ఐశ్వర్యరాయ్‌కి యాక్సిడెంట్.. సంచలన విషయాన్ని బయటపెట్టిన అమితాబ్
భారతదేశం గర్వించదగ్గ నటుల్లో ముందువరుసలో ఉంటారు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు ఆయన భారతీయ చిత్ర పరిశ్రమను ఏలుతున్నారు. 8 పదుల వయసు దాటినా ఇప్పటికీ చేతి నిండా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంటున్నారు బిగ్‌బీ. వృత్తినే దైవంగా భావించే అమితాబ్.. కుటుంబానికీ అంతే ప్రాధాన్యతనిస్తారు. కుటుంబ సభ్యుల గురించి పలు వేదికలపై ఆయన గొప్పగా చెబుతారు. ఈ క్రమంలోనే కోడలు ఐశ్వర్యరాయ్ గురించి ఆసక్తికర విషయం పంచుకున్నారు అమితాబ్. ఆ వివరాల్లోకి వెళితే..
హిందీ పరిశ్రమకు చెందిన అమితాబ్ బచ్చన్‌కు నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా అమితాబ్ బచ్చన్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇతర హీరోల అభిమానులూ.. ఆయన ఫ్యాన్సే. ఎన్నో కష్టాలకు ఎదురు నిలిచి, ఒకానొక దశలో చావు అంచుల దాకా వెళ్లొచ్చి అమితాబ్ పని అయిపోయింది అనుకున్న దశలో బౌన్స్ బ్యాక్ అయిన తీరు ఎందరితో ఆదర్శం. తన ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు ప్రేక్షకులకు వినోదం అందిస్తూనే ఉంటానని అమితాబ్ చెప్పారు.

సినిమాలే కాదు.. కౌన్ బనేగా కరోడ్ పతి లాంటి షోకు వ్యాఖ్యాతగా బుల్లితెరపైనా సక్సెస్ అయ్యారు. ఈ రియాలిటీ షో ద్వారా కోట్లాది మంది భారతీయులకు మరింత చేరువయ్యారు బిగ్‌బీ. అమితాబ్‌తో పాటు కెరీర్ ప్రారంభించిన ఎంతోమంది సినిమాలకు రిటైర్మెంట్ చెప్పేసి.. మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకుంటున్నారు. కానీ ఆయన మాత్రం 80 ఏళ్ల వయసులోనూ అదే ఉత్సాహంతో పనిచేస్తున్నారు. వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమేనని.. అది శరీరానికే కానీ, మనసుకు కాదని తన నటన ద్వారా అమితాబ్ రుజువు చేస్తున్నారు.
ఇటీవల నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడీలో యాక్షన్ సీక్వెన్స్‌లలో ప్రభాస్‌తో ఢీ అంటే ఢీ అనేలా నటించారు బిగ్‌బీ. ఇందులోని అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్‌ను తప్పించి మరొకరిని ఊహించుకోలేనంతగా తన పాత్రకు జీవం పోశారు. ఆ వయసులోనూ యాక్షన్ సీక్వెన్స్‌లు చేసి శెభాష్ అనిపించుకున్నారు. సామాన్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు అమితాబ్‌కు వీరాభిమానులు. ఆయనను స్పూర్తిగా తీసుకుని సినిమాల్లోకి వచ్చారు, ఇంకా వస్తూనే ఉన్నారు.
ఇదిలాఉండగా.. తన కోడలు ఐశ్వర్యరాయ్‌తో అమితాబ్‌కు అనుబంధం ఉంది. కోడలిగా కాకుండా కూతురిలా ఆమెను చూసుకుంటాను బిగ్‌బీ. అలాంటిది ఓసారి సెట్‌లో ఐష్‌కు పెద్ద ప్రమాదం జరిగిందని, అప్పుడు తాను రెండ్రోజులు నిద్రపోలేదని గుర్తుచేసుకున్నారు. 2003లో ఖాకీ సినిమా చిత్రీకరణలో భాగంగా కారు అదుపుతప్పి ఐశ్వర్య కూర్చొన్న కుర్చీని ఢీకొట్టిందని.. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్రగాయాలైనట్లు తెలిపారు.
దీంతో ఐశ్వర్యను హుటాహుటిన ముంబైకి విమానంలో తీసుకెళ్లాలని అనుకున్నామని.. అయితే నాసిక్‌లో నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ లేకపోవడంతో అక్కడికి దగ్గరలోని ఆర్మీ బేస్‌లో విమానాన్ని ల్యాండ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకున్నట్లు అమితాబ్ వెల్లడించారు. అక్కడి నుంచి ముంబైలోని అనిల్ అంబానీ ఆసుపత్రికి చేర్చామని.. ఐశ్వర్య పరిస్ధితి చూసి తాను ఎంతో మదనపడ్డానని ఆయన పేర్కొన్నారు. రెండ్రోజులు నిద్ర పట్టలేదని.. ఆ ఘటనను మరిచిపోవడానికి చాలా సమయం పట్టిందని బిగ్‌బీ చెప్పారు. ప్రస్తుతం అమితాబ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











