For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెడిషనల్ డ్రెస్సులోనూ దివి వాద్యా అందాల విందు.. సిగ్గు పడుతూనే చూపిస్తూ!

  |

  బిగ్ బాస్ తెలుగు రియాలిటీ ద్వారా ఎంతోమందికి అవకాశాలు లభించాయి. లైమ్ లైట్ లోకి రానివారు, అప్పుడప్పుడే కెరీర్ ను నిలబెట్టుకునేందుకు ప్రయత్నించేవారికి బిగ్ బాస్ షో ఎంతో ఉపయోగపడింది. ఇలా బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన సినిమా ఆఫర్లు అందిపుచ్చుకున్నవాళ్లు ఎంతో మంది ఉన్నారు. వారిలో ఒకరు బ్యూటిఫుల్ దివి వాద్యా. బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటి తన ఆట, అందంతో బుల్లితెర ప్రేక్షకులనే కాకుండా సినీ దర్శకనిర్మాతలను సైతం అట్రాక్ట్ చేసింది. ఫలితంగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగుతుంది. అలాగే సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో నిత్యం హైలెట్ అవుతోంది.

  మోడలింగ్ లో రాణించి..

  మోడలింగ్ లో రాణించి..

  సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందు మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది ముద్దుగుమ్మ దివి వాద్యా. మోడలింగ్ రంగంలో తన అందచందాలతో సత్తా చాటిన ఈ వయ్యారి భామ 'లెట్స్ గో' అనే సినిమాతో నటిగా ఇంట్రడ్యూస్ అయింది. అనంతరం 'సీన్ నెంబర్ 72' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. ఈ క్రమంలోనే ఆమెకు సూపర్ స్టార్ మహేశ్ బాబు చిత్రం 'మహర్షి'లో ఓ సన్నివేశంలో తళుక్కున మెరిసే అవకాశం లభించింది. ఇలా ఎన్నో చిత్రాల్లో మెరిసినా దివి వాద్యా మాత్రం ఫేమస్ కాలేకపోయింది.

  సాదాసీదాగా ఎంట్రీ..

  సాదాసీదాగా ఎంట్రీ..

  ఎప్పుడో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన గ్లామరస్ బ్యూటి దివి వాద్యా హీరోయిన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా అనేక సినిమాలు చేసింది. అందులో కొన్ని సినిమాలు విజయం సాధించినప్పటికి దివికి మాత్రం సరైనా గుర్తింపు దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమెకు బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం లభించింది. ఈ సీజన్ లోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తన అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది. అంతేకాదు, నిజాయితీగా ఉంటూ అనేకమందికి ఫేవరేట్ గా నిలిచింది.

  వెతుక్కుంటూ వచ్చిన ఆఫర్స్..

  వెతుక్కుంటూ వచ్చిన ఆఫర్స్..

  బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్ లో తనదైన ఆటతీరుతో ఆకట్టుకున్న దివి వాద్యా ఊహించని విధంగా మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయింది. అప్పుడు బిగ్ బాస్ నిర్వహకులపై పలు విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయినా దివి వాద్యాకు మాత్రం ఫుల్ క్రేజ్ వచ్చింది. దీంతో ఆమెను సినిమా ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి. ఆమె అందానికి ఫిదా అయిన మెగాస్టార్ చిరంజీవి.. ఆ సీజన్ ఫినాలే సమయంలో 'భోళా శంకర్' సినిమాలో అవకాశం ఇస్తున్నట్లుగా స్టేజీపైనే ప్రకటించారు.

   నటనతో ఆకట్టుకుని..

  నటనతో ఆకట్టుకుని..

  భోళా శంకర్ సినిమాలో దివి వాద్యాకు అవకాశం ఇస్తున్నట్లు చిరంజీవి ప్రకటించిన.. ఆ మూవీ సంగతి ఎటు ఉన్న దానికంటే ముందుగానే గాడ్ ఫాదర్ చిత్రంలో ఛాన్స్ ఇచ్చారు. ఇటీవల విడుదలై విజయం సాధించిన గాడ్ ఫాదర్ చిత్రంలో దివి వాద్యా కీలక పాత్ర పోషించింది. ఆ పాత్రకు తగిన నటనతో ఆకట్టుకున్న దివికి మంచి మార్కులే పడ్డాయి. అలా బిగ్ బాస్ షో తర్వాత దివి వాద్యా వరుసగా సినిమాలు చేసింది.

  ఏటీఎం వెబ్ సిరీస్ తో..

  ఏటీఎం వెబ్ సిరీస్ తో..

  ఈ క్రమంలోనే 'నయీం డైరీస్' మూవీలో దివి చేసిన హాట్ సీన్ ఎంతో హైలైట్ అయింది. ఇది తెగ వైరల్ అవడంతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. సినిమాలే కాకుండా మానీళ్ల ట్యాంక్, పరంపర 2 వంటి వెబ్ సిరీస్ ల్లోనూ ఆకట్టుకుంది దివి వాద్యా. అంతకుముందు క్యాబ్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో, లంబసింగి సినిమాలో హీరోయిన్ గా కూడా చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు తాజాగా ఏటీఎం అనే వెబ్ సిరీస్ తో మరోసారి ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది అందం.

   మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా..

  మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా..


  సినిమాలు, సిరీస్ లే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది ఈ భామ. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. ఫొటోలు, వీడియోలు వదులుతూ గత ఏడాది మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్‌గానూ ఎంపికైంది. సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో హల్ చల్ చేసే దివి వాద్యా తాజాగా మరో ఫొటోను వదిలింది.

   వైట్ డ్రెస్సులో..

  వైట్ డ్రెస్సులో..

  దివి వాద్యా తాజాగా వదిలిన ఫొటోలో తన నాభి అందాన్ని చాలా ఘాటుగా చూపించింది. వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న దివి వాద్యా ట్రెడిషనల్ గా కనిపిస్తూనే తన నాభి కనిపించి కనపడకుండా ఉండేలా సిగ్గు పడుతూ పోజు ఇచ్చింది. ఏటీఎం వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ కి ముందు జరిగిన ఓ పూజ సందర్భంగా వేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో దివి వాద్యా అందానికి యూత్ ఫిదా అవుతుంది.

  English summary
  Bigg Boss Telugu 4 Season Fame Divi Vadthya Latest Hot Photo And Showing Her Waist In White Colour Dress Goes Viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X