twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీ హృదయాలను ముక్కలు చేస్తా..సల్మాన్‌కే చీకటి గదిలో చితక్కొట్టుడు హీరోయిన్ టెండర్.. బిగ్‌బాస్‌లో రచ్చ

    |

    చీకటి గదిలో చితక్కొట్టుడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన హీరోయిన్ నిక్కి తంబోలి హిందీ బిగ్‌బాస్‌లో అడుగుపెట్టింది. హోస్ట్ సల్మాన్ ఖాన్‌తో వేదికపైన ప్రవేశించినప్పటి నుంచి ఇంట్లోకి చేరే వరకు నిక్కి రచ్చ చేసింది. నేను సింగిల్ అంటూ ఏకంగా సల్మాన్‌కే టెండర్ వేసే ప్రయత్నం చేసింది. ఓ దశలో నిక్కి తంబోలి ధాటికి సల్మాన్ కూడా చిత్తపోయినట్టు కనిపించారు. నిక్కి తంబోలి‌కి సంబంధించిన హాట్ హాట్ ముచ్చట్లు ఇవే..

    నాకు బాయ్‌ఫ్రెండ్ లేరు.. అఫైర్లు లేవు

    నాకు బాయ్‌ఫ్రెండ్ లేరు.. అఫైర్లు లేవు

    శనివారం ( అక్టోబర్ 3 తేదీన) ప్రారంభమైన హిందీ బిగ్‌బాస్ షోలో నిక్కి తంబోలి హాట్ కంటెస్టెంట్‌గా తొలి రోజే క్రేజ్‌ను సంపాదించుకొన్నది. సల్మాన్‌ ఖాన్‌తో మాట్లాడుతూ.. అబ్బాయిలందరూ ఎప్పుడూ ఏడిపిస్తునే ఉంటారు. నేను ఇప్పుడు సింగిల్. నాకు ఎలాంటి అఫైర్లు లేవు. బిగ్‌బాస్‌లో ఎంజాయ్ చేయాలనుకొంటున్నాను. నేను చాలా బబ్లీగా ఉంటాను. ఈ షోలో ఎక్కువ కాలం ఉండేందుకు ప్రయత్నిస్తాను అని నిక్కి తంబోలి అన్నారు.

    సల్మాన్‌ను బుట్టలో వేసుకొనేందుకు

    సల్మాన్‌ను బుట్టలో వేసుకొనేందుకు

    బిగ్‌బాస్‌ స్టేజ్‌పై సల్మాన్‌ను ఆకట్టుకొనేందుకు నిక్కి చిన్నపిల్లలా చేసిన ప్రయత్నాలు నవ్వను తెప్పించాయి. నిక్కి ప్రవర్తనను చూసి సల్మాన్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ కనిపంచాయి. నాకు అబ్బాయిలను బుట్టలో వేసుకొనే చిట్కాలు తెలియవు. కానీ ఈ షో కోసం ప్రత్యేకంగా నేర్చుకొన్నాను అని నిక్కి తంబోలి తెలిపారు.

    నీవేమైనా ట్రై చేస్తావా.. సల్మాన్‌కు షాక్

    నీవేమైనా ట్రై చేస్తావా.. సల్మాన్‌కు షాక్

    బిగ్‌బాస్ వేదికపై సల్మాన్ మాట్లాడుతూ.. నీకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నారా? అని అడిగితే.. నాకు బాయ్‌ఫ్రెండ్స్ లేరు. నేను ఇప్పుడు సింగిల్. నీవేమైనా ట్రై చేస్తావా అంటూ సల్మాన్‌కే షాకిచ్చింది. దాంతో సల్మాన్ బిగ్గరగా నవ్వుతూ హంగామా చేశారు.

    అబ్బాయిలు జాగ్రత్త

    అబ్బాయిలు జాగ్రత్త

    బిగ్‌బాస్ వేదికపైన నిక్కి తంబోలిని పరిచయం చేస్తూ ప్రోమో వీడియోను ప్రదర్శించారు. అందులో నిక్కి తంబోలి మాట్లాడుతూ సౌత్ ఇండియన్ హీరోయిన్‌ను, నేను చాలా హాట్. అబ్బాయిలందరూ మీ హృదయాలను జాగ్రత్తగా ఉంచుకొండి. లేకపోతే మీ హృదయాలను ముక్కలు చేస్తాను. ఇంట్లో మీ హృదయాలతో ఆడుకొంటాను అని నిక్కి తంబోలి చెప్పారు.

    Recommended Video

    Thipparaa Meesam Movie Public Talk
    చీకటి గదిలో చితక్కొట్టుడుతో సినిమాల్లోకి

    చీకటి గదిలో చితక్కొట్టుడుతో సినిమాల్లోకి

    బిగ్‌బాస్ హిందీ 14 సీజన్‌లోకి ప్రవేశించిన నిక్కి తంబోలి టాలీవుడ్ చిత్రాల్లో నటించింది. చీకటి గదిలో చితక్కొట్టుడు చిత్రంలో శృంగారపరమైన పాత్రతో హాట్ హాట్‌గా నటించింది. ఆ తర్వాత కాంచన 3, తిప్పర మీసం చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రయత్నాలు ప్రారంభించడంతో తెలుగు సినిమాకు దూరమైంది.

    English summary
    Tollywood heroine and Chikati Gadilo Chithakotudu fame Nikki Tamboli into Salman Khan's Bigg Boss 14 season. Nikki make up photo are went viral in social media where she was in bigg Boss set. Salman Khan's Bigg Boss which started on October 3rd. In this occasssion, South Indian heroine Bigg Boss 14 contestant Nikki Tamboli try to flirt Host Salman Khan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X