For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  స్మిమ్మింగ్ పూల్‌లో అలా కనిపించి షాకిచ్చిన భూమిక: తడిసిన అందాలతో ఎప్పుడూ చూడని విధంగా!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తుంటారు. అయితే, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే స్టార్ స్టేటస్‌ను అందుకుని హవాను చూపిస్తుంటారు. అలా దాదాపు పదేళ్ల క్రితం టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది టాలెంటెడ్ బ్యూటీ భూమిక చావ్లా. సాదాసీదాగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును అందుకుంది. తద్వారా టాలీవుడ్‌లోని దాదాపు అందరు హీరోలతోనూ నటించింది. ఇక, ఈ మధ్యనే సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భూమిక.. తాజాగా స్మిమ్‌సూట్‌తో దిగిన ఫొటోను షేర్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

  అలా ఎంట్రీ ఇచ్చింది.. ‘ఖుషీ'తో కొట్టింది

  అలా ఎంట్రీ ఇచ్చింది.. ‘ఖుషీ'తో కొట్టింది

  అక్కినేని హీరో సుమంత్ నటించిన ‘యువకుడు' అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది భూమిక చావ్లా. ఆ వెంటనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘ఖుషీ'లో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు ఎన్నో అవార్డులను తెచ్చి పెట్టింది. ఇక, అక్కడి నుంచి ఈ పంజాబీ ముద్దుగుమ్మ వెనుదిరిగి చూడలేదు.

   అందరితోనూ.. భారీ విజయాలు సొంతం

  అందరితోనూ.. భారీ విజయాలు సొంతం

  సుదీర్ఘ ప్రయాణంలో భూమిక చావ్లా ఎన్నో సినిమాల్లో నటించింది. వాటిలో చాలా వరకూ విజయాలే ఉన్నాయి. మరీ ముఖ్యంగా మహేశ్ బాబుతో నటించిన ‘ఒక్కడు', జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి చేసిన ‘సింహాద్రీ' చిత్రాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. అవి మాత్రమే కాదు.. సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా టాలీవుడ్‌లోని దాదాపు అందరు హీరోల సరసన నటించిందీ ముద్దుగుమ్మ.

  పెళ్లి తర్వాత దూరం.. అలా రీఎంట్రీ ఇచ్చి

  పెళ్లి తర్వాత దూరం.. అలా రీఎంట్రీ ఇచ్చి

  వివాహం తర్వాత భూమిక చావ్లా సినిమాలకు దూరమైంది. ఒకవేళ అవకాశాలు వచ్చినా క్యారెక్టర్ ఆర్టిస్టుగానే చేస్తూ వచ్చింది. అప్పటి నుంచి మిగిలిన భాషల్లో అడపాదడపా సినిమాలు చేసింది. ఇలాంటి సమయంలో నాని ‘ఎంసీఏ' సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ‘యూటర్న్', ‘రూరల్', ‘సవ్యసాచి' వంటి చిత్రాల్లో నటించింది.

  ఆ వెబ్ సిరీస్‌లో భాగం.. అన్నీ అతిగానే

  ఆ వెబ్ సిరీస్‌లో భాగం.. అన్నీ అతిగానే

  సినిమాల్లో మంచి మంచి పాత్రలు వస్తున్నప్పటికీ భూమిక ఇటీవల ఓ వెబ్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రచారం జరిగింది. ఇందులో ఆమె పాత్ర ఎంతో బోల్డుగా ఉంటుందని వార్త వైరల్ అయ్యాయి. అదే సమయంలో అడల్ట్ కంటెంట్‌తో వస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో భూమిక బూతు మాటలు అనడంతో పాటు కొన్ని హాట్ సీన్లలో కూడా నటించిందన్న ప్రచారం జోరుగా సాగింది.

  అందులో బిజీగా.. రెచ్చిపోతోన్న భామ

  అందులో బిజీగా.. రెచ్చిపోతోన్న భామ

  దాదాపు అన్ని సినిమాల్లో భూమిక చావ్లా సంప్రదాయమైన పాత్రల్లోనే కనిపించింది. అందుకే ఆమెకు కూడా గ్లామరస్ పాత్రల కంటే ఇవే ఎక్కువగా వచ్చాయి. కానీ, ఇటీవల ఈ సీనియర్ నటి సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ షాకిస్తోంది. ఈ ఫొటోలు చూసిన వారంతా అవాక్కైపోతున్నారు. దీంతో ఇవి వైరల్ అవుతున్నాయి.

  స్మిమ్మింగ్ పూల్‌లో అలా కనిపించింది

  స్మిమ్మింగ్ పూల్‌లో అలా కనిపించింది

  సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే భూమిక చావ్లా.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు బ్లాక్ స్విమ్‌సూట్ ధరించి స్మిమ్మింగ్ పూల్‌లో జకలాడుతోంది. ఇక, తడిసిన బట్టల్లో ఆమె అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

  English summary
  Tollywood actress and a former model Bhumika Chawla Shared a Swimsuit Photo in her Instagram Recently. This Photo Gone Viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X