45 ఏళ్ల వయసులో జీన్స్ వేసి వయ్యారాలు పోతున్న బిగ్‌బాస్ బ్యూటీ.. ఎవరో గుర్తు పట్టారుగా!
అనేక సినిమాల్లో అమ్మగా, అక్కగా, వదినగా, పిన్నిగా అద్భుతమైన క్యారెక్టర్లలలో కనిపించిన నటించిన వాళ్ల పేర్లలో ఎప్పుడూ ముందుండే ముద్దుగుమ్మ శైలజ ప్రియ గురించి అందరికీ తెలిసిందే. అద్భుతమైన అందాలు, అంతకు మించిన నటనతో అందరినీ కట్టి పేడేసే ఈమెకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం 45 ఏళ్ల వయసు కల్గిన ఈమె 1997లో మాస్టర్ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తన అద్భుతమై నటనతో అందరినీ ఆకట్టుకుండూ అనేక అవకాశాలు దక్కించుకుంది. అద్భుతమైన క్యారెక్టర్లలకు ప్రాణం పోసి ప్రత్యేకంగా నిలిచిపోయింది.
కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా సీరియల్స్ లో కూడా నటించి మెప్పించే ఈ ముద్దుగుమ్మ.. దాదాపు 16కు పైగా సీరియల్స్ లో కనిపించింది. ఓవైపు సినిమాలు, మరోవైపు సీరియల్స్ లో కనిపిస్తూ తెగ సందడి చేసే ఈమె.. సంతూర్ టాప్ 10, గీతాంజలి, ఎందరో మహానుభావులు వంటి టీవీ షోల్లో కూడా మెరిసింది. అంతేకాదండోయ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 షోలో కనిపించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. విన్నర్ గా గెలవలేకపోయినా తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో మాత్రం ప్రత్యేక స్థానం సంపాధించుకుంది. ఎప్పుడూ సినిమాలు, సీరియల్స్, పలు షోలలో కనిపించే ఈమె.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంద. అలాగే తనకు సంబంధించిన హాట్ హాట్ ఫొటోలను ఎప్పటికప్పుడు నెట్టింట పోస్ట్ చేస్తూ.. కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా అద్భుతమైన ఔట్ ఫిట్లలో దర్శనం ఇస్తూ తెగ సందడి చేస్తుంది. ముఖ్యంగా ట్రెండీ ఔట్ ఫిట్ల నుంచి పద్ధతైన చీర కట్టు వరకు అన్ని బట్టలు ధరిస్తూ.. తన అభిమానులను అలరిస్తుంది. ఎప్పుడూ, ఎక్కువగా చీర కట్టులో కనిపించే ఈ క్యూట్ బ్యూటీ ఈసారి మాత్రం చాలా ట్రెండీగా కనిపించింది. ముఖ్యంగా జీన్స్ వేసి వావ్ అనిపించింది.
బ్లూ కలర్ జీన్స్ వేసిన ఈమె... లైట్ కలర్ వైట్ లైన్స్ ఉన్న షర్టును స్టైల్ చేసింది. షర్ట్ కలర్ హైహీల్స్ వేసి మిర్రర్ ఎదుట నిలబడి మరీ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. షర్టును సగం వరకు మలిచి మరో సగాన్ని కిందకు వదిలింది. ఇలా చాలా స్టైల్ గా కనిపిస్తున్న ఈమె మెడలో ఓ సన్నని చైన్ వేసుకుని, చేతికి ఓ సింపుల్ బ్రేస్ లెట్ వేసుకుంది. శైలజ ప్రియ షేర్ చేసిన ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ చాలా బాగున్నావు, అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ చెప్పుకొస్తున్నారు.

45 ఏళ్ల వయసులోనే ఇంత హాట్ గా ఉన్నావంటే ఇక పాతికేళ్ల వయసులో, పదహారేళ్ల వయసులో ఇంకెంత అందంగా ఉండేదానివో చూడాలని ఉందంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో అడుగుతున్నారు. ముగ్ధమనోహరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ట్రెండీ లుక్ ఫొటోలను మీరు కూడా ఓసారి చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











