భూమిక చావ్లా అందాల విందు: పొట్టి బట్టల్లో లేటు వయసులో ఘాటు ఫోజులు
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు తమదైన ఇమేజ్‌తో చాలా కాలం పాటు స్టార్లుగా వెలుగొందారు. తద్వారా వరుసగా ఆఫర్లను అందుకుని హవాను చూపించారు. అలాంటి వారిలో క్యూట్ బ్యూటీ భూమిక చావ్లా ఒకరు. సాదాసీదాగా సినిమాల్లోకి ఎంటరైన ఈ భామ.. ఆరంభంలోనే భారీ విజయాలను అందుకుంది. అదే సమయంలో కొన్ని ఇండస్ట్రీ హిట్లను కూడా ఖాతాలో వేసుకుంది. దీంతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇలా చాలా కాలం పాటు సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ.. వివాహం తర్వాత స్పీడు తగ్గించింది. ఇక, ఇప్పుడు సెకెండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన భూమిక.. సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ పిక్ వదిలింది. దాన్ని మీరూ చూడండి!

అలా పరిచయం.. ఫుల్ ఫేమస్
మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్నప్పుడే భూమిక చావ్లా.. సుమంత్ నటించిన ‘యువకుడు' అనే మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘ఖుషీ'లో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవడంతో పాటు ఆమెకు ఎన్నో అవార్డులను కూడా తెచ్చి పెట్టింది. దీంతో ఆమెకు ఆఫర్లు, ఫాలోయింగ్ భారీగా ఏర్పడింది.

ఇండస్ట్రీ హిట్లు.. అందరితోనూ
తెలుగులో సుదీర్ఘ కాలం పాటు సినిమాలు చేసిన భూమిక చావ్లా ఎన్నో విజయాలను కూడా దక్కించుకుంది. అందులో మహేశ్ బాబుతో నటించిన ‘ఒక్కడు', జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి చేసిన ‘సింహాద్రీ' చిత్రాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. అవి మాత్రమే కాదు.. సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా టాలీవుడ్‌లోని దాదాపు అందరు హీరోలతోనూ ఆమె నటించింది.

టీచర్‌తో ప్రేమ.. వివాహం వల్ల
టాలీవుడ్‌లో మాత్రమే కాదు.. మరికొన్ని భాషల్లోనూ భూమిక చావ్లా సినిమాలు చేసింది. ఇలా వరుస ఆఫర్లతో బిజీగా గడుపుతున్నప్పుడే ఆమె భరత్ ఠాకూర్ అనే యోగా టీచర్‌తో ప్రేమలో పడింది. క్లాసులకు వెళ్తోన్న టైమ్‌లోనే వీళ్లిద్దరూ ప్రేమ పాఠాలు చదువుకున్నారు. ఈ క్రమంలోనే పెద్దలను ఒప్పించి 2007లో భరత్‌ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

రీఎంట్రీలో మరింత దూకుడు
వివాహం తర్వాత భూమిక చావ్లా పెద్దగా సినిమాలు చేయలేదు. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో మాత్రం మెరిసింది. ఇలాంటి పరిస్థితుల్లో నాని నటించిన ‘ఎంసీఏ' సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వరుసగా ‘యూటర్న్', ‘రూరల్', ‘సవ్యసాచి', ‘సీటీమార్' వంటి చిత్రాలు చేసింది. అలాగే, ఇప్పుడు మరికొన్ని తెలుగు సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది.

అందులో భూమిక ఫుల్ బిజీగా
ఆ మధ్య వరుస పెట్టి సినిమాలు చేసినా.. ఇప్పుడు పెద్దగా నటించకున్నా సోషల్ మీడియాలో మాత్రం హీరోయిన్ భూమిక చావ్లా యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఈ క్రమంలోనే తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను వదులుతూ తన ఫాలోవర్లను భారీ స్థాయిలో పెంచుకుంటోంది.

అందాలను ఆరబోస్తోన్న నటి
ఇప్పటి వరకూ భూమిక చావ్లా నటించిన అన్ని సినిమాల్లోనూ డీ గ్లామర్ పాత్రలను మాత్రమే చేస్తూ వచ్చింది. దీంతో గ్లామర్ ట్రీట్‌కు దూరంగానే ఉంది. కానీ, ఇప్పుడు ఈ ముదురు భామ సోషల్ మీడియాలో మాత్రం అందాలు ఆరబోస్తోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలను తరచూ షేర్ చేస్తోంది. దీంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇలా ఆమె ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.
Recommended Video


పొట్టి బట్టల్లో ఘాటు ఫోజులతో
భూమిక చావ్లా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు చిన్న షార్ట్‌తో పాటు టైట్ టాప్ డ్రెస్ ధరించి ఉంది. ఫలితంగా ఈ పిక్‌లో ఈ సీనియర్ హీరోయిన్ ఎద అందాలతో కనువిందు చేసేస్తుంది. దీంతో ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది తక్కువ సమయంలోనే తెగ వైరల్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











