అనసూయకు కోలుకోలేని ఎదురుదెబ్బ: బడా నిర్మాత కొడుకు షాకివ్వడం వల్లే ఇలా.!

By Manoj Kumar P

తెలుగు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకోవడంతో పాటు కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంది హాట్ బ్యూటీ అనసూయ భరద్వాజ్. ఆకట్టుకునే అందంమే కాదు.. అద్భుతంగా నటించగల నైపుణ్యం ఉండడం వల్ల ఆమె అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై ఓ వెలుగు వెలుగుతోంది. కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో తన హవాను చూపిస్తోన్న ఈ అమ్మడు.. వరుస ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్‌లోని ఓ బడా నిర్మాత కొడుకు తీసుకున్న నిర్ణయంతో అనసూయకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ వివరాలు మీకోసం.!

ఇలా వచ్చి.. అలా ఫేమస్ అయింది

ఇలా వచ్చి.. అలా ఫేమస్ అయింది

అప్పుడెప్పుడో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సినిమా ‘నాగ'లో చిన్న పాత్రను పోషించి సినీ రంగ ప్రవేశం చేసింది అనసూయ. ఆ తర్వాత ప్రముఖ న్యూస్ ఛానెల్‌లో ప్రమోటర్‌గా పని చేసింది. ఆ సమయంలోనే జబర్ధస్త్ అనే కామెడీ షోలోకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. అందులోకి ప్రవేశించిన చాలా తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుందీ అమ్మడు.

విమర్శలకు ధీటైన జవాబులు ఇస్తూ

విమర్శలకు ధీటైన జవాబులు ఇస్తూ

అనసూయ కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో పలు వివాదాల్లోనూ చిక్కుకుంటోంది. దీంతో నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. వాటికి ధీటైన జవాబులిస్తోందీ బ్యూటీ.

రంగమ్మత్తగా సత్తా.. వరుస ఆఫర్లు

రంగమ్మత్తగా సత్తా.. వరుస ఆఫర్లు

బుల్లితెరపై ప్రస్తుతం ఉన్న స్టార్ యాంకర్లలో ఒకరుగా వెలుగొందుతోంది అనసూయ. జబర్ధస్త్‌తో పాటు ఎన్నో షోలలో పని చేస్తున్న ఆమె... సినిమాల్లోనూ సత్తా చాటుతోంది. ఇప్పటికే ‘సోగ్గాడే చిన్ని నాయన', ‘క్షణం', ‘రంగస్థలం', ‘యాత్ర' వంటి సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించిన ఈ హాట్ బ్యూటీ.. తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే ఒప్పుకుంటూ దూసుకుపోతోంది.

ఆయనకు దాసిగా.. వాళ్లకు విలన్‌గా

ఆయనకు దాసిగా.. వాళ్లకు విలన్‌గా

ప్రస్తుతం అనసూయ.. కృష్ణ వంశీ తెరకెక్కిస్తోన్న ‘రంగమార్తాండ'లో నటిస్తోంది. ఇందులో ఆమె దేవదాసి పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఎంతో స్పైసీగా ఉంటుందని దర్శకుడే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే... అల్లు అర్జున్ కొత్త చిత్రం ‘పుష్ప'తో పాటు విజయ్ దేవరకొండ చేయబోయే ఓ సినిమాలో అనసూయ నెగటివ్ రోల్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

అనసూయకు కోలుకోలేని ఎదురుదెబ్బ

అనసూయకు కోలుకోలేని ఎదురుదెబ్బ

వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్న అనసూయ.. బడా నిర్మాత కొడుకు సుమంత్ అశ్విన్‌ హీరోగా గురుప‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఓ చిత్రంలో ఆమె నటించాల్సి ఉంది. అయితే, ఈ సినిమా విషయంలో నాన్చుడు ధోరణి అవలంభిస్తుండడంతో ఆమెను తప్పించినట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. నాలుగు పాత్ర‌ల చుట్టు న‌డిచే రోడ్ జ‌ర్నీ కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది.

అనసూయకు షాకిచ్చిన భూమిక చావ్లా

అనసూయకు షాకిచ్చిన భూమిక చావ్లా

వాస్తవానికి అనసూయ ఈ మూవీలో తల్లి పాత్ర పోషిస్తుందని ప్రచారం జరిగింది. అది నిజం కాదని అప్పట్లో క్లారిటీ కూడా ఇచ్చింది. కానీ, ఈ సినిమాలో నటించడం లేదని మాత్రం చెప్పలేదు. వాస్తవానికి ఇందులో శ్రీకాంత్, అశ్విన్, తన్యా హోప్‌తో పాటు ఆమె కూడా నటించాల్సి ఉంది. అయితే, వెయిటింగ్ గేమ్ ఆడుతుండడంతో అనసూయ స్థానంలో భూమికను తీసుకున్నారని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X