రాంగోపాల్ వర్మ శిష్యుడు నాతో దారుణంగా.. కారులో నాపై అత్యాచారం..!
బాలీవుడ్‌లో మీటూ ఉద్యమం ఇంకా చల్లరినట్టు కనిపించడం లేదు. తమకు జరిగిన అన్యాయాలపై ఒక్కొక్కరు నోరు విప్పుతున్నారు. గతంలో ఎందరో యువ హీరోయిన్లు తామ ఎదుర్కొన్న లైంగిక వేధింపులు బయటపెట్టారు. తాజాగా ఆ జాబితాలో బదితా బాగ్ అనే హీరోయిన్ చేరింది. ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన బాబు మొషాయ్ బందుక్‌బాజ్ చిత్రంలో బిదితా నటించింది. ఆమె నటనకు సినీ విమర్శకులు ప్రశంసల వర్షం కురిపించారు. ఓ దర్శకుడితో బదితా తనకు జరిగిన లైంగిక వేధింపులను తాజాగా మీడియాకు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే..

ఆర్జీవి అసిస్టెంట్
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన ఓ వ్యక్తి తన చిత్రంలో నటించాలని ఆఫర్ ఇచ్చారు. ఆ సినిమా కోసం ట్రావెల్ అవుతున్న క్రమంలో మా మధ్య స్నేహం చిగురించింది. తరచుగా పార్టీలు, పబ్‌లలో కలుసుకొనే వాళ్లం. నాతో చనువును అడ్వాంటేజ్‌గా తీసుకొని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అని బిదితా బాగ్ తెలిపింది.

మందు పార్టీ తర్వాత నాతో
ఓ రోజు దర్శకుడితో కలిసి నేను పార్టీకి వెళ్లాను. అప్పుడు దారుణంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. మందు పార్టీ తర్వాత ఇంటికి వచ్చే క్రమంలో కారులో నాతో దారుణంగా ప్రవర్తించాడు. దాంతో చెంపపై ఒక్కటిచ్చి కారులో నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాను. స్నేహం పేరుతో లైంగికంగా వేధించిన తీరు చాలా దారుణం అని బిదితా పేర్కొన్నారు.

ఇది జస్ట్ ఎంజాయ్ అంటూ
ఆ దర్శకుడు నన్ను కారులో నుంచి దిగకుండా అడ్డుకొన్నాడు. బదితా ఇది కేవలం ఎంజాయ్ మాత్రమే. దాన్ని ఎందుకు దూరం చేసుకొంటావు. ఏదో కోల్పోతానని ఎందుకు ఫీల్ అవుతావు. ఇదంతా కామన్. దానిని ఎవరూ పట్టించుకోరు. ఇప్పుడు ఏదో చేసిన దానికి.. కొన్నేళ్ల తర్వాత ఏం గుర్తుంటుంది. దీన్నో చిన్న సంఘటనగా తీసుకోవాలన్నారు అని బిదితా చెప్పింది.

దర్శకుడి పేరు గురించి
తనతో దారుణంగా ప్రవర్తించిన దర్శకుడి పేరు చెప్పడానికి నిరాకరించింది. ఆ వ్యక్తి బాలీవుడ్‌లో ప్రముఖుడు. ఇటీవలే పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు అని బదితా వెల్లడించింది. బిదితా తాజా ఇంటర్వ్యూలో బయటకు వచ్చిన పలు విషయాలు బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.

బదితా కెరీర్ గురించి
బాలీవుడ్‌లో ప్రతిభావంతురాలైన హీరోయిన్లలో బిదితా ఒకరు. బెంగాళీ భాషల్లో మంచి గుర్తింపు వచ్చింది. ఆమె నటించిన బెంగాళీ చిత్రాలు విమర్శల ప్రశంసలు అందుకొన్నాయి. ప్రస్తుతం బిదితా నటించిన టీ ఫర్ తాజ్ మహాల్ చిత్రం విడుదల కానున్నది. సోని పిక్చర్స్ రూపొందించిన చిత్రానికి ఆరుసార్లు రాష్ట్రపతి జాతీయ పురస్కారం అందుకొన్న కిరీట్ ఖురానా దర్శకుడు. ఈ చిత్రం రిలీజ్‌కు ముందే బెంగాళీ ఇండస్ట్రీలో సెన్సేషనల్ టాక్‌ను సొంతం చేసుకొన్నది.


Click it and Unblock the Notifications











