బ్లాక్ చీరలో బహుచక్కని అందాల ప్రదర్శన.. 45 ఏళ్ల ఈ బిగ్‌బాస్ బ్యూటీని గుర్తు పట్టారా?
అచ్చమైన తెలుగు అందం.. అందులోనూ అద్భుతమైన టాలీవుడ్ నటి, అలాగే బిగ్ బాస్ షోలోనూ రచ్చ చేసిన శైలజ ప్రియ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె.. అంతకు మించిన అభినయంతో తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. ఒకప్పుడు హీరోయిన్ గా చేసిన ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే మిగిలిపోయింది. ఇంత అందం ఉన్న ఈమె హీరోయిన్ గా రాణించలేకపోయినా... తెలుగు సినీ ప్రియుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. అయితే తాజాగా ఈ ముద్దగుమ్మ బ్లాక్ కలర్ చీర కట్టుకని బహుచక్కని అందాలు ఆరబోసింది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫొటోల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం 45 ఏళ్ల వయసు కల్గిన శైలజ ప్రియ.. పాతికేళ్ల పడుచులాగే కనిపిస్తోంది. అద్భుతమైన అందాలతో అందిరనీ అలరిస్తున్న ఈమెకు రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. 1997లో మాస్టర్ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈమె.. తొలి చిత్రంతోనే అందరినీ ఆకట్టుకుంది. తన అందం, అభినయం కనబరుస్తూ.. అనేక సినిమా అవకాశాలను రాబట్టుకుంది. ఇలా వచ్చిన ప్రతీ క్యారెక్టర్ కు జీవం పోస్తూ.. తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. అందువల్లే ఆమెకు అనేక మంది అభిమానులు అయ్యారు.

కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా సీరియల్స్ లో కూడా నటించి మెప్పించే ఈ ముద్దుగుమ్మ.. దాదాపు 16కు పైగా సీరియల్స్ లో కనిపించింది. ఓవైపు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే సీరియల్స్ కూడా కనిపించింది. అలాగే అనేక టీవీ షోలలోనూ సందడి చేసి బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 షోకి కూడా వెళ్లింది. అక్కడ కూడా తన అందాలతో పాటు నిజమైన వ్యక్తిత్వాన్ని చూపించి అనేక మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ఇక బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నుంచి పలు షోలు, సీరియల్స్ చేస్తూ బిజీగా గడుపుతోంది. ఎంత బిజీగా ఉన్న సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అందమైన హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది.
అలాగే పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా బ్లాక్ కలర్ చీర కట్టుకుని బహుచక్కని అందాలను ఆరబోసింది. అందులో అదిరిపోయే అందాలు చూపిస్తూ నెట్టింట రచ్చ చేసింది. ముఖ్యంగా బ్లాక్ కలర్ చీరకు మ్యాచింగ్ గా భలేగా మేకప్ వేసుకుని.. చాలా పెద్దదానిలా దర్శనం ఇచ్చింది. ఆమె వయసు కాస్త పెద్దగా కనిపిస్తున్నా అంతకు మించి అందాలు కనిపిస్తున్నాయి.

శైలజ ప్రియ షేర్ చేసిన ఈ ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ అందంగా ఉన్నావు, అదిరిపోయావు, నీ అందాలు తట్టుకోలేకపోతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందని కొందరు.. నీ అందాలకు మేమెప్పుడూ దాసోహమే అంటూ మరికొందరు తమ మనుసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


Click it and Unblock the Notifications











