Vithika Sheru: నా భర్త అలా మారినప్పుడే పిల్లల్ని కంటాను.. సూటిగా చెప్పేసిన వితికా!

ఒకప్పటి హీరోయిన్, బిగ్ బాస్ బ్యూటీ వితికా షెరు గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె హీరో వరుణ్ సందేశ్ భార్య అని కూడా అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ స్పెషల్ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అందులో తన భర్త, పిల్లలపై షాకింగ్ కామెంట్లు చేస్తింది. తన భర్త అలా మారినప్పుడే తాను పిల్లల్ని కంటానని అందరికీ క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం వితికా షెరు షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం 30 ఏళ్ల వయసు కల్గిన వితికా షెరు అచ్చమైన తెలుగు అమ్మాయి. ఏపీలోని భీమవరంలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటు తమిళ, కన్నడ చిత్రాల్లో నటించింది. 2008లో సినీ రంగంలో అడుగు పెట్టిన ఈమె 2015 వరకు హీరోయిన్ గా చేసింది. ఇలా అద్భుతమైన అందంతో అందరినీ ఆకట్టుకుంటూ హీరోయిన్ గా మారిన ఈమె ఆ తర్వాత హీరో వరుణ్ సందేశ్ తో ప్రేమలో పడింది. ఇలా ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్న ఈ జంట ఇరుకుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

Bigg Boss Beauty Vithika Sheru Shocking Comments About Having Kids Check Details

అయితే వీరికి పెళ్లి అయిన తర్వాత వీరిద్దరూ కలిసి బిగ్ బాస్ షోకు వచ్చారు. 2019లో వచ్చిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో పాల్గొన్న ఈ జంట అన్యోన్యంగా ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ నుంచి వచ్చిన వీళ్లు చాలా హాయిగా గడుపుతూ లైఫ్ ను సాగిస్తున్నారు. ఇప్పటికే వితికా తన చెల్లి పెళ్లి చేయడంతో పాటు ఇల్లు కూడా కట్టింది. ఇలా పర్సనల్ లైఫ్ లో చాలా ఫాస్ట్ గా ముందుకు వెళ్తున్న ఈ జంట.. పెళ్లి జరిగి చాలా రోజులు గడుస్తున్నా ఈ జంట ఇప్పటి వరకు పిల్లల్ని కనలేదు.

దీంతో అటు వరుణ్ సందేశ్ అభిమానులతో పాటు వితికా అభిమానులు ఎప్పటికప్పుడు ఈ విషయం గురించి అడుగుతున్నారు. పిల్లల్ని ఎప్పుడు కంటావు, తల్లి ఎప్పుడు అవుతావు అంటూ ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా వీటన్నిటికీ వితికా షెరు సమాధానం చెప్పింది. ముఖ్యంగా ఓ వీడియో చేసి మరీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. అందులో వితికా కారు నడుపుతూ ఉండగా... వరుణ్ సందేశ్ ఫ్రంట్ సీట్ లోనే కూర్చుని తనపై పడుకున్నాడు.

Bigg Boss Beauty Vithika Sheru Shocking Comments About Having Kids Check Details

అయితే అందరూ పిల్లలు ఎప్పుడు అని తనని అడుగుతున్నారని... తనకు మాత్రం తన భర్త ఎప్పుడు పెద్ద వాడు అయితే అప్పుడే పిల్లల్ని కనాలని ఉందని చెప్పుకొచ్చింది. ఇలా వితికా షెరు తాను పిల్లల్ని ఎప్పుడు కనాలి అనుకుందో నేరుగా చెప్పేగా అంతా షాక్ అవుతున్నారు. చాలా మంది ఈమెను సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం త్వరగా తల్లి అవ్వు అంటూ చెప్పుకొస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X