Divi Vadthya: చిలుకపచ్చ చీరలో పొడుగు కాళ్ల సుందరి.. సరికొత్త సొగసులు చూశారా?
బిగ్ బాస్ బ్యూటీ, పొడుగు కాళ్ల సుందరి అయిన దివి వాద్త్యా గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె ఇటీవలే లంబసింగి అనే ఓ సినిమాలో హీరోయిన్ గా కూడా చేసింది. ఇలా కెరియర్ లో ముందుకెళ్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా అదిరిపోయే ఫొటోలు దిగింది. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ముఖ్యంగా చిలుకపచ్చ రంగు చీర కట్టుకుని వయ్యారాలు ఒలకబోసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బిగ్ బాస్ తో తెలుగు ప్రేక్షకులు దగ్గరైంది దివి వాద్త్యా. అంతకుముందు ఒకటీ రెండూ సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించినా అంతగా పేరు రాలేదు. కానీ బిగ్‌బాస్ షోకు వచ్చి మాత్రం విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. తన అందంతో పాటు క్యూట్ క్యూట్ మాటలతో అందరినీ మెప్పించింది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి వరుసగా సినిమాలు, వెబ్ సిరీసులు, ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ అలరిస్తోంది.

ఇటీవలే లంబసింగి సినిమాలో హీరోయిన్ గా కనిపించి మెప్పించిన ఈమెకు రోజురోజుకూ అభిమానులు పెరిగిపోతున్నారు. కేవలం అభిమానులు మాత్రమే కాదండోయ్... అందాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. దివి అందంతో పాటు టాలెంట్ ను కూడా గుర్తించిన దర్శక, నిర్మాతలు కూడా ఆమెకు అనేక సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నారు. ఇలా కెరియర్ లో చాలా బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుందీ ముద్దుగుమ్మ. ముఖ్యంగా తనకు సంబంధించిన అదిరిపోయే ఫొటోలను ఎప్పటికప్పుడు నెట్టింట పెడుతూ రచ్చ చేస్తుంది.
అంతే కాకుండా తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను కూడా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా అదిరిపోయే ఫొటోలు షేర్ చేసింది. అందులో చిలుక పచ్చ రంగు చీర కట్టుకుని వయ్యారాలు ఒలకబోసింది. ముఖ్యంగా అచ్చమైన తెలుగు తనం ఉట్టిపడేలా కనిపిస్తున్న ఈ పొడుగు కాళ్ల సుందడి సరికొత్త ఫోజులకు అంతా ఫిదా అయిపోతున్నారు. వీటిని చూసిన ప్రతీ ఒక్కరూ లైకులు, షేర్లు, కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ చెప్పుకొస్తున్నారు.
ఇంతందం ఏంటి దివి అంటూ కొందరు.. అచ్చం రామ చిలుకలా అందంగా ఉన్నావని మరికొందరు తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. ఇంత సింపుల్ చీరలోనూ ఇంతందంగా ఉన్నావంటే.. పట్టు చీరలో పగడపు బొమ్మలా ఉంటావు కావొచ్చంటూ కామెంట్లు చేస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ అందాలపై ఓ లుక్ వేయండి.


Click it and Unblock the Notifications











