టిల్లు స్క్వేర్‌ అలా మోసం చేశాడు.. ఆ పార్ట్‌కు సర్జరీ ఎందుకంటే? లీక్ చేసిన బిగ్‌బాస్ బ్యూటీ!

బిగ్‌బాస్ షో ద్వారా పొందిన స్టార్‌డమ్‌తో చాలా మంది సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటున్నారు. కానీ కొందరికి మాత్రం వారి దురదృష్టమో ఏమో కానీ కొందరికీ ఈ షో ద్వారా మంచి పాపులారిటీ వచ్చినా ఛాన్సులు మాత్రం రావట్లేదు. ఇలాంటి వారిలో శ్రీసత్య ఒకరు. విజయవాడకు చెందిన ఈ అమ్మాయి మెడికల్ స్టూడెంట్. సినిమాలు, నటనపై ఆసక్తితో ఎంబీబీఎస్‌ను మధ్యలోనే వదిలిపెట్టి ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌లో అడుగుపెట్టింది. తొలుత మోడలింగ్ ద్వారా కెరీర్‌ను మొదలుపెట్టిన ఆమె.. మిస్ విజయవాడగా, మిస్ ఆంధ్రగా ఎంపికైంది. ఎన్నో ప్రముఖ సంస్థలకు చెందిన వాణిజ్య ప్రకటనల్లో నటించింది. బంగారు ఆభరణాల సంస్థలు జోయ్ ఆలుక్కాస్, కృష్ణ జ్యువెలరీలు చేసిన యాడ్స్ ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి.

ఈ క్రమంలో శ్రీసత్యకు సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయి. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన నేను శైలజలో ఓ చిన్న క్యారెక్టర్ చేసింది. అలాగే గోదావరి నవ్మింది, లవ్ స్కెచ్, తరుణం వంటి వెబ్‌సిరీస్‌లలో నటించింది. బుల్లితెరపైనా అవకాశాలు రావడంతో ముద్ద మందారం, అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు, త్రినయని సీరియల్స్‌లో కీలకపాత్రలు పోషించింది. 2021లో తొందరపడకు సుందర వదనా అనే వెబ్‌సిరీస్‌లోనూ శ్రీసత్య నటించారు. అదే ఏడాది జీ తెలుగులో ప్రసారమైన రియాలిటీ షో సూపర్ క్వీన్‌లో ఓ కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేశారు.

bigg boss 6 telugu fame sri satya made sensational comments on her lip filling surgery

ఈ దశలో బిగ్‌బాస్ తెలుగు సీజన్ -6లో ఓ కంటెస్టెంట్‌గా ఆమెకు ఛాన్స్ దక్కింది. తొలుత ఈ షోను సీరియస్‌గా తీసుకోకుండా తోటి కంటెస్టెంట్స్‌తో ముచ్చట్లు పెట్టడం, వంట చేసుకుని అందరితో కలిసి తినడం వంటి పనులతో ఓ పిక్‌నిక్ స్పాట్‌గా ఎంజాయ్ చేసింది. చివరికి నాగ్ ఆమెకు క్లాస్ పీకడంతో నెమ్మదిగా తన గేమ్ ప్లాన్ మార్చి.. ఫిజికల్ టాస్క్‌ల్లో దెబ్బలు తగిలినా పోరాడింది. చివరికి గ్రాండ్ ఫినాలేకు అడుగు దూరంలో శ్రీసత్య ఎలిమినేట్ అయ్యింది. బిగ్‌బాస్ షో ద్వారా ఆమె బాగానే సంపాదించిందని అప్పట్లో గాసిప్స్ హల్ చల్ చేశాయి.

అసలు బిగ్‌బాస్‌కి వచ్చిందే డబ్బు, ఫేమ్ కోసమని ఏ మాత్రం మొహమాటం లేకుండా చెప్పేసింది శ్రీసత్య. ఈ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో అవకాశాలు తనకు పోటెత్తుతాయని శ్రీసత్య భావించింది. కానీ సీన్ కట్ చేస్తే అందుకు రివర్స్‌లో జరుగుతోందట. మంచి లుక్ కోసం తన పై పెదవికి సర్జరీ చేయించుకున్నా రిజల్ట్ కనిపించలేదట. ఆఫ్టర్ సర్జరీ వీడియోస్‌కి, గతంలోని ఆమె ఇన్‌స్టా వీడియోలను పోల్చుతూ లిప్ సర్జరీ వికటించిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు.

bigg boss 6 telugu fame sri satya made sensational comments on her lip filling surgery

ఈ క్రమంలో ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, లిప్ సర్జరీపై ఆసక్తికరమైన అంశాలు పంచుకున్నారు శ్రీసత్య. టిల్లు స్క్వేర్ సినిమాలోని ఓ పాటలో తాను డ్యాన్స్ చేశానని.. కానీ దానిని ఎడిటింగ్‌లో లేపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అవకాశాల కోసం ప్రయత్నించినప్పుడల్లా.. అందంగానే ఉన్నావ్, కానీ ఫేస్ చాలా చిన్నదిగా కనిపిస్తోందని అనేవారని శ్రీసత్య తెలిపారు.

తన ఫేస్‌లో మార్పుల కోసం లిప్ ఫిల్లర్స్ చేయించానని .. నన్ను చూసిన కొందరు పాత లుక్ బాగుందని అంటున్నారని .. అయితే సినిమా వాళ్లు మాత్రం బాగున్నావ్, మెచ్యూర్డ్‌ లుక్ కనిపిస్తోందని కాంప్లిమెంట్ ఇచ్చారని ఆమె వెల్లడించారు. అలాగే డ్యాన్స్ షో సందర్భంగా కొందరితో కలిసి డ్యాన్స్ చేయాల్సి వచ్చేదని.. దీంతో ఎవరితో డ్యాన్స్ చేసినా సోషల్ మీడియాలో లేనిపోని సంబంధాలు అంటగడుతున్నారని శ్రీసత్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సరికాదని.. ఇలాంటివి మానుకోవాలని ఆమె హితవు పలికారు. ప్రస్తుతం శ్రీసత్య వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: bigg boss sri satya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X