అందుకే ఆర్జీవీ నంబర్ బ్లాక్ చేశా.. అసలు విషయం బయటపెట్టిన బిగ్ బాస్ హాట్ బ్యూటీ..
డైరెక్టర్ ఆర్జీవి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ప్రత్యేక పరిచయం కూడా అవసరం లేదు. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాలతో తెలుగు సినిమా కీర్తిని దేశవ్యాప్తం చేసిన డైరెక్టర్ ఆర్జీవి. తెలుగులోనే కాదు బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోలతో సినిమాలు తీశాడంటే.. ఆయన టేకింగ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కానీ, ఇటీవల కాలంలో ఆయన ఏది చేసిన వివాదాస్పదంగా మారుతోంది. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు ఆర్జీవి. అయితే.. అలాంటి ఆర్జీవిని.. ఓ బుల్లితెర స్టార్ యాంకరమ్మ ఘోరంగా అవమానించిందట. ఇంతకీ ఆ బుల్లితెర యాంకర్ ఎవరు? అసలు ఏం జరిగింది?
ఆ బుల్లితెర యాంకర్ ఎవరో కాదు.. బిగ్ బాస్ బ్యూటీ, తెలుగు హాట్ యాంకరమ్మ అరియానా గ్లోరీ. అమ్ముడు గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ యూత్ .. ఈమె అంటే పడి చచ్చిపోతారు. ఈమె తన అందాల ఆరా బోస్తూ.. ఇంటర్వ్యూలు చేస్తోంది. తన ఘాటు అందాలతో నెటిజన్లకు పిచ్చెక్కిస్తుంది. నిజంగా కెమెరా ముందు అందాలు ఆరబోయడంలో ఏమాత్రం వెనకడుగు వేయదు. సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు అందాల ఆరాబోత మామూలుగా ఉండదు.

ఈ అమ్మడు మెయిన్ గా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి హాట్ అండ్ బోల్ట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అరియానా గ్లోరీ.. ఈ ఇంటర్య్యూలో ఒక్క ఇంటర్వ్యూతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఆ ఇంటర్వ్యూ ఇప్పటికి సోషల్ మీడియాలో వైరలవుతునే ఉంటుంది. ఈ ఇంటర్య్వూ సమయంలో అరియానా జిమ్ చేస్తూ..తన అందాలు ఆరబోస్తూ.. బోల్డ్ క్వశ్చన్ అడగటం. ఆర్జీవీ మందు తాగుతూ సమాధానాలివ్వడం సంచలనమే అని చెప్పాలి. ఈ ఇంటర్య్వూ లో అరియానా రేంజ్ మారిపోయింది.అలా వచ్చిన ఫేమ్ తోనే బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. అక్కడ కూడా తన అందాల జాతరతో బిగ్ బాస్ లో హైలెట్ గా నిలిచింది.
ఇదెలా ఉంటే.. యాంకర్ అరియానా ప్రస్తుతం 'దావత్' అనే టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో సినిమా ప్రమోట్ చేస్తూ.. అందులోని నటించిన హీరో, హీరోయిన్స్, డైరెక్టర్స్ ను ఇంటర్వ్యూ చేస్తుంది. అలాగే టైర్ 2 యాక్టర్స్ ను తన షో కు పిలిచి, తన ఘాటైన ప్రశ్నలతో తిక్క మగపెడుతుంది. ఈ 'దావత్' అనే షోలో ఆరియానా డ్రెస్సింగ్ గాని, డబుల్ మినింగ్ మాటలు గాని షోకు హైలెట్ గా నిలుస్తున్నాయి. తాజాగా ఆరియానా 'దావత్' కార్యక్రమానికి జబర్దస్త్ రాకేష్ తన భార్య సుజాతతో కలిసి హాజరయ్యారు.
కెసిఆర్ మూవీని ప్రమోట్ లో భాగంగా రాకేష్ మాట్లాడుతూ.. తమ సినిమాకు ముందుగా 'దావత్' అనే టైటిల్ పెడదామని అనుకున్నానని చెప్పాడు. అ తరువాత ఐస్ క్రీమ్ సినిమా గుర్తుందా? మీ గురువు (ఆర్జీవీ)ది అంటూ జబరస్త్ రాకేష్ ఏదో చెప్పబోతుంటే.. 'అందరూ గురువుగారు.. గురువుగారు అని అంటూ..' అంటూ ఆర్జీవికి తనకు చిన్న డిస్టబెన్స్ వచ్చిందని, అప్పటినుండి ఆర్జీవీ నెంబర్ ను తాను బ్లాక్ చేశానని తెలిపారు హరియానా. 'ఆర్జీవి గారు ప్రపంచాన్ని బ్లాక్ చేస్తాడే.. మీరు ఆయన నెంబర్ బ్లాక్ చేశారా' అంటూ సెటైరికల్ పంచ్ వేశాడు. అయితే.. ఆర్జీవి తనకు ఏ విషయంలో గొడవ జరిగిందో అనే విషయాన్ని మాత్రం ఆరియానా చెప్పలేదు. ప్రస్తుతం ఆరియానా కామెంట్స్ నెటింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
వాస్తవానికి ఆర్జీవీ అంటే ఓ బ్రాండ్. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన వారిలో చాలా మంది ఆయన శిష్యులే. నాగార్జున తో 'శివ' సినిమా తెరకెక్కించి, అప్పట్లో ఇండస్ట్రీలోని పలు రికార్డ్స్ బ్రేక్ చేశారు. ఆ తర్వాత బాలీవుడ్ లోనూ బిగ్ బీ అలాంటి పెద్ద యాక్టర్ తో సంచలన సినిమాలు తీశాడు. గతంలో సూపర్ హిట్ మూవీస్ అందించిన వర్మ.. ఆ తరువాత కాలంలో ప్రేక్షకుల నాడీని పట్టుకోలేకపోయారు. అలాగే.. కాంట్రవర్సీ సినిమాలు, బయోపిక్స్ చేయడంతో గోపాల్ వర్మ తన గ్రాఫ్ పడిపోయింది.


Click it and Unblock the Notifications











