూఢిల్లీకి చెందిన భూమికా చావ్లా ఒక ఆర్మీ ఫ్యామిలీ నుంచి వచ్చి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదట్లో ఆమె యాడ్ ఫిల్మ్ లలో అలాగే హిందీ మ్యూజిక్ వీడియో ఆల్బంలో కూడా నటించింది. ఇక ఆమెకు మంచి క్రేజ్ రావడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. మొదట యువకుడు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఒక్కడు ఖుషి సింహాద్రి వంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఆమె రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

ఆ ఒక్క సీన్..

ఆ ఒక్క సీన్..

భూమిక చావ్లా కెరీర్ మొదట్లో గ్లామరస్ పాత్రలకు కాస్త దూరంగానే ఉండేది. అవసరానికి మాత్రమే పాత్ర డిమాండ్ తప్ప ఆమె గ్లామర్ డోస్ పెంచేది కాదు. ఇక ఖుషి సినిమాలో నడుము సీన్ ఏ స్థాయిలో క్లిక్కయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సీన్ కోసమే చాలా మంది కుర్రాళ్ళు అప్పట్లో థియేటర్స్ కు క్యూ కట్టారు. ఇప్పటికి కూడా ఖుషి సినిమాను ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదని చాలా మంది ఫ్యాన్స్ అంటుంటారు.

ప్రస్తుతం అలాంటి పాత్రలతో..

ప్రస్తుతం అలాంటి పాత్రలతో..

ఇక హీరోయిన్ గా ఆమె హడావిడి తగ్గిన తర్వాత తన వయసుకు తగ్గట్టుగా పాత్రలు చేసుకుంటే వస్తుంది. ఆ మధ్య కాలంలో క్రికెటర్ ఎంఎస్ ధోని బయోపిక్ లో సోదరి పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా మరికొన్ని సినిమాల్లో తల్లి పాత్రలో కూడా నటించింది. ఇక తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అలాగే సపోర్టింగ్ రోల్స్ తో బాగానే ఆకట్టుకుంటోంది.

గ్లామర్ ట్రీట్

గ్లామర్ ట్రీట్

అయితే సోషల్ మీడియా ద్వారా కూడా భూమిక చావ్లా తన క్రేజ్ ను కొంచెంకొంచెంగా మరింత పెంచుకుంటోంది. ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు హాట్ గా దర్శనమిస్తోంది. భూమిక వయసు ప్రస్తుతం 40 ఏళ్లు అంటే ఎవరు కూడా అంత ఈజీగా నమ్మరు. నేటి తరం గ్లామర్ బ్యూటీలకు ఏ మాత్రం తక్కువ కాకుండా ఆమె అందాల ప్రదర్శనతో ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఈత కొడుతున్న వీడియో వైరల్

రీసెంట్ గా భూమిక చావ్లా కు సంబంధించిన మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భూమిక చావ్లా వెనకాల నుండి ఈత కొడుతున్న ఒక వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో బ్లాక్ స్విమ్ సూట్ లో భూమిక చాలా అందంగా కనిపిస్తోంది అని పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. నాలుగు పదుల వయసు దాటినా కూడా అదే తరహాలో అందంగా ఉంది అని చెబుతున్నారు.

Recommended Video

Lyricist Tirupathi Chawla About His Support System | Induvadana Movie | Filmibeat Telugu
బిజీబిజీగా.. భూమిక చావ్లా..

బిజీబిజీగా.. భూమిక చావ్లా..

ప్రస్తుతం భూమిక చావ్లా కేవలం సినిమాలో మాత్రమే కాకుండా పలు వెబ్ సిరీస్ లో అలాగే టీవీ షోలలో కూడా దర్శనమిస్తోంది. ప్రస్తుతం తమిళం, హిందీలో కూడా భూమిక చాలా బిజీగా మారుతుంది. తమిళంలో ఉదయనిధి స్టాలిన్ నటిస్తున్న ఒక యాక్షన్ సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపిస్తోంది. అంతే కాకుండా హిందీలో ఆపరేషన్ మజ్ను సినిమాలో కూడా చాలా కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X