Bigg Boss బ్యూటీ దివి వద్యా ఓవర్ డోస్ హాట్ షో.. మతిపోయే అందాలతో..!

తెలుగులో అత్యధిక పాపులర్ రియాలిటీ షోగా గుర్తింపు పొందింది బిగ్​ బాస్​. దీని వల్ల చాలా మంది చిన్న చిన్న ఆర్టిస్టులు బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. అందులో ఒకరే సొట్ట బుగ్గ సుందరి దివి వాద్యా. బిగ్​ బాస్​ తెలుగు నాలుగో సీజన్​లో ఎంట్రీ ఇచ్చి సూపర్​ పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ.

అయితే బిగ్​బాస్ ఎంట్రీకి ముందు సూపర్ స్టార్ మహేశ్​ బాబు మహర్షి సినిమాలో ఓ సన్నివేశంలో తళుక్కున మెరిసింది ఈ భామ. అయితే అప్పుడు అంతగా లైమ్​ లైట్​లోకి రాలేదు ఈ అమ్మడు. కానీ బిగ్ బాస్ ఫేమ్ తో మాత్రం వరుసగా సినీ అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తోంది. అలాగే మరోవైపు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు వదులుతూ మరింత పాపులర్ అవుతోంది ఈ ముద్దుగుమ్మ.

సినిమాలతో పాపులర్ కానీ దివి..

సినిమాలతో పాపులర్ కానీ దివి..

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే దివి వాద్యా మోడల్‌గా సత్తా చాటింది. ఈ క్రమంలోనే 'లెట్స్ గో' అనే సినిమాతో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత 'సీన్ నెంబర్ 72' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు చిత్రం 'మహర్షి'లో ఓ సన్నివేశంలో తళుక్కున మెరిసింది. ఇలా ఎన్నో చిత్రాల్లో మెరిసినా దివి వాద్యా మాత్రం ఫేమస్ కాలేకపోయింది.

నిజాయితీగా ఉంటూ..

నిజాయితీగా ఉంటూ..

ఎప్పుడో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దివి వాద్యా హీరోయిన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా చాలా సినిమాలు చేసినా గుర్తింపు మాత్రం దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కింది. ఇందులోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది. అంతేకాదు, నిజాయితీగా ఉంటూ పాపులర్ అయిపోయింది.

దివికి చిరు ఆఫర్..

దివికి చిరు ఆఫర్..

బిగ్ బాస్ రియాలిటీ షోలో తనదైన ఆటతీరుతో ఆకట్టుకున్న దివి వాద్యా ఊహించని విధంగా మధ్యలోనే ఎలిమినేట్ అయింది. దీంతో షో నిర్వహకులపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. షోలో ఎలిమినేట్ అయినా దివికి మాత్రం సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఆమె అందానికి ఫిదా అయిన చిరంజీవి.. ఫినాలే సమయంలో 'భోళా శంకర్' సినిమాలో అవకాశం ఇస్తున్నట్లుగా ప్రకటించారు.

గాడ్ ఫాదర్ లో కీ రోల్..

గాడ్ ఫాదర్ లో కీ రోల్..

అయితే తర్వాత దివి వాద్యా చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అలా బిగ్ బాస్ షో తర్వాత దివి వాద్యా వరుసగా సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే 'నయీం డైరీస్' మూవీలో దివి చేసిన హాట్ సీన్ ఎంతో హైలైట్ అయింది. ఇది తెగ వైరల్ అవడంతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ఈ సినిమానే కాదు.. ఈ బ్యూటీ 'క్యాబ్ స్టోరీస్', 'లంబసింగి' అనే చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అలాగే, కాన్సెప్ట్ ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఓ మూవీని చేసింది.

పర్సనల్ విషయాలకు సంబంధించి..

పర్సనల్ విషయాలకు సంబంధించి..

సినిమాలే కాకుండా మానీళ్ల ట్యాంక్, పరంపర 2 వంటి వెబ్ సిరీస్ ల్లోనూ ఆకట్టుకుంది దివి వాద్యా. సినిమాలు, సిరీస్ లే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది ఈ భామ. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. ఫొటోలు, వీడియోలు వదులుతూ గత ఏడాది మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్‌గానూ ఎంపికైంది.

నాభి అందాలతో రచ్చ..

నాభి అందాలతో రచ్చ..

సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో హల్ చల్ చేసే దివి వాద్యా తాజాగా మరో ఫొటోను వదిలింది. ఇందులో తన నాభి అందాన్ని చాలా ఘాటుగా చూపించింది ఈ సొట్ట బుగ్గల సుందరి. తన నడుమును చూపించేలా చేతులను పైకి పెట్టి రొమాంటిక్ గా పోజుచ్చింది దివి వాద్యా. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదే కాకుండా ఇప్పటికీ ఇలా చాలా సార్లు తన నాభి అందాలతో యువతను మెస్మరైజ్ చేసింది ఈ అచ్చ తెలుగు అమ్మాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X