For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అలాంటి వాళ్లకే ఇండస్ట్రీలో ఆఫర్లు.. సీక్రెట్ బయటపెట్టిన బిగ్‌బాస్ బ్యూటీ!

  |

  బిగ్‌బాస్ 13 హౌస్‌లో సందడి చేసిన షెహనాజ్ గిల్‌కు ఇటీవల కాలంలో ఏ హీరోయిన్‌కు దక్కని క్రేజ్ దక్కుతున్నది. తాజాగా ప్రియుడు సిద్దార్థ్ శుక్లాతో రిలేషన్‌షిప్‌ను కొనసాగిస్తున్న ఈ భామ పలుమార్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ప్రస్తుతం శరీర బరువును తగ్గించుకొని నాజుక్కుగా మారిన ఈ సుందరి మరోసారి ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చింది. బిగ్‌బాస్ బ్యూటీ టాప్ ట్రెండింగ్‌ నిలువడానికి కారణమేమిటంటే..

   ఆరోగ్య చిట్కాలతో షెహనాజ్ లైవ్

  ఆరోగ్య చిట్కాలతో షెహనాజ్ లైవ్

  బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో జాగ్రత్తగా షెహనాజ్ గిల్ మ్యూజిక్ వీడియోలపై దృష్టిపెట్టింది. అంతేకాకుండా ఇంటి పట్టునే ఉంటూ బాడీ వెయిట్‌ను గణనీయంగా తగ్గింది. ఈ క్రమంలో యూట్యూబ్ లైవ్ ద్వారా అభిమానులతో ముచ్చటిస్తూ బరువు ఎలా తగ్గాను. అందుకు ఏం చేయాలనే సీక్రెట్స్‌ను వెల్లడించింది. అంతేకాకుండా ఆహార నియమాలు ఎలా పాటించాలని క్లారిటీ ఇచ్చేసింది

  అదనంగా ఉండే బరువును..

  అదనంగా ఉండే బరువును..

  ఫ్యాన్స్‌తో షెహనాజ్ గిల్ మాట్లాడుతూ... నా ముందుకు ఓ ఆఫర్ వచ్చింది. ఆ స్క్రిప్టు ప్రకారం నా శరీర బరువును తగ్గించుకోమన్నారు. దాని వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో చెప్పారు. తన శరీరంలో అదనంగా ఉన్న బరువును తగ్గించుకోవడానికి నేను జాగ్రత్తలు తీసుకొన్నాను అని అన్నారు.

  సన్నజాజిలా ఎలా మారానంటే..

  సన్నజాజిలా ఎలా మారానంటే..

  నా ఆఫర్‌ గురించి కాకుండా.. నా టీమ్ ఎప్పటి నుంచో చక్కెర, ఉప్పు తగ్గించుకోమని చెబుతున్నారు. అయితే అలా చేస్తే బరువు తగ్గుతాననే నమ్మకం లేకపోయేది. అయితే చాలా తక్కువ తింటూ ఎక్కువ వెయిట్ తగ్గించుకోవచ్చనే నా శ్రేయోభిలాషుల సలహాను పాటించాను. దాంతో బరువు చాలా తగ్గాను అంటూ షెహనాజ్ గిల్ తెలిపారు.

  నా రొటీన్ డైట్ ప్లాన్ ఏమిటంటే..

  నా రొటీన్ డైట్ ప్లాన్ ఏమిటంటే..

  షెహనాజ్ తన ఆరోగ్య చిట్కాలు గురించి చెబుతూ.. ఉదయం గట్టిగానే బ్రేక్‌ఫాస్ట్‌తో టీ తీసుకొంటాను. అలాగే మధ్యాహ్నం పప్పు, అన్నం, ఏదైనా ఆకు కూరను తీసుకొంటాను. డిన్నర్‌ సమయంలో కేవలం మిల్క్ తాగుతాను అని షెహనాజ్ చెప్పగా.. బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు నీవు చాలా అందంగా ఉన్నావు అంటూ అభిమాని కితాబు ఇచ్చారు.

   స్లిమ్‌గా ఉంటేనే ఆఫర్లు అంటూ..

  స్లిమ్‌గా ఉంటేనే ఆఫర్లు అంటూ..

  అభిమాని ప్రశంసపై స్పందిస్తూ కావాలంటే నేను మళ్లీ ఓల్డ్ లుక్‌కు వెళ్లగలను. నాకు మళ్లీ వెయిట్ పెరిగి పూర్వంలా కనిపించడం నాకు కష్టం కాదు. అయితే సన్నపడటం వెనుక మరో కారణం ఉంది. సినిమా, టెలివిజన్ ఇండస్ట్రీలో స్లిమ్‌గా ఉంటేనే ఆఫర్లు వస్తాయి. సన్నజాజిలా ఉండే వాళ్లకే గుర్తింపు ఉంటుంది అని హెహనాజ్ గిల్ పేర్కొన్నది.

  English summary
  Bigg Boss 13 Beauty Shehnaaz Gill on top trending in twitter. She went on Youtube live and shared her weight loss, diet plan to Fans.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X