బెడ్ సీన్స్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా.. బోల్డ్ పాత్రలకు సిద్ధమే: భూమిక చావ్లా

ఖుషి సినిమాతో ఒక్కసారిగా సౌత్ ఇండస్ట్రీని ఆకర్షించిన బ్యూటీ భూమిక చావ్లా. ఆ సినిమా తరువాత గ్లామర్ గీత దాటకుండానే అమ్మడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఎలాంటి పాత్రలైన తనదైన శైలిలో చేసి సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించేది. సెకండ్ ఇన్నింగ్స్ లో కొన్ని స్పెషల్ పాత్రల్లో కనిపిస్తున్న భూమిక బోల్డ్ రోల్స్ పై తన అభిప్రాయాన్ని తెలిపింది.

ఖుషి క్రేజ్..

ఖుషి క్రేజ్..

ఎప్పుడైతే అమ్మడు ఖుషి సినిమాలో కనిపించిందో అప్పటి నుంచి భూమిక అంటే తెలియని ఒక స్పెషల్ ఎట్రాక్షన్ నెలకొంది. భూమిక అనగానే అందరికి గుర్తొచ్చే సినిమా ఖుషి. ఆ తరువాత ఎన్నో బాక్స్ ఆఫీస్ సినిమాల్లో నటించినప్పటికీ ఖుషి గర్ల్ గానే ఆడియెన్స్ ఆమెను గుర్తించేవారు. ఆ సినిమాలో మధు అనే పాత్రకు ఈ బ్యూటీ ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసింది.

 ఎక్కువగా తెలుగులోనే..

ఎక్కువగా తెలుగులోనే..

భూమిక మొదట సుమంత్ నటించిన యువకుడు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఆ తరువాత మెల్లగా ఖుషి సినిమాతో సక్సెస్ అందుకొని ఇక్కడే స్థిరపడింది. తమిళ్ లో ఆఫర్స్ వస్తున్నప్పటికీ ఎందుకో భూమిక తెలుగు సినిమాల వైపే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించింది. హిందీలో అప్పుడప్పుడు స్పెషల్ రోల్స్ తో మెప్పించే ప్రయత్నం చేసింది.

సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా బిజీ..

సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా బిజీ..

హీరోయిన్ గా అవకాశాలు తగ్గినప్పటికీ భూమిక సినిమా ఇండస్ట్రీకి ఎక్కువగా గ్యాప్ ఇవ్వలేదు. సినిమాలో ముఖ్యమైన సపోర్టింగ్ రోల్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. సిస్టర్, మదర్ రోల్స్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ముఖ్యంగా నాని 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమాలో భూమిక చేసిన పాత్రకు మాంచి గుర్తింపు దక్కింది. ఇక అదే తరహాలో మరికొన్ని సినిమాల్లో నటించడానికి ఒప్పుకుంటోంది.

Recommended Video

Nandamuribalakrishna & Boyapati Srinu New Movie Launch
బోల్డ్ రోల్స్ కూడా..

బోల్డ్ రోల్స్ కూడా..

వయసు 40 దాటినా కూడా భూమిక అందంలో పెద్దగా తేడా ఏమి రాలేదు. అప్పుడప్పుడు హాట్ స్టిల్స్ తో కుర్రాళ్లను తనవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక బోల్డ్ రోల్స్ చేయడానికి కూడా తనకు ఏ మాత్రం అభ్యంతరం లేదంటూ.. బెడ్ సీన్స్ కష్టమైనా.. ఆ మాత్రం ఉండకపోతే ఎలా అని సమాధానం ఇస్తోంది. కానీ అలాంటి సీన్స్ కథకు అవసరం అయితేనే నటిస్తాను అని భూమిక చెబుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X