‘నాకు అమ్మాయిల మీదే క్రష్.. ఇష్టం లేకుండానే శృంగారం చేశా’

ఫిదా సినిమాలో హీరోయిన్ సాయిపల్లవి స్నేహితురాలిగా కనిపించి ఆకట్టుకున్నారు గాయత్రి గుప్తా. సినిమాల కంటే వివాదాలతోనే ఈ ముద్దుగుమ్మ వార్తల్లో నిలుస్తున్నారు. అప్పట్లో మీటూ ఉద్యమం సమయంలో ఇండస్ట్రీలోని చీకటి బాగోతాలను బయటపెట్టి సంచలనం సృష్టించింది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు తనకు అవకాశం ఇస్తానని చెప్పి వాడుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గాయత్రి గుప్తా తన రిలేషన్స్ గురించి చెప్పి బయటపెట్టింది. ఈ వివరాల్లోకి వెళితే..

మగాడికి ఆడది తగ్గదు
'ఒకప్పుడు ఆడవాళ్లు ఇంటికి, కిచెన్‌కి పరిమితం అయ్యేవారని ఇప్పుడు సొసైటీలోకి వస్తున్నారు. మిలీనియం జనరేషన్ నుంచి ఆడవాళ్లు సొసైటీలోకి రావడంతో వాళ్లని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియడం లేదు. మగవాళ్ల కోసం డిజైన్ చేయబడ్డ సొసైటీలో ఆడవాళ్లను అలా హ్యాండిల్ చేయాలో ఆడవాళ్లకి అర్ధం కావడం లేదు, మగవాళ్లకి అర్ధం కావడం లేదు. ఒక జార్‌లో నల్లచీమలు, ఎర్రచీమలు వేసి షేక్ చేసేస్తే .. రెండు రకాలు కొట్టుకుంటున్నాయి తప్పించి సొసైటీ షేక్ అవుతున్న విషయాన్ని ఎవ్వరూ అర్ధం చేసుకోవడం లేదు. మగాడు బయట తిరిగొచ్చి ఆడదాన్ని వేధిస్తాడు. ఆడది ఎప్పుడూ బయటకు చెప్పుకోలేదు, అమ్మమ్మలు, నానమ్మలు తగ్గుతూ వచ్చారు. ఇప్పుడు మగాడికి ఆడది ఏ విషయంలోనూ తక్కువ కాదు. వాల్యూ ఇవ్వడం లేదు, రెస్పెక్ట్ దొరకడం లేదని మనసులో పెట్టుకుని పెరుగుతారో వాళ్లే క్రిమినల్స్‌గా తయారవుతారు' అని గాయత్రి గుప్తా అన్నారు.

Bigg Boss Fame Gayathri Gupta Made sensational comments on relationshp

అమ్మాయిలంటే పిచ్చి
'చిన్నప్పటి నుంచి అమ్మాయిలను చూస్తే కూడా నాకు మంచిగా అనిపించేది. ఎక్కువగా నేను అమ్మాయిలకే అట్రాక్ట్ అయ్యేదానిని. చిన్నప్పటి నుంచి అమ్మాయిలకు పెళ్లి, సంసారం అనేవి ముఖ్యమని మనకి నేర్పిస్తూ పెంచుతారు. అమ్మాయిలకు చివరి లక్ష్యం పెళ్లి. కానీ సొసైటీలో నాకు అమ్మాయి ఇష్టం అని చెప్పే ధైర్యం కానీ, స్పేస్ కానీ, ఇది కరెక్టా కాదా అనేది కూడా నాకు తెలియదు. నేను కామాంధురాలినేమో అందుకే ఇలా ఆలోచిస్తున్నానేమో తప్పు తప్పు అని నేను బయటపెట్టలేదు. పెద్దయ్యాకే బై సెక్సువల్ అనేది ఒకటి ఉంటుందని తెలిసింది. కానీ ఇప్పటికీ నేను దాని గురించి చెప్పలేదు. ఎందుకంటే దానిని ఎక్స్‌ప్రెస్ చేసేంత స్పేస్ లేదు' అని గాయత్రి గుప్తా తెలిపారు.

కుటుంబం కావాలి, ప్రేమ కావాలి
'నేను చిన్నప్పటి నుంచి సర్వైవల్ మోడ్‌లోనే తిరుగుతున్నాను.. నా సేఫ్టీ, నా డబ్బులు, నా హెల్త్ గురించి కొట్టుకోవడం వల్ల నా సెక్సువాలిటీ గురించి ఎక్స్‌ప్రెస్ చేయలేకపోయా. నాకు ఏది ఇష్టం, నేనేం కోరుకుంటున్నా.. ఇది ఉంటే నేను హ్యాపీగా ఉంటా అనేది బయటికి చెప్పలేదు. నాకు రిలేషన్‌షిప్స్ ఉన్నాయి, బ్రేకప్స్ జరిగాయి. ఒంటరిదానిని అయిపోయా, ఫ్యామిలీ లేదు... కుటుంబం కావాలంటే భర్త నుంచే వస్తుంది. చిన్నప్పటి నుంచి అమ్మానాన్న ప్రేమను మిస్ అయ్యాను. ఫ్యామిలీ కావాలి, నాకు ప్రేమ కావాలి అనే ఆశ కొద్ది ఈ రిలేషన్‌షిప్‌లోనూ నచ్చినా నచ్చకున్నా శృంగారంలో పాల్గొన్నా' అని గాయత్రి గుప్తా బయటపెట్టారు

నా తండ్రే కరెక్ట్‌గా లేడు
'మగాళ్లు 100 శాతం పర్ఫెక్ట్‌గా ఉండరు.. పెద్దోళ్లకి చెబితే మార్చుకోమని చెబుతారు, కానీ మొగుడు మారడు కదా. 30 ఏళ్ల తర్వాత నేనేం కోల్పోయానో తెలుసుకున్నా.. ఫ్యామిలీ ఉంటేనే కానీ వాల్యూ లేదని తెలుసుకుని అర్హత లేని వ్యక్తితో రిలేషన్‌ పెట్టుకుని వాళ్లకి నేను తగ్గాను అనే శాడ్ ఫీలింగ్ వచ్చింది. అమ్మాయిలు ఎప్పుడు తనకు కాబోయే భర్త అచ్చం తన తండ్రిలా ఉండాలని కోరుకుంటుంది. అబ్బాయిలు ఎప్పుడూ అమ్మలాంటి అమ్మాయిని కోరుకుంటారు. కానీ నాకు నా తండ్రే కరెక్ట్‌గా లేడు' అని గాయత్రి గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు.

More from Filmibeat

Read more about: bigg boss gayathri gupta
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X