VJ Sunny కి సపోర్ట్ చేస్తారా? రేప్ చేస్తామంటూ రోహిణి, ఉమాదేవికి బెదిరింపులు.. ఫ్యాన్స్, పీఆర్‌లపై మాధవీలత

బిగ్‌బాస్ తెలుగు 5లో అనాగరిక చర్య అంటూ సోషల్ మీడియా పోస్టుతో సంచలనం రేపిన సినీ నటి హీరోయిన్ మాధవీలత మరోసారి వీడియోతో ఘాటుగా స్పందించింది. కొందరు హీరోల ఫ్యాన్స్‌ రేప్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ వల్ల హీరోలు నాశనం అవుతున్నారు. ఇక చిల్లర వేషాలు వేయకండి.. మీ వేషాలు చూసి మీ హీరోను చిల్లర అనుకొంటారని వీడియోలో వార్నింగ్ ఇచ్చింది. వీడియోలో మాధవీలత చేసిన వ్యాఖ్యలు ఏమిటంటే..

Recommended Video

VJ Sunny కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి బెదిరింపులు Madhavi Latha ఫైర్| Rowdy Rohini| Filmibeat Telugu
జబర్దస్త్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ రోహిణికి బెదిరింపులు

జబర్దస్త్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ రోహిణికి బెదిరింపులు

బిగ్‌బాస్ తెలుగు 5 కంటెస్టెంట్ వీజే సన్నీకి సపోర్ట్‌గా నిలిచిన బిగ్‌బాస్ కంటెస్టెంట్లు రోహిణి, కార్తీక దీపం సీరియల్ ఉమాదేవిని కొందరు హీరోల ఫ్యాన్స్ బెదిరింపులకు పాల్పడుతున్నట్టు నా నోటిసుకు వచ్చింది. జబర్దస్త్ కమెడియన్ రోహిణి తన యూట్యూబ్ ఛానెల్‌ రౌడీ రోహిణిలో వీజే సన్నీకి సపోర్టుగా నిలవడంపై ఆమెను బెదిరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అని హీరోయిన్ మాధవీలత తన వీడియోలో వెల్లడించింది.

రేప్ చేస్తామంటూ ఉమాదేవికి వార్నింగ్

రేప్ చేస్తామంటూ ఉమాదేవికి వార్నింగ్

ఇక కార్తీకదీపం సీరియల్‌ ఫేమ్, తాజా బిగ్‌బాస్‌ కంటెస్టెంట్ ఉమాదేవిని కూడా రేప్ చేస్తామని బెదిరిస్తున్నారు. మేము సూపర్‌స్టార్ ఫ్యాన్స్‌మి. మా జోలికి వస్తే రేప్ చేస్తామని బెదిరిస్తున్నారట. ఇలాంటి చిల్లర పనులు చేసే వాళ్లు ఫ్యాన్స్ ఎలా అవుతారు. అప్పుడు మిమ్మల్ని మేము ఏమంటామో తెలుసా? మీ హీరోలు అలా ఉన్నందుకే.. మీరు ఇలా చిల్లరగా మారారని అంటాం అని మాధవీలత ఘాటుగా స్పందించారు.

హీరోల ఫ్యాన్స్ హుందాగా వ్యవహరించాలి

హీరోల ఫ్యాన్స్ హుందాగా వ్యవహరించాలి

ఏ హీరో ఫ్యాన్స్ అయినా మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి. ఎవరైనా విమర్శలు, ఆరోపణలు చేస్తే మాకు నచ్చలేదు అని హుందాగా వ్యవహరించాలి. అంతేకానీ రేప్ చేస్తాం. మీ అంతు చూస్తామని ఆడవాళ్లపై ప్రతాపం చూపితే.. మిమ్మల్ని చిల్లర వాళ్లుగా ట్రీట్ చేస్తాం. ఆడవాళ్లను దూషించే మీరు ఒకడికే పుట్టారా? ఒకడికి పుట్టని వాళ్లే ఇలాంటి ఆడవాళ్లపై చిల్లర వ్యాఖ్యలు చేస్తుంటారు అని మాధవీలత అన్నారు.

5 లక్షలు తీసుకొని ఇలాంటి పోస్టులు పెడితే...

5 లక్షలు తీసుకొని ఇలాంటి పోస్టులు పెడితే...

ఇక బిగ్‌బాస్ కంటెస్టెంట్లను టార్గెట్ చేస్తున్న పీఆర్ కంపెనీలు, హీరోల పీఆర్‌లపై మాధవీలత ఘాటుగా స్పందించారు. హీరోలు పీఆర్‌లు, పీఆర్ కంపెనీలు దొంగ ఐడీలు తీసుకొని ఇలాంటి వెధవ వేషాలకు పాల్పడుతున్నారు. పీఆర్ కోసం 5 లక్షలు తీసుకోని ఇలాంటి పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకొంటాం. పీఆర్ కంపెనీల బండారాన్ని బయటపెట్టడం అంత కష్టమేమీ కాదు. పీఆర్ కోసం తీసుకొనే లక్షలకు బదులుగా కోట్ల రూపాయల దావా కట్టాల్సి ఉంటుంది అని మాధవీలత హెచ్చరించారు.

మీ హీరోలు కూడా మీలానే చిల్లర వాళ్లా?

మీ హీరోలు కూడా మీలానే చిల్లర వాళ్లా?

హీరోల ఫ్యాన్స్ హుందాగా వ్యవహరించాలి. మీరు వాడే పదజాలాన్ని బట్టి మీ హీరో క్యారెక్టర్‌ను అంచనా వేయాల్సి ఉంటుంది. మీరు నీచంగా దిగజారారంటే.. మీ హీరో కూడా అంత నీచమని చెబుతాను. నన్ను దూషించినా పర్వలేదు కానీ.. ఇతర మహిళలను టార్గెట్ చేస్తే దారుణమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి చిల్లర వేషాల వేయకండి. లేకపోతే మీ హీరోలు కూడా చిల్లర అని భావించాల్సి ఉంటుంది అని మాధవీలత వార్నింగ్ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X