తొలిసారి బికినీలో బిగ్ బాస్ ఇనాయా: స్విమ్మింగ్ పూల్‌లో కిక్ ఎక్కించేలా!
ఇనాయా సుల్తానా.. తెలుగు రాష్ట్రాల బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ ముద్దుగుమ్మ ఆకట్టుకునే అందంతో పాటు అభినయంతో మెప్పిస్తూ దూసుకుపోతోంది. అదే సమయంలో ఎంతో బోల్డుగా ఉంటూ తరచూ హైలైట్ అవుతోంది. ముఖ్యంగా బిగ్ బాస్ షో తర్వాత ఇనాయా సుల్తానా సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్‌లో రచ్చ చేస్తూ కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ బోల్డ్ లేడీ కొన్ని గ్లామరస్ పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఆలస్యం చేయకుండా వాటిని మీరే చూసేయండి!
ఆ సినిమాలు చేసినా కానీ:సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్న లక్ష్యంతో మోడల్‌గా మారిన ఇనాయా సుల్తానా.. కొంత కాలంలోనే పాపులర్ అయింది. ఆ తర్వాత 'ఏవం జగత్' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంటరైంది. అనంతరం 'బుజ్జి ఇలారా', 'నటరత్నాలు', 'యద్భావం తద్భవతి' వంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఇలా ఎన్నో చిత్రాల్లో చేసినప్పటికీ ఆమెకు గుర్తింపు దక్కలేదు.

వర్మ పార్టీతో ఫుల్ ఫేమస్:ఎన్నో మూవీల్లో నటించినా పాపులర్ కాలేకపోయిన ఇనాయా సుల్తానా.. రాంగోపాల్ వర్మతో మందు పార్టీ చేసుకున్న వీడియోల వల్ల సంచలనంగా మారింది. ఫలితంగా ఆమె పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగింది. అప్పటి నుంచి ఇనాయా సుల్తానాకు ఎన్నో అవకాశాలు కూడా లభించాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఆరో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం కూడా అందుకుంది.
బిగ్ బాస్ ఎంట్రీతో క్రేజ్:బిగ్ బాస్ షోలోకి వెళ్లిన కొద్ది సమయంలోనే బోల్డు బ్యూటీ ఇనాయా సుల్తానా యమ హైలైట్ అయింది. ఆ తర్వాత అసాధారణమైన టాలెంట్లతో సత్తా చాటింది. ముఖ్యంగా డేరింగ్‌గా ఉంటూ రచ్చ రచ్చ చేసింది. ఫలితంగా ఈ అమ్మడు ఫినాలే ముందు వరకూ షోలో కొనసాగింది. దీంతో ఇనాయా అంటే ప్రపంచానికి తెలిసింది. అదే సమయంలో ఆమె క్రేజ్ కూడా రెట్టింపు చేసుకుంది.

ఆఫర్లు లేకున్నా రచ్చ:ఇనాయా సుల్తానా బిగ్ బాస్ షో తర్వాత మరింతగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. దీంతో ఆమెకు అవకాశాలు బాగా వస్తాయని అంతా అనుకున్నారు. కానీ, 'బీబీ జోడీ' షోలో మాత్రమే ఆఫర్ దక్కించుకుంది. కానీ, వెంటనే ఎలిమినేట్ అవడంతో నిరాశ పరిచింది. అలాగే, 'క్రాంతి' అనే మూవీ చేసింది. ఇప్పుడు మాత్రం పర్సనల్ టూర్లతో ఇనాయా తెగ రచ్చ చేసేస్తోంది.

అక్కడ యమ యాక్టివ్:బుల్లితెరపై, వెండితెరపై సుదీర్ఘ కాలంగా సత్తా చాటుతోన్న ఇనాయా సుల్తానా.. ఈ మధ్య కాలంలోనే కాస్త బిజీగా ఉంటోంది. అయినా ఈ హాట్ లేడీ సోషల్ మీడియాలోనూ ఎప్పటి నుంచో తెగ హడావిడి చేసేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది.
గ్లామర్ ట్రీట్ ఇస్తోంది:సోషల్ మీడియాలో ఆరంభం నుంచే ఇనాయా సుల్తానా స్పెషల్ అనిపించుకుంటోంది. ముఖ్యంగా తరచూ గ్లామర్‌ను చూపిస్తూ ఈ చిన్నది ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే నిత్యం ఇనాయా సుల్తానా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది. దీంతో ఈ అమ్మడి పేరు ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారుతూ ట్రెండ్ అవుతోంది.

ఇనాయా పిక్స్ వైరల్:బోల్డు లేడీ ఇనాయా సుల్తానా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఘాటు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు తొలిసారి బికినీ మాత్రమే ధరించి స్విమ్మింగ్ పూల్‌లో సందడి చేస్తోంది. అంతేకాదు, రెచ్చగొట్టే ఫోజులతో కాక రేపుతోంది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇనాయా ఫొటోలు అన్నీ వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











