For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బీచ్‌లో ప్యాంట్ లేకుండా బిగ్ బాస్ దివి రచ్చ: వామ్మో ఈ తెలుగు పిల్లను ఇలా చూశారంటే!

  |

  తెలుగు బుల్లితెర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ప్రేక్షకాదరణను అందుకుని నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఈ షో ద్వారా ఎంతో మంది తెలుగు అమ్మాయిలు వెలుగులోకి వచ్చారు. తద్వారా భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సొంతం చేసుకోవడంతో పాటు వరుసగా ఆఫర్లను సైతం అందుకుంటున్నారు. అలాంటి వారిలో సొట్టబుగ్గల తెలుగు చిన్నది దివి వాద్యా ఒకరు. కెరీర్ ఆరంభంలోనే పలు సినిమాల్లో నటించినా గుర్తింపును మాత్రం పెద్దగా దక్కించుకోలేకపోయింది.

  అయితే, బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం ఎనలేని క్రేజ్‌ను అందుకుంది. అప్పటి నుంచి వరుసగా అవకాశాలను కూడా అందుకుంటోంది. ఇక దివి వాద్యా తాజాగా ఓ హాటోను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

  సినిమాల్లోకి ఎంట్రీ.. గుర్తింపు లేదు

  సినిమాల్లోకి ఎంట్రీ.. గుర్తింపు లేదు

  చూపు తిప్పుకోకుండా చేయగల అందంతో మోడలింగ్ రంగంలోకి వెళ్లిన దివి వాద్యా.. ఆరంభంలోనే పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే 'లెట్స్ గో', 'సీన్ నెంబర్ 72' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత మహేశ్ చిత్రం 'మహర్షి' కీలక పాత్రతో దివి కనిపించింది. కానీ, ఆమెకు మాత్రం సరైన గుర్తింపు దక్కలేదు.

  యంగ్ క్రికెటర్‌తో బాలయ్య హీరోయిన్ నైట్ పార్టీ: ఇద్దరూ అలా దొరికిపోవడంతో కలకలం!

  బిగ్ బాస్ ఆఫర్‌.. మంచి గుర్తింపుతో

  బిగ్ బాస్ ఆఫర్‌.. మంచి గుర్తింపుతో

  పలు సినిమాల్లో నటించినా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో దివి వాద్యా విఫలం అయింది. అయితేనేం ఆమెకు బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం దక్కింది. ఫలితంగా నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ షోలో అద్భుతమైన ఆటతీరుతో పాటు అందంతో ఎంతో మందిని ఫిదా చేసేసింది. నిజాయితీగా ఉంటూ, నిర్భయంగా మాట్లాడి మంచి పేరు తెచ్చుకుంది.

  బిగ్ బాస్ షోతో దివి కెరీర్ మారింది

  బిగ్ బాస్ షోతో దివి కెరీర్ మారింది

  బిగ్ బాస్ షోలో మధ్యలోనే ఎలిమినేట్ అయినా దివి వాద్యా ఆమె అందానికి ఎంతో మంది ఫిదా అయ్యారు. దీంతో బయటకు వచ్చిన వెంటనే ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగానే ఈ అమ్మడు పలు వెబ్ సిరీస్‌లతో పాటు కొన్ని సినిమాలకు సంతకాలు కూడా చేసేసింది. వీటితో పాటు కొన్ని చిన్న చిత్రాల్లోనూ హీరోయిన్‌గా చేస్తోంది. దీంతో అమ్మడి కెరీర్ మారిపోయింది.

  NTR31: ఎన్టీఆర్ - బుచ్చిబాబు సినిమాకు ఊహించని టైటిల్.. ఆరోజే ప్రకటనతో పాటు పోస్టర్‌ కూడా!

  ఫుల్ ఫేమస్.. ఆ హాట్ సీన్‌తో రచ్చ

  ఫుల్ ఫేమస్.. ఆ హాట్ సీన్‌తో రచ్చ

  దివి అందానికి ఫిదా అయిన చిరంజీవి ఆమెకు 'భోళా శంకర్' సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఇప్పటికే ఆమె 'క్యాబ్ స్టోరీస్', 'లంబసింగి' అనే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లలో నటించింది. అలాగే, కాన్సెప్ట్ ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఓ మూవీ చేసింది. ఇక, 'నయీం డైరీస్' మూవీలో దివి చేసిన హాట్ సీన్ ఎంతో వైరల్ అయింది. దీంతో ఈ బ్యూటీ పేరు మారుమ్రోగిపోయింది.

  సోషల్ మీడియాలో మాత్రం బిజీగా

  సోషల్ మీడియాలో మాత్రం బిజీగా

  బిగ్ బాస్ షో తర్వాత సినిమాల మీద సినిమాలు చేస్తున్నా.. సోషల్ మీడియాలో దివి వాద్యా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన.. తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. ఇలా కొద్ది రోజుల క్రితమే మోస్ట్ డిజైరబుల్‌గా నిలిచింది.

  హాట్ వీడియోతో షాకిచ్చిన ప్రియాంక సింగ్: వామ్మో ఆమెను ఇలా చూశారంటే తట్టుకోలేరు!

  అందాలను ఆరబోస్తూ గ్లామర్ ట్రీట్

  అందాలను ఆరబోస్తూ గ్లామర్ ట్రీట్

  వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్నా.. దివి వాద్యా సోషల్ మీడియాలో చేసే హడావిడి అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ తర్వాత మరింత స్పీడు పెంచేసిన ఈ భామ.. అప్పుడప్పుడూ అందాల విందు చేస్తోంది. మరీ ముఖ్యంగా హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో షేర్ చేస్తోంది. తద్వారా లేలేత అందాలతో కుర్రకారును హుషారెత్తిస్తూ రచ్చ రచ్చ చేసేస్తోంది.

  ప్యాంటు లేకుండా ఘాటు ఫోజులు

  ప్యాంటు లేకుండా ఘాటు ఫోజులు

  సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోన్న దివి వాద్యా.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు బీచ్‌లో ప్యాంట్ లేకుండా ఘాటు ఫోజులు ఇచ్చింది. దీంతో ఆమె తొడల అందాలు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా దివి వాద్యా పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో ఇవన్నీ విపరీతంగా వైరల్ అయిపోయాయి.

  English summary
  Bigg Boss Fame and Famous Actress Divi Vadthya is very Active in Social Media. Now She Shares Beach Photos in Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X