వేశ్య క్యారెక్టర్ చేయడానికి కారణమదే.. టాలీవుడ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. ఈ పోటీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, రాణించాలంటే.. అందం, అభినయం, కష్టపడి పని చేయడం మాత్రమే కాకుండా కొన్ని సందర్భాల్లో అదృష్టం కూడా కలిసి రావాలి. అయితే.. కొన్ని పాత్రల్లో నటించాలంటే.. కేవలం నటననే కాదు.. ఆ పాత్రను మోయగల ధైర్యం కూడా ఉండాలి. అలాంటి పాత్రల్లో వేశ్య పాత్ర ఒక్కటి. ఈ పాత్రలో నటించాలంటే.. అందం, అభినయంతో మాత్రమే కాదు. గట్స్ కూడా ఉండాలి. ఇలాంటి పాత్రల్లో నటించి ఎంతో మంది నటిమణీలు ప్రశంసలు పొందారు. ఇప్పుడు ఇలాంటి పాత్రలో ఓ టాలీవుడ్ బ్యూటీ నటించబోతుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఈ పాత్ర పోషించడానికి గల కారణమేంటీ?
ఈ హీరోయిన్ ఎవరో కాదు.. టాలీవుడ్ అచ్చతెలుగు అందం బిందు మాధవి ( Bindhu Madhavi). ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'అవకాయ బిర్యానీ'తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత బంపర్ ఆఫర్, పిల్ల జమిందార్ సినిమాల్లో నటించింది. కానీ, ఆమెకు తెలుగులో పెద్ద గుర్తింపు రాలేదో గానీ, తమిళంలో మాత్రం వరుస అవకాశాలు దక్కించుకుంటూ మంచి స్టార్డమ్ సంపాదించింది. తెలుగు కంటే కోలీవుడ్‌లోనే ఆమెకు ఎక్కువ మార్కెట్ ఏర్పడింది. ఇటీవల బిగ్‌బాస్ షోలో పాల్గొని విజేతగా నిలిచిన తర్వాత, బిందు మళ్లీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. బిగ్‌బాస్ ఫేమ్ ఆమెకు మరోసారి సినిమా అవకాశాలు వస్తున్నాయి.

రీసెంట్‌గా విడుదలైన 'యాంగర్ టేల్స్' వెబ్ సిరీస్‌లో బిందు నటించింది. ఆమె నటనకు విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు దక్కాయి. ఈ సిరీస్ బిందు మాధవిలో ఉన్న నిజమైన నటిని మరోసారి బయటకు తీసుకువచ్చింది. ప్రస్తుతం బిందు మాధవి ఫుల్ బిజీగా ఉంది. ఏకంగా నాలుగు వెబ్ సిరీస్‌లు, ఒక సినిమా షూటింగ్‌తో ఆమె షెడ్యూల్ బిజీబిజీగా సాగుతోంది. మరికొన్ని ప్రాజెక్టులు చర్చల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు బిందు మాధవి ' దండోరా' అనే సినిమాలో నటిస్తోంది.
ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహిస్తుండగా, లైక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో, పాత ఆచారాలు, చక్కటి హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో ఈ చిత్రం రూపొందుతోంది. అందులో శివాజీ, నవదీప్, నందు, మణిక, అనూష, రాధ్య, రవి కృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాలో బిందు మాధవి వేశ్య పాత్రలో కనిపించబోతోంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా మూవీ యూనిట్ ఆమెకు ప్రత్యేకంగా విషెస్ తెలుపుతూ ఒక పోస్టర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా చిత్రబృందం మీడియాతో సమావేశమై సినిమా విశేషాలను పంచుకుంది. ఈ సందర్భంగా 'దండోరా'లో వేశ్య పాత్రలో నటించిన బిందు మాధవి తాజాగా తన పాత్రకు సంబంధించిన ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఒక మీడియా ఇంటర్వ్యూలో బిందు మాధవి ఈ పాత్ర ఎలా వచ్చిందో, ఎలా అంగీకరించిందో పూర్తి వివరాలు చెప్పింది.
బిందు మాధవి మాట్లాడుతూ.. "నాకు ఈ పాత్ర వచ్చినప్పుడు మొదట్లో కొంచెం కన్ఫ్యూజన్‌గానే అనిపించింది" అని చెప్పింది. "ఒకరోజు మా డైరెక్టర్ కథ చెప్పడానికి వచ్చారు. అప్పటికే సినిమా సగం పూర్తి అయిందని చెప్పారు. మొదట్లో 'సగం మూవీ అయిపోయిందిగా... నా పాత్ర చిన్నదిగా ఉండొచ్చు' అనుకుని రిజెక్ట్ చేయాలనిపించింది. కానీ ఏదో ఒక ఇంట్యూషన్ వల్లైనా కావచ్చు... కథ ఒక్కసారి వినేద్దాం అనుకున్నా" కథ విన్న తర్వాతే తన నిర్ణయం పూర్తిగా మారిపోయిందని బిందు చెబుతోంది. "డైరెక్టర్ కథ చెబుతూనే... కొన్ని ఎమోషన్స్ వెంటనే కళ్ల ముందుకి వచ్చాయి. నా ఎంట్రీతో సినిమా మొత్తం టర్న్ అయ్యేలా ఈ పాత్ర ఉందని అప్పుడు అర్థమైంది. ఆ క్షణంలోనే 'ఈ పాత్ర నాదే' అని ఫిక్స్ అయ్యాను." అని చెప్పారు.
అలాగే వేశ్య పాత్రకు అనుష్క రిఫరెన్స్ తీసుకున్నారా? అని ప్రశ్నించగా.. "అసలు ఎలాంటి రిఫరెన్స్ తీసుకోలేదు. ఎవరినీ చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు. డైరెక్టర్ టేకింగ్... నా యాక్టింగ్ ఇవే ఈ పాత్రకు బేస్," అని తెలిపింది. ఈ సినిమాలో మొదటి నుండి నటించాలని కోరిక ఉన్నప్పటికీ, ఇలాంటి పవర్ పుల్ రోల్ దొరకడం అదృష్టమని కూడా చెప్పింది. "దండోరా'లో నటించిన ప్రతి యాక్టర్ 100% ఇచ్చారు. నా పాత్ర కూడా సినిమాలో కీలకంగా ఉంటుంది. ఇది నాకు ఒక ఎక్స్పెరిమెంటల్ పాత్ర. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేస్తారో చూడాలి," అని బిందు ఆశాభావం వ్యక్తం చేసింది.


Click it and Unblock the Notifications











